newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి కెన్యా జాతీయుల తరలింపు

08-05-202008-05-2020 09:12:00 IST
Updated On 08-05-2020 10:05:15 ISTUpdated On 08-05-20202020-05-08T03:42:00.476Z08-05-2020 2020-05-08T03:41:41.915Z - 2020-05-08T04:35:15.626Z - 08-05-2020

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి కెన్యా జాతీయుల తరలింపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండిగో ప్రత్యేక విమానం ద్వారా 32 కెన్యా జాతీయులు స్వదేశానికి తరలించింది ప్రభుత్వం. ప్రపంచం మొత్తం కోవిడ్-19 మహమ్మరి బారిన చిక్కుకున్న ఇలాంటి విపత్కర సమయంలో, భారతదేశమంతా లాక్‌డౌన్‌లో ఉన్న సందర్భంలో, కోవిడ్-19 రిలీఫ్ మరియు తరలింపు విమానాలను హ్యాండిల్ చేస్తూ GMR ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో చిక్కుకుపోయిన ఇతర దేశాల వారిని సరిహద్దులు దాటిస్తూ జాతికి తన వంతు సేవలను అందిస్తోంది. 

దీనిలో భాగంగా తెలంగాణలో చిక్కుకుపోయిన కెన్యా జాతీయులను వారి స్వదేశానికి తరలించేందుకు ఒక ప్రత్యేక విమానం హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చి వెళ్లింది.  ఇండిగో ఎయిర్ లైన్స్‌కు చెందిన ప్రత్యేక విమానం 6E 9104 చెన్నై నుంచి బెంగళూరు మీదుగా వచ్చి హైదరాబాద్‌లో దిగింది. ఈ విమానంలో అప్పటికే 51  కెన్యా జాతీయులు ఉండగా, హైదరాబాద్‌లో మరో 32 మంది  ఈ విమానంలో ఎక్కారు. మొత్తం 83 మంది కెన్యా జాతీయులతో విమానం తిరిగి ఉదయం 11 గంటల సమయంలో ముంబైకు వెళ్లింది. వీరిని ముంబై నుంచి కెన్యన్ ఎయిర్‌వేస్ ప్రత్యేక విమానం ద్వారా వారి స్వదేశానికి పంపుతారు. 

కెన్యా కాన్సులేట్ మరియు తెలంగాణ ప్రభుత్వ సమన్వయంతో ఈ కెన్యా జాతీయులను పూర్తిగా శానిటైజ్ చేసిన ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్‌ ద్వారా వారి స్వదేశానికి పంపడం జరిగింది. వీరు ఉదయం 6-8 గంటల మధ్యన హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. టెర్మినల్‌లో ప్రవేశించే ముందు ప్రయాణికులందరికీ కోవిడ్-19 థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. స్పెషల్ స్క్రీనింగ్, పలు భద్రతా చర్యల అనంతరం, తగిన భౌతిక దూరాన్ని పాటిస్తూ వారు ప్యాసింజర్ ప్రాసెసింగ్ పాయింట్స్ ను దాటుకుని విమానంలోకి వెళ్లారు. 

ఈ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి, చిక్కుకుపోయిన ప్రయాణికులను తరలించడానికి GHIAL కు చెందిన టెర్మినల్ ఆపరేషన్స్ సిబ్బంది, ఎయిర్ సైడ్ ఆపరేషన్స్, AOCC, ATC, ల్యాండ్ సైడ్ సెక్యూరిటీ, సీ.ఐ.ఎస్.ఎఫ్., ఇమిగ్రేషన్, కస్టమ్స్, APHO (ఎయిర్ పోర్ట్ హెల్త్ ఆఫీసర్స్), ఎయిర్ లైన్ గ్రౌండ్ హ్యాండ్లర్లు, ARFF (ఎయిర్ పోర్ట్ రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్) సేవలు RAXA సెక్యూరిటీ, ట్రాలీ ఆపరేటర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.  

ఇప్పటివరకూ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 12 ఎవాక్యుయేషన్ ఫ్లయిట్స్ ద్వారా 800 మందికి పైగా అమెరికా, కెన్యా, జర్మనీ, UK  మరియు UAE లాంటి వివిధ దేశాలకు చెందిన వారిని వారి స్వదేశాలకు తరలించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకవైపు నిరంతరం తరలింపు విమానాలను హ్యాండిల్ చేస్తూనే మరో వైపు సప్లై చెయిన్ విమానాలు నడిచేందుకు నిరంతరం సహకరిస్తూ, దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల సప్లై చెయిన్ ఎలాంటి ఆటంకాలూ లేకుండా కొనసాగేందుకు కృషి చేస్తోంది.

గ్రౌండ్ హ్యండ్లరు, ఫార్వర్డర్లు, కస్టమ్స్ హౌస్ ఏజెంట్లు, రెగ్యులేటర్లు, రాష్ట్ర పోలీసులు, కార్గో ట్రేడ్ అసోసియేషన్లతో కలిసి అత్యవసర వస్తువులైన ఔషధాలు, వ్యాక్సిన్లు, మెడికల్ ఎక్విప్ మెంట్, ఫార్మా ముడి పదార్థాలు, రక్షణ పరికరాలు, బ్యాంకు సంబంధిత వస్తువులు నిరంతరం రవాణా కొనసాగేందుకు కృషి చేస్తోంది.

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   43 minutes ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle