newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో ఆగస్టుకి పరుగులు.. !

19-07-201919-07-2019 12:57:07 IST
Updated On 19-07-2019 15:20:06 ISTUpdated On 19-07-20192019-07-19T07:27:07.017Z19-07-2019 2019-07-19T07:26:11.384Z - 2019-07-19T09:50:06.411Z - 19-07-2019

హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో ఆగస్టుకి పరుగులు.. !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ రూపురేఖల్ని మార్చిన ఘనత మెట్రో రైలుకే దక్కింది. మొత్తం 72 కిలోమీటర్ల మొదటిదశ ప్రాజెక్టులో ఇప్పటికే 56 కిలోమీటర్లు పూర్తయి ప్రయాణికులు ఉపయోగించుకుంటున్నారు. పెండింగ్‌లో ఉన్న హైటెక్‌ సిటీ-రాయదుర్గం మార్గంతోపాటు కారిడార్-2కు సంబంధించి జేబీఎస్- ఎంజీబీఎస్ మార్గం అందుబాటులోకి వస్తోంది.

కారిడార్-1లో ఇప్పటికే ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు, కారిడార్-3లో నాగోల్ నుంచి హైటెక్‌సిటీ వరకు మెట్రోరైళ్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. కారిడార్-3లో హైటెక్‌ సిటీ వద్ద రివర్సల్ సౌకర్యంతోపాటు రాయదుర్గం వరకు 1.5 కిలోమీటర్ల మార్గం పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. 

ఆగస్టు చివరికల్లా పెండింగ్ పనులు పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులో తేవడానికి హైదరాబాద్ మెట్రోరైలు అధికారులు ప్లాన్ సిద్ధం చేశారు. కారిడార్-2 మార్గంలో కూడా స్టేషన్లు, ఎలక్ట్రిఫికేషన్, సిగ్నలింగ్, ట్రాక్ దాదాపు సిద్ధమయ్యాయి. ప్రతిపాదిత జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 15 కిలోమీటర్ల మార్గంలో పది కిలోమీటర్ల మార్గం ఈఏడాది నవంబర్‌ నాటికి సిద్ధం అవుతుందని భావిస్తున్నారు. అలాగే, శంషాబాద్ ఎయిర్‌ పోర్టుకు కనెక్టివిటీ చేసే రెండోదశ ప్రాజెక్టు పనులను ఈ ఏడాదే ప్రారంభిస్తారు. 

దీనికి సంబంధించిన డీపీఆర్ బాధ్యతలను ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌కు అప్పగించారు. దీనికి సంబంధించిన డీపీఆర్ రాష్ట్రప్రభుత్వానికి చేరింది. మొత్తం 200 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని నిర్మించి ప్రయాణాన్ని సుఖవంతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గాలపై దృష్టి పెట్టింది.

ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం- ఈబీఆర్టీఎస్ పేరుతో నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల ట్రాఫిక్ ఇబ్బంది తీరి, పర్యావరణ ముప్పు కూడా తప్పనుంది. ఈబీఆర్టీఎస్‌లో నిర్మించే మార్గం ప్రత్యేకమయినదిగా భావిస్తున్నారు. దీని ద్వారా ఇతర వాహనాలను అనుమతించరు. పిల్లర్లపై నిర్మించే రోడ్డు మార్గంలో ర్యాపిడ్ సిస్టం బస్సులే నడుస్తాయి.

కేపీహెచ్‌బీ నుంచి ప్రారంభమయ్యే ఈ రూట్ ముఖ్యమైన ప్రాంతాలను కలుపుకొంటూ నార్సింగి ఎక్స్‌ రోడ్డు వద్ద ఎయిర్‌ పోర్టు మెట్రోస్టేషన్‌కు కనెక్టవుతుందని అంటున్నారు. 

ఈ ప్రాజెక్టు డిటేయిల్డ్  రిపోర్టు కోసం హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ టెండర్లు ఆహ్వానించింది. 18 కిలోమీటర్ల డెడికేటెడ్ వే డీపీఆర్ కోసం మెట్రోరైలు సంస్థ బిడ్లను ఆహ్వానించింది. పీపీపీ ప్రాజెక్టుగా దీనిని నిర్మించనున్నారు. ఇది పూర్తయితే ఎయిర్ పోర్టుకి వెళ్ళడం సులభం అవుతుంది. 

వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

   7 hours ago


ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

   8 hours ago


టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

   8 hours ago


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

   12 hours ago


హర్షకుమార్ వెనుక చంద్రబాబే.. . మంత్రి విశ్వరూప్ ఫైర్

హర్షకుమార్ వెనుక చంద్రబాబే.. . మంత్రి విశ్వరూప్ ఫైర్

   14 hours ago


ఈసారి గోల్కొండ కాదు.. ప్రగతి భవన్‌లో పంద్రాగస్తు వేడుకలు

ఈసారి గోల్కొండ కాదు.. ప్రగతి భవన్‌లో పంద్రాగస్తు వేడుకలు

   14 hours ago


ముగిసిన మాజీమంత్రి ఖలీల్ బాషా అంత్యక్రియలు

ముగిసిన మాజీమంత్రి ఖలీల్ బాషా అంత్యక్రియలు

   15 hours ago


ఏపీలో 26 లక్షలు దాటిన టెస్టులు..  ప్రతి జిల్లాలో వైరస్ విజృంభణ

ఏపీలో 26 లక్షలు దాటిన టెస్టులు.. ప్రతి జిల్లాలో వైరస్ విజృంభణ

   15 hours ago


ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

   15 hours ago


జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

   17 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle