హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఎన్ని కేసులో తెలుసా?
26-06-202026-06-2020 10:24:47 IST
2020-06-26T04:54:47.974Z26-06-2020 2020-06-26T04:53:27.395Z - - 10-04-2021

కరోనా వైరస్ తో హైదరాబాద్ వణికిపోతోంది. రోజురోజుకీ కొత్త రికార్డులు వస్తున్నాయి. లాక్ డౌన్ కు ముందు నగర పరిధిలో కేసుల సంఖ్య వందలోపు ఉండేది. కానీ, లాక్ డౌన్ సడలింపుల తర్వాత కేసుల సంఖ్య వందలలో నమోదవుతుంది. ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచడంతో.. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా పెరుగుతోందని అధికారులు అంటున్నారు. కరోనా నేపథ్యంలో వివిధ నగరంలో బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలామంది నగరం నుంచి తమ సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 800 నుంచి 900 కేసులు నమోదవుతుంటే.. ఒక్క హైదరాబాద్ లోనే 700కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల పరిస్థితిని బట్టి భాగ్యనగరంలో కరోనా ఎలా ఉందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. అందుకే అత్యవసరమైతే తప్ప రోడ్ల మీదికి రావొద్దని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. నగరంలో కేసుల సంఖ్య ఎక్కువ అవుతండటంతో సికింద్రాబాద్ పరిధిలోని ప్యారడైజ్ సర్కిల్, జనరల్ బజార్, సూర్యా టవర్స్ లను జూలై 5 వరకు మూసివేస్తున్నట్లు ఆ ప్రాంత అసోసియేషన్ లు ప్రకటించాయి. కొంతమంది స్వచ్ఛందంగా లాక్ డౌన్లు పాటిస్తున్నారు. పోలీసులు కూడా కరోనా వైరస్ కారణంగా వణికిపోతున్న పరిస్థితి. తాజాగా 737 కేసులు నమోదయ్యాయి. నగరంలో 150 డివిజన్లు వున్నాయి. వివిధ జోన్లలో కేసుల పరిస్థితి దారుణంగా పెరిగిపోతుంది. ఖైరతాబాద్ జోన్లో కార్వాన్ -662, గోషామహల్-497, మెహిదీపట్నం-475, జూబ్లీహిల్స్ – 369, ఖైరతాబాద్-351 కేసులు నమోదయ్యాయి. చార్మినార్ జోన్లో మలక్ పేట – 302, ఫలక్ నుమా – 285, చార్మినార్ – 256, చాంద్రాయణగుట్ట– 251, సంతోష్ నగర్ –163 కేసులున్నాయి సికింద్రాబాద్ జోన్లో అంబర్ పేట– 335, సికింద్రాబాద్– 304, బేగంపేట– 256, ముషీరాబాద్ – 174, మల్కాజ్ గిరి –165 కేసులు నమోదయ్యాయి శేరిలింగంపల్లి జోన్లో పటాన్ చెరు-104, శేరిలింగంపల్లి – 152, ఆర్సీ పురం-72, యూసుఫ్ గూడలో70 కేసులు నమోదయ్యాయి. ఎల్బీ నగర్ జోన్లో సరూర్ నగర్ –140, ఎల్బీ నగర్ – 104, కాప్రా– 62, ఉప్పల్ – 32, హయత్ నగర్ – 45 కేసులున్నాయి కూకట్ పల్లి జోన్లో అల్వాల్ – 71, మూసాపేట – 61, గాజులరామారాం– 49, కూకట్ పల్లి – 33, కుత్బుల్లాపూర్– 43 కేసులు నమోదయినట్టు అధికారులు తెలిపారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
6 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
3 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
5 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
9 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
12 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
13 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా