హైదరాబాద్ కోల్డ్‌స్టోరేజీల్లో మగ్గిపోతున్న వేలాది టన్నుల పండ్లు
16-04-202016-04-2020 08:07:29 IST
Updated On 16-04-2020 09:01:13 ISTUpdated On 16-04-20202020-04-16T02:37:29.350Z16-04-2020 2020-04-16T02:37:27.426Z - 2020-04-16T03:31:13.023Z - 16-04-2020

మూలిగే నక్కమీద తాటిపండు పండితే అనేది పాత సామెత. కానీ తెలంగాణలో పండ్లరైతుల తలపై తాడిపండు పడకముందే వారికి చుక్కలు కనపడుతున్నాయి. వేసవిలో మూడునెలల సీజన్ పండ్ల రైతులకు లాభాలు తెచ్చిపెట్టే సీజన్ కాగా కరోనా వైరస్‌తో లాక్ డౌన్ కారణంగా పండ్లరైతుల్లో కనిపించని విషాదం గుబులురేపుతోంది. అతికష్టంమీద పళ్లను మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతులు అక్కడ కొనేవారు కనిపించక తలపట్టుకుని ముఖం వేలాడేసుకుని ఉన్న చిత్రాలను గత కొన్ని రోజులుగా పేపర్లలో చూస్తూనే ఉన్నాం. కానీ లాక్ డౌన్ రెండో దశ కూడా కొనసాగుతుండటంతో పండ్లను కోయలేరు, కోసినా ఇతర ప్రాంతాలుకు తరలించలేరు. తరలించినా కొనుగోలుదార్లను రప్పించుకోలేరు. సంవత్సరం కష్టం మొత్తంగా నెలరోజుల లాక్ డౌన్‌తో వృధా అయ్యేటట్లుందని పండ్ల రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. లాక్డౌన్ కారణంగా రవాణా సమస్య ఎదురవుతుండడంతో ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పండ్లను ఇత ర రాష్ట్రాలకు తరలించే అవకాశం లేక..నిల్వ చేయలేని పండ్లను కొన్ని ప్రాంతాల్లో రైతులు పారబోస్తుండగా, మరికొన్ని చోట్ల తక్కువ ధరలకు అమ్మేసుకుని వచ్చినదాంతో సరిపెట్టుకుంటున్నారు. దేశంలో 9కోట్ల మంది రైతులు పండ్లతోటలు, ఉత్పత్తులపై ఆధారపడి వ్యవసాయం చేస్తుండగా, ఈ సీజన్లో అన్ని రకాల ఉద్యానపంటలు కలిపి 310 మిలియన్ టన్నులకు పైగా ఉత్పత్తి అవుతాయని, అందులో 96 మిలియన్ టన్నులు పండ్లు ఉంటా యని భారతీయ రైతు అసోసియేషన్ల కన్సార్షియమ్ లెక్కలు చెబుతున్నాయి. లాక్డౌన్ ఇలాగే కొనసాగితే ఈ ఏడాది పండ్ల రైతులకు వేల కోట్ల నష్టం వాటిల్లనుందని అంచనా. రవాణా, మార్కెట్ సౌకర్యాల్లేక తెలంగాణలో ఎక్కువగా పండే పుచ్చకాయలు రూ.5కే అమ్ముతుండగా, మహారాష్ట్రలో ఆపిల్, ద్రాక్ష పండ్లను రైతులు పారబోస్తున్నారు. అరటి, కర్బూజ, కొబ్బరి బోండాలు వంటి ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే పంటలు కూడా రావడం తగ్గిపోయాయి. ఇక, గత నెలలోనే చాలా రాష్ట్రాల నుంచి పండ్లు హైదరాబాద్ శివార్లలోని కోల్డ్ స్టోరేజీలకు చేరుకున్నాయి. వీటిని శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచి దేశంలోని పలు రాష్ట్రాలకు రవాణా చేసుకోవాలన్న ఉద్దేశంతో రైతులు వాటిని తీసుకువచ్చారు. ఇప్పుడు వీటిని తరలించే అవకాశం లేకుండా పోవడంతో ఎక్కడ నష్టపోవాల్సి వస్తుందోనని వాపోతున్నారు. వీటితో పాటు హైదరాబాద్ శివార్లలో ఉన్న వందలాది పాలీహౌస్‌లలో ఎగుమతులకు అనుకూలంగా ఉండే వేలాది టన్నుల పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీరికీ నష్టాలు తప్పేలా లేవు. పండ్లతో పాటు కూరగాయలు కూడా దేశవ్యాప్తంగా రవాణా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతానికి సమీప ప్రాంతాల్లో రవాణా చేసుకునేందుకు ఇబ్బందులు లేకపోయినా, అంతర్జిల్లా, అంతర్ర్రాష్ట్ర రవాణాకు ప్రస్తుత పరిస్థితులు అనుకూలించడం లేదు. దేశ వ్యాప్తంగా ఏడాదికి వంకాయలు 12.98 మిలియన్ టన్నులు, టమాటా 20, ఆలుగడ్డ 52. 58, ఉల్లిగడ్డలు 23, బఠానీలు 5 మిలియన్ టన్నులు ఉత్పత్తి అవుతాయని అంచనా. ఇవన్నీ రవాణా సమస్యతో మగ్గిపోతున్నాయి. ‘కరోనా వైరస్ ప్రభావం పండ్లపై బాగా కనిపిస్తోంది. ఈ వైరస్ నియంత్రణకు చేపడుతున్న చర్యల కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి మార్కెట్లోకి పండ్లు రావడం లేదు. వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి పండ్ల బేరం చేసే అవకాశం లేకపో యింది. లాక్డౌన్ ఎత్తివేసి మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడితే కానీ పండ్ల మార్కెట్‌కు మంచి రోజులు రావు.’ అని మిర్యాలగూడ పండ్లవ్యాపారి రెహమాన్‌ఖాన్ వాపోతున్నారు.

ఏపీలో స్కూల్స్ బంద్
24 minutes ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
5 minutes ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
4 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
6 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
an hour ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
8 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
8 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
an hour ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
3 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
9 hours ago
ఇంకా