హైదరాబాద్లో కరోనా వైరస్ పరీక్షా కేంద్రాలు.... ఏపీలోనూ హై అలర్ట్
03-02-202003-02-2020 13:09:30 IST
Updated On 03-02-2020 13:10:41 ISTUpdated On 03-02-20202020-02-03T07:39:30.849Z03-02-2020 2020-02-03T07:39:27.493Z - 2020-02-03T07:40:41.173Z - 03-02-2020

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు కేంద్రం అనుమతివ్వడంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అంతా సిద్దంచేశారు. ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చాయి. గాంధీ ఆస్పత్రిలోని వైరాలజీ డిపార్ట్ మెంట్ ఐదవ ఫ్లోర్లో ఇవి ప్రారంభం అయింది. పుణె తరహా టెస్టింగ్ సెంటర్ ఇదే. ఇప్పటివరకూ 20 మంది అనుమానితులు వున్నారు. ఎర్రగడ్డ ఛాతీ వ్యాధుల ఆస్పత్రిలో 10 బెడ్లతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. 49 మందితో వైద్య బృందాన్ని నియమించారు. ఫీవర్ ఆసుపత్రికి నిన్న ఓ మహిళ సహా నలుగురు కరోనా అనుమానితులు వచ్చారు. తార్నాక, సనత్ నగర్, అమీర్ పేట్, తాండూరుకు చెందిన వీరు ఇటీవల చైనాకి వెళ్ళివచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ప్రజలను వణికిస్తోంది. కాకినాడలో ఈ వైరస్ చొరబడినట్టు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. చైనా నుంచి వచ్చిన వైద్య విద్యార్థి ఇమ్రాన్ ను వైద్యులు. వైరస్ లక్షణాలు లేవని నిర్ధారించినప్పటికీ వైద్యులు తమ పర్యవేక్షణలోనే ఉంచుతున్నారు. ఇక కాకినాడ పోర్టు నుంచి కూడా విదేశీయులు నగరానికి వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వాసుపత్రుల్లో ఓ వార్డును సిద్ధం చేశారు. రాజమండ్రి ఎయిర్ పోర్టులో కూడా క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇటు ఇండియాలో మూడోవ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తోంది. కేరళలోని కాసర్ గఢ్ లో ఓ వ్యక్తికి వైరస్ సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ధారించింది. బాధితుడు వుహాన్ నుంచి కేరళ చేరుకున్నట్టు తెలిపారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని వైద్యులు చెప్పారు. కేరళలోనే ఇప్పటికే రెండుకేసులు నమోదయ్యాయి. ఇప్పడిది మూడోకేసు.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
12 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
8 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
10 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
13 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
15 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
16 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
18 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
19 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
20 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
20 hours ago
ఇంకా