newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

హుజూర్ నగర్ గెలుపు తెరాసకు బలుపేనా?

27-10-201927-10-2019 13:52:41 IST
2019-10-27T08:22:41.071Z27-10-2019 2019-10-27T08:22:30.581Z - - 22-02-2020

హుజూర్ నగర్ గెలుపు తెరాసకు బలుపేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ముందస్తు ఎన్నికల ఫలితాలు అంచనా వేసినట్లే హుజార్ నగర్ శాసనసభ ఉపఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి భారీ మెజారిటీతో నెగ్గింది. నియోజకవర్గ చరిత్రలో తెరాస్ గెలుపు సాధించడం ఇదే తొలిసారి. పైగా తెలంగాణ కాంగ్రెస్‌ కంచుకోటగా పేరొందిన హుజూర్ నగర్ సునాయాసంగా తెరాస పరమైంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హుజూర్ నగర్‌ ఉప ఎన్నిక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెరాసకు ఝలక్ ఇవ్వడం ఖాయం అని అంచనా వేసిన ఎన్నికల విశ్లేషకులు తెరాసకు వచ్చిన ఓట్ల మెజారిటీని చూసి బిత్తరపోయారనే చెప్పాలి. 

గెలవడం కష్టసాధ్యం అనుకున్నచోట ప్రతిపక్షాలకు, మీడియాకు, ఎన్నికల విశ్లేషకులకు కూడా అంతుబట్టని తీరులో తెరాస విజయ దుందుభి మోగించింది. తెరాస అభ్యర్థి్ సనంపూడి సైది రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ సతీమణి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్ పద్మావతిపై 43,233 ఓట్ల ఆధిక్యతతో అద్భుత విజయం సాధించారు. కాని తెరాసకు ఇది బలుపా, వాపా అనేది తేలాల్సి ఉంది.

పోలింగ్ ముగియిగానే టీఆర్ఎస్ అభ్యర్థి సైది రెడ్డిన తనవద్దకు పిలిపించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ 25 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తావని చెప్పినట్లు తెరాస పార్టీ వర్గీయులు చెబుతున్నారు. అంటే తెరాస అధినేత, ముఖ్యమంత్రికి కూడా హుజూర్ నగర్ ఇంత భారీ విజయాన్ని కట్టబెట్టనుందని ఊహించలేదన్నమాటే.

ఆర్టీసీ సిబ్బంది సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షం నుంచి శాసనసభ సీటును లాక్కోవడంలో తెరాస విజయవంతమైనట్లే మరి. కానీ ఎవరికీ అంతుబట్టకుండా మైక్రో లెవల్ పోల్ మేనేజ్‌మెంట్‌ను అద్భుతంగా నిర్వహించిన టీఆర్ఎస్ భారీమెజారిటీతో హుజూర్ నగర్ సీటును కైవసం చేసుకుంది

హుజూర్ నగర్ ఉపఎన్నికను సవాలుగా తీసుకున్న కేసీఆర్ తన తనయుడు, మంత్రి కేటీఆర్‌తోపాటు పార్టీకి చెందిన అన్ని స్థాయిల్లోని 70 మంది సీనియర్ నేతలను హుజూర్ నగర్‌ పంపించి ప్రచారాన్ని నడిపించారు. పైగా ధనబలం, కండబలం విషయంలో కూడా తెరాస శక్తిసామర్థ్చాల ముందు కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు తాళలేకపోయాయి. పైగా నియోజకవర్గంలోని పోల్ మేనేజర్లందరినీ తెరాస తన గుప్పిట్లోకి తెచ్చుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి చివిరిదశలో పోల్ మేనేజర్లు కూడా అందుబాటులో లేకుండా పోయారని సమాచారం.

అంతా బాగుంది కానీ హుజూర్ నగర్ గెలుపును తెరాస బలుపుగా తీసుకుంటే భవిష్యత్తులో దెబ్బతినడం ఖాయమని కొందరు ఎన్నికల విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. విజయగర్వంతో విర్రవీగితే గతంలో చంద్రబాబు నాయుడికి పట్టన గతే తెరాసకు కూడా పడుతుందని వీరు చరిత్రను గుర్తు చేస్తున్నారు. 

పాలక పక్షం సాధారణంగానే ఉపఎన్నికల్లో సర్వ శక్తులను కేంద్రీకరించి పనిచేస్తుంది. పోలీసు, స్థానిక అధికారుల అండదండలతో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా చేయవచ్చు. కానీ అదే సమయంలో ఉప ఎన్నికలో గెలిచామని సంబరపడిపోయి విజయగర్వంతో ఊగిపోతే అంతిమ ఫలితాలు తల్లకిందులయ్యే ప్రమాదముందిని విశ్లేషకుల  భావన.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గతంలో నంద్యాల ఉప ఎన్నికలో సర్వ శక్తులూ ఉపయోగించి ప్రతిపక్షమైన వైకాపాను దెబ్బతీశారు. భారీ మొత్తంలో డబ్బు గుమ్మరించడం, అధికారయంత్రాంగాన్ని దుర్వినియోగ పర్చడం ద్వారా నంద్యాల ఎన్నికల్లో సునాయాసంగా బాబు గెలుపు సాధించారు. 

కానీ ఏపీలో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాల ఉపఎన్నికలో పరాజయం తర్వాత మేలుకుని తన వ్యూహాన్ని మొత్తంగా మార్చేశారు. సంవత్సరం పాదయాత్ర ద్వారా శక్తి పుంజుకున్న జగన్ 2019లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అధికార టీడీపీని ఊచకోత కోశారు. 

తెలంగాణ విషయానికి వస్తే ప్రతిపక్షం తెరాసతో పోలిస్తే బలహీనపడినట్లు కనిపిస్తున్నా, ప్రభుత్వ వ్యతిరేకత పెరిగితే మాత్రం ఆ బలహీనతే బలంగా మారి అధికార పక్షాన్ని దెబ్బతీయడం తప్పదని, అందుకే విజయగర్వం తెరాసను ఆవహిస్తే నంద్యాల ఉపఎన్నికల తదనంతర చరిత్ర తెలంగాణలో కూడా పునరావృతం కాక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   an hour ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   2 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   3 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   4 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   4 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   5 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   6 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   7 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   7 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   8 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle