హైదరాబాద్ దశ తిరిగేలా ఐటీ గ్రిడ్ తీసుకొస్తాం.. ఐటీ మంత్రి కేటీఆర్
16-07-202016-07-2020 16:48:10 IST
Updated On 16-07-2020 17:38:02 ISTUpdated On 16-07-20202020-07-16T11:18:10.331Z16-07-2020 2020-07-16T11:18:08.044Z - 2020-07-16T12:08:02.294Z - 16-07-2020

తెలంగాణలో పరిశ్రమలకు, ప్రత్యేకించి ఐటీ పరిశ్రమలకు పునరుత్తేజం కలిగించే ప్రకటన ఇది. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చే నూతన గ్రిడ్ విధానంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోనున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చే గ్రిడ్ విధానం ద్వారా ఐటీ పరిశ్రమలు హైదరాబాద్లోని ఇతర ప్రాంతాలకు తరలివస్తాయనే ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. హైదరాబాద్కు తూర్పున ఉప్పల్ వైపు ప్రస్తుతమున్న ఐటీ కంపెనీలకు తోడు మరిన్ని ఐటీ, అనుబంధ కంపెనీల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.
హైదరాబాద్ గ్రోత్ ఇన్ డిస్పెర్షన్ (గ్రిడ్) కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ బుధవారం ఉప్పల్ ఎన్ఎస్ఎల్ ఎరెనాలో ఐటీ కంపెనీల ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. తూర్పు హైదరాబాద్లో ఐటీ రంగం స్థితిగతులు, భవిష్యత్తు పెట్టుబడులపై మంత్రి ఈ సమావేశంలో చర్చించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగాన్ని హైదరాబాద్లోని అన్ని మూలలకూ విస్తరించేందుకు త్వరలో గ్రిడ్ విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు.
హైదరాబాద్ నలువైపులా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, మెడికల్ డివైజెస్ వంటి పరిశ్రమలు విస్తరించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఔటర్ రింగు రోడ్డు వెలుపలకు కాలుష్య కారక పరిశ్రమలు తరలివెళ్తే, వాటి స్థలాలను ఐటీ రంగ కార్యాలయాల అభివృద్ధికి అనుమతినిచ్చే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ఈస్ట్ హైదరాబాద్లో ఇప్పటికే మెట్రో, శిల్పారామం, మూసీ నది అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మౌలిక వసతులు మెరుగవుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వైపు, అంబర్ పేట్ రామాంతాపూర్ ఫ్లై ఓవర్ల ద్వారా రోడ్లు, మౌలిక వసతులు మరింత మెరుగవుతాయన్నారు.
హైదరాబాద్ నలుమూలలా పారిశ్రామిక స్థలాలను ఐటీ పార్కులుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన కన్వర్షన్ పత్రాలను ఐదు ఐటీ కంపెనీల ప్రతినిధులకు కేటీఆర్ బుధవారం అందజేశారు. ఐదు కంపెనీల ద్వారా దాదాపు 25 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అభివృద్ధి చేస్తామన్నారు. తద్వారా ఉప్పల్ ప్రాంతంలో మరో 30వేల మంది ఐటీ ఉద్యోగులకు అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఈ కీలక సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, రాచకొండ కమీషనర్ మహేశ్ భగవత్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
ఐటీ పార్కులుగా మారనున్న స్థలాలు
- 12.40 ఎకరాలు. హైదరాబాద్ డిస్టిల్లరీస్ అండ్ వైనరీస్ లిమిటెడ్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా - ఉప్పల్
- 2.66 ఎకరాలు. మినాక్టో చెమ్, ఐడీఏ - ఉప్పల
- 2.00 ఎకరాలు. స్వామీ సోప్స్ అండ్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐడీఏ ఉప్పల్
- 8.93 ఎకరాలు. గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్, మినీ టెక్స్టైల్ పార్క్, నాచారం
- 8 ఎకరాలు. బకెలైట్ హైలామ్ లిమిటెడ్, ఐడీఎ, నాచారం

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
an hour ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
3 hours ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
2 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
4 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
4 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
5 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
21 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
22-04-2021
ఇంకా