newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

హైదరాబాద్ లో భారీ స్థాయిలో పెట్టుబడులు

12-08-202012-08-2020 09:05:44 IST
Updated On 12-08-2020 10:46:30 ISTUpdated On 12-08-20202020-08-12T03:35:44.942Z12-08-2020 2020-08-12T03:34:37.783Z - 2020-08-12T05:16:30.288Z - 12-08-2020

హైదరాబాద్ లో భారీ స్థాయిలో పెట్టుబడులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ఓ పేరెన్నికగన్న సంస్థ ముందుకొచ్చింది. మెడికల్ విడి భాగాల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన మెడ్‌ట్రోనిక్ తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకుంది. అమెరికా బయట మెడ్‌ట్రోనిక్‌కు అతిపెద్ద ఆర్అండ్‌డీ సెంటర్ ఇదే కావడం విశేషం. 

ఇందుకోసం సుమారు రూ.1200 కోట్లతో తన ప్రస్తుత కార్యకలాపాలను తెలంగాణలో నెలకొల్పనుంది. ప్రస్తుతం ఉన్న తన పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని మరింతగా విస్తరించనుంది. ఈ పెట్టుబడితో మెడికల్ డివైసెస్ హబ్‌గా హైదరాబాద్ లో ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.

మంగళవారం నాడు జరిగిన వర్చువల్ మీటింగ్‌లో భాగంగా కేటీఆర్.. మెడ్‌ట్రోనిక్ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలను వివరించారు. మెడ్‌ట్రోనిక్ కంపెనీ హైదరాబాద్ నగరాన్ని తమ అతిపెద్ద ఆర్‌అండ్‌డి సెంటర్‌కి గమ్యస్థానం ఎంచుకోవడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మెడికల్ విడిభాగాల రంగంలో గత కొన్ని సంవత్సరాలుగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఈ పెట్టుబడితో మెడ్‌‌టెక్ హబ్‌గా హైదరాబాద్ మారుతుందని మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు. 

మరిన్ని పెట్టుబడులు, అనేక ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. తన అమెరికా పర్యటనలో కంపెనీ చైర్మన్‌గా ఎంపికైన సందర్భంగా ఒమర్‌కు అభినందనలు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు.మెడ్ టెక్ రంగ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మెడ్‌ట్రోనిక్‌తో ఇప్పుడు జరుగుతున్న ఒప్పందమే ఇందుకు నిదర్శనమని మంత్రి తెలిపారు. 

మెడికల్ డివైసెస్ కంపెనీలతో కలిసి పనిచేస్తూ ప్రపంచ ఆరోగ్య రంగంలో సానుకూల మార్పు దిశగా పని చేస్తామని మంత్రి అన్నారు. ఈ పెట్టుబడి ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పనతో పాటు, ఈ రంగంలో మరిన్ని నూతన పెట్టుబడులు వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

హ‌రీశ్ వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్..దుబ్బాక‌లో దుమ్ముదుమారం

హ‌రీశ్ వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్..దుబ్బాక‌లో దుమ్ముదుమారం

   10 hours ago


వ‌ల్ల‌భ‌నేని వంశీ దారెటు..? అనుచ‌రుల కొత్త స‌ల‌హా!

వ‌ల్ల‌భ‌నేని వంశీ దారెటు..? అనుచ‌రుల కొత్త స‌ల‌హా!

   13 hours ago


అమరావతిని తప్పించిన ఎక్స్‌ప్రెస్ వే.. కేంద్రం ఆమోదముద్ర

అమరావతిని తప్పించిన ఎక్స్‌ప్రెస్ వే.. కేంద్రం ఆమోదముద్ర

   16 hours ago


టీడీపీ కొత్త టీమ్

టీడీపీ కొత్త టీమ్

   17 hours ago


తల దూర్చకంటూ బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన జేపీ నడ్డా

తల దూర్చకంటూ బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన జేపీ నడ్డా

   17 hours ago


కరోనా కేసుల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌ ఏపీ..

కరోనా కేసుల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌ ఏపీ..

   18 hours ago


మీలో మాస్క్ మహారాజు ఎవరు.. తెలంగాణ సర్కార్ కొత్త ప్రచారం

మీలో మాస్క్ మహారాజు ఎవరు.. తెలంగాణ సర్కార్ కొత్త ప్రచారం

   19 hours ago


బీసీ నేతలు చేయలేని మేలు ఏపీ సీఎం చేశారు.. ఆర్‌. కృష్ణయ్య

బీసీ నేతలు చేయలేని మేలు ఏపీ సీఎం చేశారు.. ఆర్‌. కృష్ణయ్య

   19 hours ago


పాకిస్థాన్ ప్ర‌ధానికి మూడిన‌ట్లే ఉంది

పాకిస్థాన్ ప్ర‌ధానికి మూడిన‌ట్లే ఉంది

   19 hours ago


ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న వరుణ భీభత్సం

ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న వరుణ భీభత్సం

   21 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle