newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హెల్మెట్‌పై ఆ మార్కు లేదా.. అయితే ఫైన్ గ్యారంటీ?

03-08-202003-08-2020 12:41:13 IST
2020-08-03T07:11:13.236Z03-08-2020 2020-08-03T07:11:06.942Z - - 11-04-2021

హెల్మెట్‌పై ఆ మార్కు లేదా.. అయితే ఫైన్ గ్యారంటీ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో రోడ్డుప్రమాదాలు బాగా పెరిగిపోతున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యం, హెల్మెట్ ధరించకపోవడం, మితిమీరిన వేగం అందుకు కారణాలుగా చెప్పవచ్చు. కొంతమంది హెల్మెట్ పెట్టుకున్నాం తమకేం కాదు.. తమని ఎవరూ ఆపరని ధీమాగా రోడ్డుమీదకు వస్తుంటారు. అయితే అక్కడే అంతా తప్పులో కాలేసి వేలరూపాయల జరిమానాలకు గురవుతున్నారు.హెల్మెట్ ధ‌రించినా జ‌రిమానా త‌ప్ప‌ని ప‌రిస్థితి రావొచ్చు.. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకురాబోతోంది. 

హెల్మెట్ పెట్టుకున్నా కేంద్రం విధించిన నిబంధనలకు అనుగుణంగా అవిలేకపోతే మీ జేబుకి చిల్లుపడడం ఖాయం. కొత్త నిబంధనలు వాహనదారులపై ప్రతికూల ప్రభావం చూసే అవ‌కాశం ఉంది.. హెల్మెట్‌ రూల్స్‌ను కఠినతరం చేస్తూ పూర్తిగా మార్చేయ‌డ‌మే దీనికి కార‌ణం.హెల్మెట్ త‌ప్ప‌నిస‌రి చేసిన‌ప్ప‌ట్టి నుంచి రోడ్ల‌పై ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ హెల్మెట్ల విక్ర‌యం కొన‌సాగుతోంది.

ప్రభుత్వ నిర్ణయం తమ ప్రాణాలు కాపాడడానికే అనే స్పృహ వాహనదారుల్లో కనిపించడంలేదు. అందుకే క‌నీస క్వాలిటీ కూడా క‌నిపించ‌ని హెల్మెట్లు కొనేసుకుని పోలీసుల ఫైన్ నుంచి త‌ప్పించుకుంటున్నారు. అయితే తాజా నిబంధనల ప్రకారం నాణ్యమయిన హెల్మెట్లు లేకుంటే జరిమానా తప్పదంటున్నారు పోలీసులు. మీరు ఎక్కడ కొనుగోలు చేసినా హెల్మెట్‌పై బీఐఎస్ మార్క్ ఉండాలి. 

బీఐఎస్ మార్క్ చూసుకోక‌పోతే మాత్రం ఇబ్బంది పడడం ఖాయం.  కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కొత్త నిబంధ‌న‌ల‌కు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మార్క్ కలిగిన హెల్మెట్లను మాత్రమే వాహనదారులు వినియోగించాలి. అయితే. ఈ రూల్స్ మాత్రం వ‌చ్చే ఏడాది మార్చి 1 నుంచి అమలులోకి రానున్నాయి.. హెల్మెట్ కొనేవారికి మాత్ర‌మే కాదు.. ఏదిప‌డితే అది అమ్మి సొమ్ము చేసుకోవాల‌ని చూసేవారికి కూడా ఇది షాక్. కాబట్టి మీరు హెల్మెట్ కొనాలనుకుంటే మాత్రం బీఐఎస్ మార్కున్న నాణ్యత కలిగిన హెల్మెట్ కొనండి. జరిమానాల బారిన పడకుండా జాగ్రత్త పడండి. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   12 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   11 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   15 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   18 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   19 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle