హైకోర్టుని తాకిన కరోనా వైరస్
09-07-202009-07-2020 08:13:50 IST
Updated On 09-07-2020 10:39:20 ISTUpdated On 09-07-20202020-07-09T02:43:50.098Z09-07-2020 2020-07-09T02:43:46.687Z - 2020-07-09T05:09:20.189Z - 09-07-2020

తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ప్రతిరోజూ కూడా 1500లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధిక కేసులు బయటపడటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా కరోనా మహమ్మారి తెలంగాణ హైకోర్టును తాకింది. ఇప్పటివరకు హైకోర్టులో 25 మంది ఉద్యోగులకు కరోనా సంక్రమించింది. దీంతో రేపటి నుంచి హైకోర్టు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే హైకోర్టును పూర్తిగా శానిటైజ్ చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. హైకోర్టు లోని ఫైల్స్ అన్నింటిని జ్యూడీషీయల్ అకాడమీకి తరలించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమైన కేసులను విచారించాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేసే కేసుల విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని హైకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్ లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండటంతో హైకోర్టు మూసివేత నిర్ణయం సరైనదే. ఎందుకంటే మరింత మంది ఆ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే దానికి దూరంగా ఉండడం ఒక్కటే పరిష్కార మార్గం. కాగా తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27వేల మార్క్ ను దాటేసింది. తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తోంది. సాధారణ ప్రజలతో పాటు కరోనా రోగులకు చికిత్స అందించే డాక్టర్లు, వైద్య సిబ్బంది కూడా కరోనా బారినపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. డాక్టర్ బి. నాగేందర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల లక్షణాలు కనిపించిన కరోనా రోగికి వైద్యం చేసిన నేపథ్యంలో ఆయనకు కరోనా సోకినట్లు వైద్యాధికారులు చెప్పారు. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం కరోనా ఉధృతి చాలా ఎక్కువగా పెరుగుతోంది. బాధితుల సంఖ్య 30 వేలకు చేరువైంది. బుధవారం 1,924 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో కేసుల సంఖ్య 29,536కి చేరింది. ఇందులో 11,933 యాక్టివ్ కేసులుండగా.. 17,279 మంది కోలుకున్నారు. ఒక్కరోజే 11 మంది మృతి చెందారు. దీంతో మరణాలు 324కి పెరిగాయి. తాజా కేసుల్లో ఎక్కువ భాగం జీహెచ్ఎంసీ పరిధిలో 1,590 ఉన్నాయి. రంగారెడ్డిలో 99, మేడ్చల్‌లో 43, వరంగల్ రూరల్‌లో 26, సంగారెడ్డిలో 20, నిజామాబాద్‌లో 19, మహబూబ్‌నగర్‌లో 15, కరీంనగర్లో 14, సిరిసిల్లలో 13, వికారాబాద్‌లో 11, వనపర్తిలో 9, వరంగల్ అర్బన్‌లో 7, మెదక్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి జిల్లాల్లో 5 చొప్పున, ఖమ్మంలో 4, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 3 చొప్పున, ఆసిఫాబాద్, నారాయణపేట్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 6,363 మందికి పరీక్షలు చేయగా 4,439 మందికి నెగెటివ్ వచ్చింది.

ఏపీలో స్కూల్స్ బంద్
13 hours ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
13 hours ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
17 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
19 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
14 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
21 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
21 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
13 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
15 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
21 hours ago
ఇంకా