newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

హైదరాబాద్‌లో కరోనా.... జనం హైరానా

28-01-202028-01-2020 08:53:56 IST
Updated On 28-01-2020 11:15:03 ISTUpdated On 28-01-20202020-01-28T03:23:56.092Z28-01-2020 2020-01-28T03:22:01.757Z - 2020-01-28T05:45:03.349Z - 28-01-2020

హైదరాబాద్‌లో కరోనా.... జనం హైరానా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ నగరం ఒక వ్యాధితో అప్రమత్తం అయింది. ఇప్పటికే నగరంలో స్వైన్ ఫ్లూ, డెంగీ జ్వరాలు భయపెడుతుంటే... హైదరాబాద్ ను కరోనా వైరస్‌ భయపెడుతోంది. జనాన్ని కరోనా వైరస్‌ భయం వణికిస్తోంది. చైనాలో ఈ వ్యాధి ఎక్కువ‌గా ప్ర‌బ‌లుతోంది. అయితే హైదరాబాద్‌ నుంచి చైనాకు వెళ్లి, వచ్చే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. దీంతో ఈవైరస్ వారి ద్వారా నగరానికి వస్తోందని తెలుస్తోంది. 

ఫీవర్‌ ఆస్పత్రికి మూడు అనుమానిత కేసులు వచ్చాయి. జూబ్లీహీల్స్‌కు చెందిన 25 ఏళ్ల‌ యువకుడు ఇటీవల చైనా నుంచి హైద‌రాబాద్ కి వచ్చాడు. ఈ మ‌ధ్య‌నే అస్వస్థతకు గురైన త‌న‌కు చైనాలో కరోనా వైరస్‌ ప్రబలినట్లు తెలుసుకుని నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రిలో చేరాడు. అనుమానిత కరోనా కేసుగా ఐసోలేటెడ్‌ వార్డులో ఇన్‌పేషంట్‌గా ఉంచి డాక్ట‌ర్లు చికిత్సలు అందిస్తున్నారు. ఎయిమ్స్ వైద్యులు కూడా వచ్చి ఈ కేసులను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 

రెండురోజుల క్రితమే మరో రెండు అనుమానిత కరోనా కేసులు వచ్చాయి. ముగ్గురిని ఐసోలేటెడ్‌ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శంకర్‌ తెలిపారు. ఇందుకోసం న‌ల్ల‌కుంట ఫీవర్‌ ఆస్పత్రిలో ప్రత్యేక ఐసోలేటెడ్‌ వార్డును ఏర్పాటు చేశారు.

ఫీవర్‌ ఆస్పత్రితో పాటు గాంధీ ఆస్పత్రిని నోడల్‌ కేంద్రాలుగా చికిత్సలు అందించడానికి ఏర్పాట్లు చేశారు.మొత్తం నలుగురు అనుమానితులు ఫీవర్ ఆస్పత్రికి వచ్చారని, వారిలో ఒకరికి పరీక్షలు చేయగా ఒకరికి కరోనా లేదని తేలింది. స్వైన్ ఫ్లూ, కరోనా వైరస్ లక్షణాలు ఒకేలా ఉన్నప్పటికీ....చైనా నుంచి వచ్చిన వాళ్లకు జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉండటం, గొంతు నొప్పి ఉండి ఉంటే వారు తప్పని సరిగా డాక్టర్లను సంప్రదించాలని డాక్టర్లు సూచించారు.

దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లోనూ చైనా, హాంకాంగ్, వియత్నాం నుంచి వచ్చే వారిని పరీక్షిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయని ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోంటామని అధికారులు భరోసా ఇస్తున్నారు. 

దీనికి తోడు ఇటీవల చైనా నుంచి వచ్చిన ఒక బీహార్ యువతికి కరోనా వైరల్ లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. చైనాలో పీహెచ్‌డీ చేస్తోన్న ఈ విద్యార్థిని జనవరి 22న కోల్‌కతా వచ్చింది. ఆ తర్వాతి రోజు బీహార్‌లోని తన స్వగ్రామానికి వెళ్లింది. అయితే గత రెండు రోజులుగా ఆమె దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్లు ఆమె సోదరి పూణేలోని వైద్య, కుటుంబ సంక్షేమ శాఖకు ఫోన్ చేసి చేయడం అప్రమత్తం అయ్యారు. 

రంగంలోకి దిగిన పూణే డాక్టర్లు ఆమె శాంపిల్స్ తీసుకున్నారు. యువతిని పాట్నా ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై బీహార్ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నారు.

చదవండి :  ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్ కరోనా

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   6 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   7 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   8 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   9 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   9 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   10 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   11 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   12 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   12 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle