‘‘హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి’’
08-07-202008-07-2020 08:44:09 IST
Updated On 08-07-2020 10:42:11 ISTUpdated On 08-07-20202020-07-08T03:14:09.223Z08-07-2020 2020-07-08T03:13:58.296Z - 2020-07-08T05:12:11.807Z - 08-07-2020

తెలంగాణలో కరోనా పరిస్థితులు చేయిదాటిపోతున్నాయని మల్కాజ్ గిరి ఎంపి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా తీవ్రంగా ఉంటే సీఎం కేసీయార్ ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. సీఎస్ సోమేశ్ కుమార్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. సెక్రటేరియేట్ కూల్చివేతపై మంగళవారం రేవంత్ జూమ్ యాప్ ద్వారా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ పిలిచినా వెళ్ళనందుకు సీఎస్‌ను- హెల్త్ ప్రిన్సిపల్ సెక్రెటరీని విధుల్లోంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్ తమ హక్కులను ఉపయోగించుకోవాలని, గవర్నర్ కి ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే కేంద్ర మంత్రి కలుగజేసుకోవాలని అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఇంత జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీ-టీఆర్ఎస్ కలిసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. కరోనా గురించి తరచూ ప్రెస్ మీట్లు పెట్టే సీఎం కేసీఆర్ హైదరాబాద్ ప్రజలను గాలికి వదిలేసి ఫామ్ హౌస్‌కి ఎందుకు వెళ్లారని, పీవీ శతజయంతి రోజు మాయమైన సీఎం ఇప్పటి వరకు కనిపించడం లేదని అన్నారు ఎంపీ. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచే రాబోయే 6 నెలలు సీఎం అన్ని కార్యక్రమాలు చేపడతారని అంటున్నారు.! మూడు రోజుల్లో కేబినెట్- లాక్ డౌన్ అని చెప్తే ప్రజలందరూ హైదరాబాద్ ఖాళీ చేస్తున్నారు. సెక్షన్-8 ని గవర్నర్ ఉపయోగించి హైదరాబాద్ లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. అసలు కేసీయార్ ఆరోగ్యపరిస్థితిపై ప్రకటన చేయాలన్నారు. కరోనా బాధితులకు చికిత్సనందించే విషయంలో ప్రభుత్వం ఒక్కో పేషెంట్ పై 3.50 లక్షల ఖర్చు చేస్తునట్లుగా చెబుతుందని, ఎంతమంది కరోనా పేషెంట్లకు మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదలచేయాలన్నారు. కరోనా వైరస్ పై పోరాటానికి దాతలు ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలన్నారు. సీఎం పర్యవేక్షణ లేని పాలనను కాపాడాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందని, గవర్నర్ తక్షణమే అధికారులకు నోటీసులు ఇవ్వాలన్నారు. కరోనా వైరస్ తీవ్రత, అందుతున్న వైద్యసదుపాయాలపై ప్రభుత్వ తీరుపై గవర్నర్ అఖిలపక్షాన్ని పిలవాలన్నారు. హైదరాబాద్‌లోని భవనాలన్నీ గవర్నర్ ఆధీనంలో ఉంటాయని, సెక్రటేరియట్ కూల్చివేసే ముందు గవర్నర్ అనుమతి ప్రభుత్వం తీసుకుందా అని రేవంత్ ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణలో ప్రస్తుత దుస్థితికి సీఎం కేసీయార్ నిరంకుశ విధానాలే కారణం అన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరోనా కేసులు పెరిగిపోవడం, జనం హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతుంటే దుర్భర పరిస్థితులు వుంటే ముఖ్యమంత్రి కనీసం వైద్యం పైన సమీక్ష కూడా చేయకుండా ఎక్కడ ఉన్నారన్నారు. మేము పాత సచివాలయంలో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేయమని కొరామని అన్నారు. అలా చేస్తే 10 వేల మంది రోగులకు చికిత్స అందించడానికి సౌకర్యంగా ఉండేదన్నారు. కానీ సీఎం తన మొండి వైఖరితో జనం ప్రాణాలు తీస్తున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రజా సంక్షేమం పైన దృష్టి సారించాలని, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఉత్తమ్ కోరారు.

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
27 minutes ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
an hour ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
4 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
2 hours ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
5 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
19 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
a day ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
20 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
16-04-2021

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
a day ago
ఇంకా