newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

హుజూర్ నగర్‌పై ఆశలు వదులుకున్న టీఆర్ఎస్

21-10-201921-10-2019 13:40:12 IST
Updated On 21-10-2019 16:59:08 ISTUpdated On 21-10-20192019-10-21T08:10:12.647Z21-10-2019 2019-10-21T08:10:08.424Z - 2019-10-21T11:29:08.370Z - 21-10-2019

హుజూర్ నగర్‌పై ఆశలు వదులుకున్న టీఆర్ఎస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో గెలుపుపై తెలంగాణ రాష్ట్ర సమితి ఆశలు వదిలేసుకున్నట్లేనా? రాజకీయ విశ్లేషకుల అబిప్రాయాలను చూస్తుంటే ఉపఎన్నికల్లో ఓటమి అనేదే ఎరుగని టీఆర్ఎస్ అయిదేళ్ల తర్వాత హుజూర్ నగర్‌లో తొలి ఓటమిని చవిచూడనుందనే చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన సైదిరెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటివరకు హుజూర్‌నగర్‌లో ఖాతా తెరవని టీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది.

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలను పలుకారణాలతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెరాస నాయకత్వం కేటీఆర్, జగదీష్ రెడ్డి, తదితర నేతలతో పార్టీ అభ్యర్థి ఎస్ సైదిరెడ్డి తరపున పూర్తిస్థాయి ప్రచారం చేపట్టింది. కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలకు సాధ్యం కాని విధంగా గల్లీగల్లీలో తిరుగుతూ రాష్ట్ర నాయకత్వాన్ని కేడర్‌ని మొత్తంగా హుజూర్ నగర్‌లో కేంద్రీకరించడంలో తెరాస విజయం సాధించిది కానీ తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది సమ్మె ప్రభావంతో ఉపఎన్నికల దృశ్యం ఒక్కసారిగా మారిపోయింది.
పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి, స్థానిక నేతలు చివరి రోజు వరకు ప్రచారాన్ని తీవ్ర స్థాయిలో నిర్వహించారు. కానీ పార్టీ అగ్రనాయకత్వంనుంచి ఆశించినంత మద్దతు వీరికి అందలేదు. ఎన్నికల కేంపెయిన్ ఇన్‌చార్జీలుగా నియమితులైన పలువురు మంత్రులు సైతం ఆర్టీసీ సిబ్బంది విమర్శలకు గురవుతామన్న భావంతో ప్రచారానికి రాలేకపోయారు. 

పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ చివరి రోజున హుజూర్ నగర్ ప్రచారానికి రాలేకపోవడంతో తెరాస కేంపెయిన్‌కి పెద్ద దెబ్బతగిలినట్లయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన హెలికాప్టర్‌కు విమాన యాన సంస్థ అనుమతి నివ్వని కారణంగా హుజార్‍‌ నగర్ సభకు ఆయన చేరుకోలేకపోయారు. 

దీనికి తోడుగా టీఆర్ఎస్‌కు ఈసారి పోలీసులనుంచి మునుపటిలాగా ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. ఎన్నికల కమిషన్ సూర్యాపేట జిల్లా ఎస్పీని బదిలీ చేసి ఇతర పోలీసు అధికారులను కట్టడి చేయడంతో తెరాసకు అనుకూలంగా ఏ అధికారీ అండదండలు అందించడానికి వీల్లేకపోయింది.

ఎన్నికల కమిషన్ఆ దేశానుసారం పోలీసులు తెరాస మద్దతుదారుల నుంచి భారీ నగదును, లిక్కర్‌ని స్వాధీనపర్చుకున్నారు. పైగా నియోజకవర్గంలోని తెరాసనేత పాఠశాలను మూసివేశారు. ఇక్కడినుంచే తెరాస కార్యకర్తలకు, ఓటర్లకు అవసరమైన నగదు పంపిణీ అవుతోందన్న సమాచారంతో ఈసీ కఠిన చర్యలు తీసుకుని తెరాసకు ఊపిరాడనీయకుండా చేసింది.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పట్ల కేసీఆర్ మొండిపట్టును సహించని ప్రజానీకం హుజూర్‌నగర్‌ ఓటర్లు ఉపఎన్నికల్లో తెరాసకు జలక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు భారీగా చీలిపోతే తన గెలుపు సాధ్యమని తెరాస నమ్మకం పెట్టుకుంది. కాషాయ పార్టీ కూడా  ఈ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకోవడంతో అర్బన్ ఓట్లు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీలిపోతాయని, దీంతో తాము ప్రయోజనం పొందుతామని తెరాస నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. 

కానీ రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. ఆర్టీసీ సమ్మె ప్రభావం తెరాసకు ఈసారి పరాజయాన్ని మిగిలించవచ్చు కూడా. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఎన్నికల అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఏకైక ఉపఎన్నిక కావడంతో అందరి దృష్టి హుజూర్‌నగర్‌పై నెలకొంది. అయితే, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా గెలుపెవరిదని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నేడు (అక్టోబర్‌ 21) రోజున పోలింగ్ జరుగనుంది. 24న ఫలితాలు వెలువడుతాయి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle