newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హైదరాబాద్‌లో మరో లాక్ డౌన్ సాధ్యమేనా? కేసీయార్ మేథోమధనం

29-06-202029-06-2020 08:59:24 IST
Updated On 29-06-2020 11:43:26 ISTUpdated On 29-06-20202020-06-29T03:29:24.881Z29-06-2020 2020-06-29T03:28:45.134Z - 2020-06-29T06:13:26.015Z - 29-06-2020

హైదరాబాద్‌లో మరో లాక్ డౌన్ సాధ్యమేనా? కేసీయార్ మేథోమధనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ విపరీతంగా పెరుగుతోంది. ప్ర‌తి రోజు భారీ సంఖ్య‌లో కొత్త‌గా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించేందుకు సీఎం కేసీయార్ మేథోమధనం చేస్తున్నారు. అందరి అభిప్రాయాలు ఆయన తీసుకుంటున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపుల మొదటి దశ మంగళవారంతో ముగియనుంది. 

సడలింపులకు బదులు లాక్ డౌన్ విధిస్తే కట్టుదిట్టంగా, సంపూర్ణంగా అమలు చేయాల్సి ఉంటుంది. నిత్యావసర సరుకులు కోనుగోళ్లు చేయడానికి వీలుగా ఒకటి రెండు గంటలు మాత్రమే సడలింపు ఇచ్చి రోజంతా కర్ఫ్యూ విధించాలి. అందుకు జనాన్ని సమాయత్తం చేయాలి. విమానాలు, రైళ్ల రాకపోకలను ఆపాల్సి ఉంటుంది. ప్రభుత్వ పరంగా అన్ని సిద్ధం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలని లోతుగా పరిశీలించి అవసరమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందంటున్నారు సీఎం కేసీయార్. మరోవైపు కేసులు పెరుగుతుంటే కరోనా నిర్దారణ టెస్టులు ఆపేసింది. ప్రైవేటు హాస్పిటల్స్ లోనూ పరీక్షల ప్రక్రియ నిలిచిపోయింది. టెస్టులు పెరిగితే మరిన్ని కేసులు పెరుగుతాయంటున్నారు వైద్యనిపుణులు. 

గ‌డిచిన 24 గంట‌ల్లో 3227 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 983 మందికి క‌రోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయింద‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్ల‌డించింది. ఇవాళ న‌మోదైన మొత్తం కేసుల్లో అత్య‌ధికంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోనే 816 మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో 47, మంచిర్యాల‌లో 33, మేడ్చ‌ల్‌లో 29, వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాలో 19 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 12, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో 5, న‌ల్ల‌గొండ‌, క‌రీంన‌గ‌ర్, సిద్ధిపేట‌, ఖ‌మ్మం జిల్లాల్లో మూడు చొప్పున క‌రోనా కేసులు వ‌చ్చాయి. ఆదిలాబాద్, గ‌ద్వాల్ జిల్లాల్లో రెండేసి, సంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, జ‌న‌గామ‌, మెదక్, సూర్యాపేట‌, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున న‌మోద‌య్యాయి. దీంతో తాజాగా న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసుల‌తో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 14,419కి చేరింది. 

గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా కార‌ణంగా న‌లుగురు ప్రాణాలు కోల్పోవ‌డంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాలు 247కి పెరిగాయి. ఇవాళ 244 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాను జయించిన వారి సంఖ్య 5172కి చేరింది. ప్ర‌స్తుతం 9 వేల మంది క‌రోనాతో చికిత్స పొందుతున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించుకుంటే అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   3 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   5 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle