హైదరాబాద్‌లో మళ్లీ లాక్ డౌన్... మంత్రి తలసాని కామెంట్లపై చర్చ
13-06-202013-06-2020 08:46:26 IST
Updated On 13-06-2020 12:39:36 ISTUpdated On 13-06-20202020-06-13T03:16:26.191Z13-06-2020 2020-06-13T03:15:45.926Z - 2020-06-13T07:09:36.788Z - 13-06-2020

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుసార్లు లాక్ డౌన్ విధించినా దేశంలో కరోనా వైరస్ కట్టడి కావడం లేదు. లాక్ డౌన్ 5.Oలో కొన్ని సడలింపులు ఇచ్చింది. దీంతో కరోనా కేసుల ఉధృతి సాగుతూనే వుంది. రోజూ 200 కేసుల వరకూ నమోదవుతున్నాయి, అందునా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఇవి ఎక్కువగా నమోదు కావడం మరింత ఆందోళనకరంగా మారింది. అయితే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెబుతున్నట్టుగా హైదరాబాద్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో మళ్లీ లాక్ డౌన్ విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ అంశంపై చర్చ సాగుతోంది. అయితే, లాక్ డౌన్ విషయమై ఒక చానల్ లో తన పేరుతో వచ్చిన ప్రకటనను మంత్రి ఖండించారు. కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రశంసిస్తుండగా, స్థానిక బీజేపీ నేతలు తమ స్వప్రయోజనాల కోసం ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు తలసాని శ్రీనివాస్ యాదవ్. సడలింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. కొన్ని సమయాల్లో ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కరోనా కట్టడి కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారన్నారు. నగర పరిధిలో పూర్తి లాక్ డౌన్ మళ్లీ విధించాలా లేదా అన్న అంశంపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని వివరించారు. మరో రెండు లేదా మూడు రోజుల్లోపు సీఎం కేసీఆర్ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని, లాక్ డౌన్ అంశంపై ఆయనే స్వయంగా ప్రకటించే అవకాశం ఉందని తలసాని పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి. లాక్ డౌన్ సడలించిన అనంతరం జీహెచ్ఎంసీ పరిధిలోనే రోజుకు సరాసరిన 150 వరకూ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనాను కట్టడి చేయలేకపోతున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర బీజేపీ చేస్తున్న ఆరోపణలు, ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాలపై మంత్రి స్పందిస్తూ.. అవన్నీ పొలిటికల్ డ్రామాలని కొట్టిపారేశారు. కావాలంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముట్టడి చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం వైన్ షాపులు, ఎయిర్ పోర్టులు, రెస్టారెంట్లకు ఇచ్చిన సడలింపులన్నీ కేంద్రమే ఇచ్చిందన్నారు తలసాని. బీజేపీ నేతలకు ప్రేమ ఉంటే సడలింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ను ప్రశ్నించాలని సవాల్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేయవద్దన్నారు.

ఏపీలో స్కూల్స్ బంద్
12 hours ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
12 hours ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
16 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
18 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
13 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
20 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
20 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
13 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
15 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
21 hours ago
ఇంకా