newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కృషి.. 5.6 కిలోమీటర్లు 5 నిమిషాలలో..!

15-09-202015-09-2020 14:04:17 IST
Updated On 15-09-2020 15:12:16 ISTUpdated On 15-09-20202020-09-15T08:34:17.904Z15-09-2020 2020-09-15T08:34:15.615Z - 2020-09-15T09:42:16.994Z - 15-09-2020

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కృషి.. 5.6 కిలోమీటర్లు 5 నిమిషాలలో..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరో సారి ప్రాణాలను కాపాడారు. అవయవాలను తీసుకుని వెళ్తున్న వాహనం కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి 5.6 కిలోమీటర్ల దూరాన్ని 5 నిమిషాలలో చేరుకునేలా చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులపై మరోసారి అభినందనల వర్షం కురుస్తోంది. లైవ్ ఆర్గాన్(లంగ్స్) కోసం నాన్-స్టాప్ మూమెంట్ ను ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ సిటీ, ట్రాఫిక్ అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అనిల్ కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 14, 2020 రాత్రి 9:48 నిమిషాల సమయంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేశారు. లైవ్ ఆర్గాన్ ( ఊపిరితిత్తులు) లను తీసుకుని వెళ్లే అంబులెన్స్ కోసం గ్లెన్ ఈగల్స్ గ్లోబల్ హాస్పిటల్ (లక్డీకపూల్) ప్రాంతం నుండి కిమ్స్ ఆసుపత్రి, మినిస్టర్స్ రోడ్ బేగంపేట, హైదరాబాద్ మధ్య దూరాన్ని 5 నిమిషాల్లో చేరుకునేలా చేశామన్నారు.

లైవ్ ఆర్గాన్స్ ను తీసుకుని వెళుతున్న మెడికల్ టీమ్ 9:48 సమయంలో గ్లెన్ ఈగల్స్ గ్లోబల్ హాస్పిటల్ నుండి బయలుదేరి 9:53 సమయానికల్లా కిమ్స్ ఆసుపత్రికి చేరుకుంది.    

ట్రాఫిక్ పోలీసుల కృషి పట్ల గ్లెన్ ఈగల్స్ గ్లోబల్ హాస్పిటల్ యాజమాన్యం సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఒక ప్రాణాన్ని కాపాడిన వారయ్యారని ఆసుపత్రి యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. 2020 సంవత్సరంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అవయవాలను తరలించేలా హైదరాబాద్ పోలీసులు చేయడం ఇది 8వ సారి.

ఈ నెలలోనే హైదరాబాద్ పోలీసులు నాన్ స్టాప్ మూమెంట్ ను క్రియేట్ చేసి కిడ్నీ, లంగ్స్, లివర్ ను తరలించేందుకు దోహదపడ్డారు. సెప్టెంబర్ 5న మూడు లైవ్‌ ఆర్గాన్స్‌ కోసం నగర ట్రాఫిక్‌ పోలీసులు శనివారం ‘గ్రీన్‌ ఛానల్‌’ ఇచ్చారు. ఫలితంగా ఈ 11.5 కిమీ మార్గాన్ని అంబులెన్స్‌ కేవలం 9 నిమిషాల్లో అధిగమించింది.

దీనికి పైలెట్‌గా వాహనంలో వెళ్లిన స్థానిక ట్రాఫిక్‌ పోలీసుల నుంచి ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తున్న వారి వరకు పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది సమష్టిగా, సమన్వయంతో పని చేయడంతోనే ఇది సాధ్యమైందని నగర ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. సెప్టెంబర్ 5న ఉదయం 9 గంటలకు లైవ్‌ ఆర్గాన్‌ బాక్స్‌ లతో కూడిన అంబులెన్స్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి పంజగుట్ట, బేగంపేట రసూల్‌పురా, ప్రకాష్‌నగర్‌ మీదుగా ప్రయాణించి సరిగ్గా 9.09 గంటలకు కిమ్స్‌ ఆస్పత్రికి చేరింది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle