newssting
BITING NEWS :
* జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం *మెట్రో రైలు సర్వీసులకు .. అంతర్జాతీయ విమానాలకు అనుమతి లేదు *సినిమా హాల్స్, జిమ్, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, బార్లు, రాజకీయ వేదికలకు అనుమతి లేదు* ఢిల్లీ ఎయిరిండియా విమానంలో కరోనా కలకలం *ఏపీలో కొత్తగా 70 కరోనా కేసులు.. 2944 కి చేరిన కేసులు .. ఏపీలో యాక్టివ్ కేసులు 792 *పంట కొనుగోలు కేంద్రాలను జూన్ 8వ తేదీ వరకు కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు..మొదట మే 31వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాలు

హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

22-01-202022-01-2020 13:09:52 IST
2020-01-22T07:39:52.913Z22-01-2020 2020-01-22T07:39:46.443Z - - 30-05-2020

హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశం మొత్తం ఆర్ధిక మాంద్యం ప్రభావంతో చాలా రంగాలలో ఆశించిన మేర పురోగతి లేదు. ముఖ్యంగా నిర్మాణ, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వంటి కొన్ని రంగాలు నెమ్మదించాయన్నది కేంద్ర ఆర్ధిక శాఖ పలుమార్లు ప్రకటించిన నివేదికలలో చెప్పిందే. దేశంలో పరిస్థితుల గమనించిన కేంద్రం కూడా మాంద్యం నుండి బయటపడేందుకు పలు చర్యలను తీసుకొని చక్కదిద్దే ప్రయత్నం కూడా చేసింది.

అయితే దేశం మొత్తం మాంద్యం ప్రభావం ఉన్నా ఒక్క హైదరాబాద్ నగరంలో మాత్రం అది పెద్దగా కనిపించడం లేదన్నది ఇక్కడి వ్యాపార విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే నూతన సంవత్సరం జనవరి నెలలో కూడా హైదరాబాద్ నగరంతో పాటు సిటీ చుట్టుపక్కల పంచాయతీల వరకు నివాస యోగ్యమైన స్థలాలు.. ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని చెప్తున్నారు.

ఆ మధ్య దేశంలో ఆర్ధిక మాంద్యం తలెత్తిన కొత్తలో హైదరాబాద్ నగరంలో ఈ తరహా వ్యాపారం కొద్దిగా నెమ్మదించింది. అయితే, కొత్తగా వెంచర్లు వేయడం, లే అవుట్లు వేయడం వంటివి ఆపేయడంతో పాత వెంచర్లు, అప్పటికి నిర్మాణం పూర్తయిన సముదాయాలు ప్రస్తుతం అమ్ముడైపోయాయి. అదే సమయంలో పొరుగు రాష్ట్రం ఏపీలో తలెత్తిన పరిణామాలు కూడా హైదరాబాద్ నెత్తిన పాలు పోసినట్లయింది.

అక్కడ మూడు రాజధానుల ప్రాపకం.. నిలకడలేని ప్రభుత్వం విధానాలు వెరసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గానీ.. స్థిరపడేందుకు గానీ ఎవరూ ముందుకు రావడం లేదని చెప్తున్నారు. అదే సమయంలో బెంగళూరు, చెన్నై, పూణే వంటి నగరాలలో ప్రభుత్వాలు కొత్త నిర్మాణాలకు అనుమతులకు ఆచితూచి వ్యవహరించడం కూడా హైదరాబాద్ కి కలిసి వచ్చింది.

ఇదే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పలు సర్వేలు కూడా హైదరాబాద్ నగరానికి గొప్ప ర్యాంకులను కట్టబెట్టడంతో హైదరాబాద్ ఇళ్ల ధరలు కొండెక్కిపోతున్నాయి. ప్రపంచ స్థాయిలో నివాస గృహాల ధరల వృద్ధిలో భాగ్యనగరం 14వ స్థానంలో నిలవగా.. 150 విశ్వ నగరాల్లో టాప్‌-20లో హైదరాబాదే ఏకైన నగరంగా చోటు దక్కించుకోవడం విశేషం. 2019లో హైదరాబాద్‌లో ఇండ్ల ధరలు 9 శాతం పుంజుకున్నట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్‌ నైట్‌ ఫ్రాంక్‌ తెలిపింది.

గ్లోబల్‌ రెసిడెన్షియల్‌ సిటీస్‌ ఇండెక్స్‌ క్యూ3 2019’ పేరుతో విడుదలైన జాబితాలో భాగ్యనగరం సత్తా చాటింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా వంటి దేశంలోని ఇతర పెద్ద నగరాలు హైదరాబాద్‌ సమీపంలో కూడా లేకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఇలానే కొనసాగితే హైదరాబాద్ ప్రపంచంలో అత్యున్నత నగరాలలో తొలి మూడు నగరాలలో ఒకటిగా నిలిచినా ఆశ్చర్యం లేదంటున్నారు.

 

 

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   13 minutes ago


బ్రేకింగ్: జూన్ 30 వరకూ లాక్ డౌన్ 5.O

బ్రేకింగ్: జూన్ 30 వరకూ లాక్ డౌన్ 5.O

   an hour ago


మెడికల్ స్టూడెంట్స్‌కు జగన్ బంపర్ ఆఫర్

మెడికల్ స్టూడెంట్స్‌కు జగన్ బంపర్ ఆఫర్

   2 hours ago


వారసులకే జయ ఆస్తులు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

వారసులకే జయ ఆస్తులు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

   4 hours ago


ఒక వైపు కరోనా ఉధృతి.. పిడుగురాళ్ళలో సున్నపురాయి దోపిడీ

ఒక వైపు కరోనా ఉధృతి.. పిడుగురాళ్ళలో సున్నపురాయి దోపిడీ

   8 hours ago


నిమ్మగడ్డ రమేష్ కేసు.. ఎవరెవరు ఏమన్నారంటే...?

నిమ్మగడ్డ రమేష్ కేసు.. ఎవరెవరు ఏమన్నారంటే...?

   8 hours ago


అనంతలో కలకలం రేపిన మిడతల దండు..శాస్త్రవేత్తల భరోసా

అనంతలో కలకలం రేపిన మిడతల దండు..శాస్త్రవేత్తల భరోసా

   9 hours ago


దేశాన్నే అబ్బురపరిచే కేసీఆర్ ‘తీపి కబురు’ ఏమిటి? సర్వత్రా ఆసక్తి

దేశాన్నే అబ్బురపరిచే కేసీఆర్ ‘తీపి కబురు’ ఏమిటి? సర్వత్రా ఆసక్తి

   9 hours ago


వరవరరావుని వెంటనే విడుదల చేయాలి.. భార్య హేమలత డిమాండ్

వరవరరావుని వెంటనే విడుదల చేయాలి.. భార్య హేమలత డిమాండ్

   10 hours ago


వరవరరావుకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

వరవరరావుకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

   11 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle