newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

హైదరాబాద్ పోలీసును తాకిన కరోనా.. తొలికేసు నమోదు!

07-04-202007-04-2020 13:58:28 IST
Updated On 07-04-2020 14:43:32 ISTUpdated On 07-04-20202020-04-07T08:28:28.939Z07-04-2020 2020-04-07T08:28:07.024Z - 2020-04-07T09:13:32.878Z - 07-04-2020

హైదరాబాద్ పోలీసును తాకిన కరోనా.. తొలికేసు నమోదు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు వందలు దాటేసింది. రోజు రోజుకి భారీగా కేసులు బయటపడుతున్నాయి. అయితే, వీటిలో దాదాపుగా తొంబై శాతం ఢిల్లీ మర్కజ్ ప్రాంతంలో ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారే కాగా ప్రైమరీ కాంట్రాక్ట్ ద్వారా వచ్చిన కేసులు స్వల్పంగా బయటపడుతున్నాయి. ఢిల్లీ కేసులలో ఫైనల్ ఫలితాలు ఎప్పటికి వస్తాయన్నది తేలితేనే ఈ సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

కాగా, ఈ విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు, వైద్య బృందాలు, పోలీసులు, మున్సిపల్, కార్పొరేషన్ కార్మికులు, సిబ్బంది వంటి అత్యవసర సర్వీసులలో సేవలు అందించేవారు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారు. ఎంతటి జాగ్రత్తలు తీసుకున్నా.. వీరిని కూడా మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే హైదరాబాద్ నగరానికి చెందిన ఓ డాక్టర్ దంపతులకి పాజిటివ్ గా నమోదైన సంగతి తెలిసిందే.

కాగా నగరంలో పోలీసు శాఖను కూడా కరోనా తాకింది. తాజాగా సైఫాబాద్ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ స్టేషన్లో పనిచేసే 12 మంది సిబ్బంది క్వారంటైన్లోకి వెళ్లారు. అయితే, పాజిటివ్ తేలిన కానిస్టేబుల్ ఎక్కడికీ ప్రయాణించలేదని తెలుస్తోంది. దీంతో తెలంగాణ పోలీసు విభాగం అప్రమత్తమైంది.

పాజిటివ్ వచ్చిన కానిస్టేబుల్ గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్ తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద పికెటింగ్ దగ్గర విధులు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. అయితే ఢిల్లీ నిజాముద్దీన్ నుండి వచ్చిన వారితో కలిసి నగరంలో ప్రార్ధనలకు వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. కాగా ఇంతకు ముందు భద్రాద్రి జిల్లా కొత్తగూడెం డీఎస్పీకి కరోనా పాజిటివ్ అని తేలింది.

లండన్ నుంచి తిరిగి వచ్చిన ఆయన కుమారుడి వలన డీఎస్పీకి పాజిటివ్ రాగా ఇప్పుడు కానిస్టేబుల్ కి ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ కానిస్టేబుల్ పనిచేసే స్టేషన్లో అందరినీ క్వారంటైన్ కి తరలియించగా ఇతను ఎవరెవరిని కలిశారు అన్న దానిపై సెర్చ్ మొదలుపెట్టారు. మరోవైపు ఢిల్లీ నుండి వచ్చిన వారు.. వారి కుటుంబాలలో ఇంకా ఫలితాలు రావాల్సిన కేసులు చాలానే ఉన్నట్లుగా తెలుస్తుంది.

గత రెండు వారాల కిందట సీఎం కేసీఆర్ ఈరోజుకి దాదాపుగా రాష్ట్రంలో కరోనాను తరిమికొడతామని చెప్పారు. కానీ అనూహ్యంగా ఢిల్లీ నిజాముద్దీన్ రూపంలో బాంబు పేలినట్లయింది. దీంతో కేసుల సంఖ్య రోజురోజుకు పెరగడంతో పాటు వారు స్వచ్ఛదంగా ప్రభుత్వానికి సహకరించకపోవడం కూడా తీవ్ర ఇబ్బంది కరంగా మారింది. ఇప్పటికీ ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి కుటుంబాలను.. సన్నిహితులను క్వారంటైన్ లో ఉంచినట్లుగా ప్రభుత్వం చెప్పలేకపోతుంది.

కేంద్రం విధించిన లాక్ డౌన్ కు ఒక వారం ముందే తెలంగాణలో కరోనాను అధీనంలోకి తెచ్చుకోవాలన్న సీఎం కేసీఆర్ ఆశలు ఢిల్లీ బృందాలు నాశనం చేసినట్లుగానే చెప్పుకోవాలి. పైగా ఇప్పుడు కేంద్రం ఈనెల 14 తో లాక్ డౌన్ ముగించినా మరో రెండు వారాలు పొడగించాలని ప్రతిపాదిస్తానని సీఎం కేసీఆర్ తాజాగా నిర్ణయించుకున్నారంటే నిజాముద్దీన్ ప్రభావం ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

 

 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   5 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   7 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   10 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   12 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   13 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   13 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   13 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   14 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   14 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   14 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle