newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హైకోర్టు మున్సిపల్ తీర్పు.. అంతటా ఉత్కంఠ!

07-01-202007-01-2020 13:13:49 IST
Updated On 07-01-2020 13:23:26 ISTUpdated On 07-01-20202020-01-07T07:43:49.082Z07-01-2020 2020-01-07T07:43:37.282Z - 2020-01-07T07:53:26.402Z - 07-01-2020

హైకోర్టు మున్సిపల్ తీర్పు.. అంతటా ఉత్కంఠ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మంగళవారం నోటిఫికేషన్ కూడా విడుదల కావాల్సి ఉండగా.. సోమవారం హైకోర్టు నోటిఫికేషన్ విడుదలకి బ్రేకులు వేసింది. రిజర్వేషన్లను ఖరారు చేసిన నెల రోజుల తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలంటూ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫున దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.

ముందుగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నియమావళిని కోర్టుకి సమర్పించాలని అప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల చేయవద్దని ఆదేశించగా మంగళవారం విచారణ చేపట్టనుంది. ఈరోజు ఎన్నికల కమిషన్ సమర్పించనున్న నియమావళిని పరిశీలించిన అనంతరం నోటిఫికేషన్ ఇవ్వాలా? వద్దా? అన్న అంశంపై స్పష్టత ఇస్తామని హైకోర్టు సోమవారం పేర్కొంది.

ఈ సందర్భంగా కోర్టు ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందుగా జనవరి 4 నాటికి ఓటర్ల జాబితా పూర్తి చేస్తామని చెప్పి..ఇప్పుడు డిసెంబర్ 23నే ఎలా పూర్తి చేసిందని కోర్టు ప్రశ్నించింది. ప్రతీసారి ఎన్నికల నియమావళిని తప్పుగా ఇవ్వడం ఎన్నికల అధికారులకు అలవాటైందని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో ఈరోజు విచారణ ఎలా ఉంటుంది? అన్న ఉత్కంఠ మొదలైంది.

మంగళవారం హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది? నోటిఫికేషన్ విడుదల అవుతుందా? మున్సిపల్ ఎన్నికలలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయి? అన్న ఆసక్తికరంగా మారింది. కోర్టు వ్యవహారాలతో ఎన్నికల షెడ్యూల్ లో పేర్కొన్న వివరాలకి.. ఇప్పటికీ నోటిఫికేషన్ కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అయితే, కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేసినా.. అసహనం వ్యక్తం చేసినా.. ఘాటుగా స్పందించినా.. చివరికి ఎన్నికల కమిషన్ అధికారాల అధికారాలే అమలు అవుతాయని కోర్టులు సలహా పూర్వకంగా వ్యవహరిస్తామని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా పలు సందర్భాలలో కోర్టు తీవ్రంగా స్పందించినా చివరికి అధికారులకి అనుకూలంగానే తీర్పులు ఇచ్చాయని పేర్కొంటున్నారు.

ఉదాహరణకి ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న నుమాయిష్.. దీని నిర్వాహకులు, ప్రభుత్వంపై హైకోర్టు తీవ్రంగానే స్పందించినా చివరికి నుమాయిష్ నిర్వహించుకోవచ్చని తీర్పునిచ్చిందని.. కొద్దిగా జాగ్రత్తలు పాటించాలని సలహా మాత్రమే కోర్టు ఇచ్చిందని ఉదాహరణగా పేర్కొన్నారు. అంటే కొద్దిగా ఆలస్యం అయినా చివరికి ఈసీ ఇష్టానుసారమే మున్సిపల్ ఎన్నికలు ఉండనున్నాయని వారి అభిప్రాయం!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle