newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హెలికాప్టర్లో రయ్ రయ్.. మేడారం జాతర టూర్ మేడ్ ఈజీ

04-02-202004-02-2020 09:37:49 IST
Updated On 04-02-2020 10:44:38 ISTUpdated On 04-02-20202020-02-04T04:07:49.571Z04-02-2020 2020-02-04T04:07:32.851Z - 2020-02-04T05:14:38.903Z - 04-02-2020

హెలికాప్టర్లో రయ్ రయ్.. మేడారం జాతర టూర్ మేడ్ ఈజీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ మహావేడుక మేడారం జాతరకు జనం పోటెత్తుతున్నారు. మేడారానికి వెళ్లేవారి కోసం ఇటు రైల్వేశాఖ, తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గత ఏడాది లాగే ఈ ఏడాది కూడా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌ నుంచి మేడారానికి హెలికాప్టర్ సౌకర్యాన్ని పర్యాటక శాఖ కల్పించింది. మేడారం జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే ప్రత్యేక రైళ్లు, బస్సులను ప్రారంభించగా.. తాజాగా హెలికాప్టర్‌ సేవలను అందుబాటులోకి తేవడంతో అక్కడికి వెళ్లిరావడం ఈజీ కానుంది.

హైదరాబాద్ బేగంపేట పాత ఎయిర్‌పోర్ట్‌లో హైదరాబాద్‌–మేడారం హెలికాప్టర్‌ సేవలను టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌  ప్రారంభించిన సంగతి తెలిసిందే. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జాతరకు కోట్లాది మంది భక్తులు వస్తుంటారని, గత ప్రభుత్వాలు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా వదిలేశాయని మంత్రి అన్నారు. 2014 లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మేడారానికి మహర్దశ ఏర్పడిందన్నారు మంత్రి తలసాని. 

ఏవియేషన్‌ శాఖ సహకారంతో టూరిజం శాఖ హెలికాప్టర్‌ సేవలను ప్రారంభించింది. ఆరుగురు ప్రయాణి కులకు రూ.1,80,000 ప్లస్‌ జీఎస్టీని (అప్‌ అండ్‌ డౌన్‌) నిర్ణయించారు. ప్యాకేజీలో భాగంగా రానుపోను హెలికాప్టర్‌ చార్జీ లు, హెలిప్యాడ్‌ నుంచి ప్రత్యేక వాహన సౌకర్యంతోపాటు వీఐపీ దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తారు. మేడారంలో జాతర ఏరియల్ వ్యూ చూసేందుకు ప్రతి ప్రయాణికుడికి రూ.2,999 చార్జీ వసూలు చేస్తారు. 

ప్రత్యేక రైళ్ళు.. బస్సు సర్వీసులు 

ఇటు మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, రైల్వేశాఖ స్పెషల్ ట్రైన్లు నడుపుతోంది.  రాష్ట్రంలోని 51 ప్రత్యేక బస్‌ స్టేషన్ల నుంచి ఆదివారం బస్సులు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 34 ప్రత్యేక బస్‌ స్టేషన్లు, అలాగే రాష్ట్రంలోని మిగతా 16 ప్రత్యేక బస్‌ స్టేషన్లతో పాటు మహారాష్ట్రలోని సిరోంచ నుంచి ప్రత్యేక బస్సులు మేడారానికి నడిపిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే రైల్వే 20 ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతోంది.సికింద్రాబాద్-వరంగల్-హైదరాబాద్ రూట్‌లో 10 రైళ్లు, సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్ రూట్‌లో 10 రైళ్లు న‌డుస్తాయ‌ని ప్రకటించింది.

07014 నెంబర్ గల రైలు ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు ప్రతీ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. అదేరోజు మధ్యాహ్నం 3.40 గంటలకు రైలు వరంగల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07015 నెంబర్ గల రైలు వరంగల్‌లో సాయంత్రం 5.45 గంటలకు బయల్దేరుతుంది. అదే రాత్రి 9.40 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. మ‌ధ్య‌లో మౌలాలి, చర్లపల్లి, ఘట్‌కేసర్, బీబీనగర్, భువనగిరి, రాయ్‌గిరి, వంగపల్లి, ఆలేర్, పెంబర్తి, జనగామ్, రఘునాథపల్లి, ఘనపూర్, పిండియాల్, కాజీపేట స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి.

ఇక‌ సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్ రూట్‌లో ప్రత్యేక రైలు 10 సర్వీసులు న‌డుస్తుండ‌గా 07017 నెంబర్ గల రైలు ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు ప్రతీరోజు ఉద‌యం 05:30 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బయలుదేరి 9.30 గంటలకు రైలు వరంగల్ చేరుకుంటుంది.

అదే విధంగా తిరుగు ప్రయాణంలో 07018 నెంబర్‌గల రైలు వరంగల్‌లో ఉదయం 11 గంటలకు బయలుదేర‌గా మధ్యాహ్నం 3 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది. మార్గ మ‌ధ్య‌ లో రాలపేట్, ఆసిఫాబాద్ రోడ్, రేపల్లెవాడ, రెచ్నీ రోడ్, బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రఖని, మంచిర్యాల్, పెద్దంపేట్, రామగుండం, రాఘవాపురం, పెద్దపల్లి, కొత్తపల్లి, కొలనూర్, ఒదెల, పోత్కపల్లి, బిసుగీర్ షరీఫ్, జమ్మికుంట, ఉప్పల్, హసన్‌పర్తి రోడ్, కాజిపేటలో రైలు ఆగుతుంది. 

మొత్తం మీద గతంతో పోలిస్తే మేడారం జాతరకు వెళ్లిరావడం భక్తులకు చాలా సౌకర్యంగా మారింది. డబ్బులున్నవారు మేడారం జాతరకు హెలికాప్టర్లో వెళ్లి వచ్చేయవచ్చు. లేదంటే ఆర్టీసీ బస్సులు, రైళ్ళలో వెళ్ళవచ్చు. 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   12 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   8 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   10 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   13 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   15 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   16 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   18 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   19 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   20 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle