newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. చెరువులైన రోడ్లు

23-07-202023-07-2020 09:39:07 IST
2020-07-23T04:09:07.241Z23-07-2020 2020-07-23T04:08:39.935Z - - 15-04-2021

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. చెరువులైన రోడ్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రుతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ముఖ్యంగా హైదరాబాద్ లో బాగా కనిపిస్తోంది. తెల్లవారుజామునుంచి భారీ వర్షం పడుతోంది. ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై ఎక్కడికక్కడే నిలిచిపోయింది వర్షం నీరు.  భారీ వర్షంతో వాహనాల దారులకు ఇక్కట్లు తప్పలేదు. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, కోఠి, నాంపల్లి, పటన్ చెరు, సంగారెడ్డి మలక్ పేట, పంజాగుట్ట, కూకట్‌పల్లి, కోఠి, అబిడ్స్‌, మలక్‌పేట్, ఎల్‌బీ నగర్‌, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, గాజుల రామారం, సూరారం, ముషీరాబాద్‌,ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, అశోక్‌నగర్‌, ట్యాంక్‌బండ్‌,నాంపల్లి, దారుసలంలో భారీ వర్షం కురిసింది. రెండురోజుల పాటు భారీవర్షాలు పడతాయని ఇంతకుముందే వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర కర్ణాటక నుండి మధ్య తమిళనాడు దక్షిణ మధ్య కర్ణాటక మీదుగా ఉత్తర-దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. అలాగే ఉత్తర మధ్య కర్ణాటక దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక భారీ వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ, రేపు ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ శాఖ చెప్పినట్టుగానే భారీవర్షాలు పడుతున్నాయి.

ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వివిధ ప్రాజెక్టుల్లో నీటిప్రవాహం పెరిగింది.

భారీవర్షానికి సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో వర్షపు నీరు భారీగా రోడ్ల మీదికి చేరుతుంది. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది వర్షపు నీరు వెళ్లేందుకు మాన్యువల్స్ వద్ద మరమ్మతులు నిర్వహిస్తున్నారు. కంటోన్మెంట్ బోయినపల్లి, సికింద్రాబాద్ వారసిగూడ, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. భారీ వర్షానికి అంబర్‌పేట్‌- ముసరాంబాగ్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle