newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

హుజూర్‌‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం

21-10-201921-10-2019 07:22:23 IST
2019-10-21T01:52:23.961Z21-10-2019 2019-10-21T01:52:13.045Z - - 22-02-2020

 హుజూర్‌‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాజకీయాలను వేడెక్కించిన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమయింది. ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. హుజూర్‌ నగర్‌ నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో మొత్తం 2 లక్షల 36 వేల 842 మంది ఓటర్లు ఉన్నారు. 

హుజూర్ నగర్ నియోజకవర్గంలో మొత్తం 302 పోలింగ్‌ స్టేషన్ లను ఏర్పాటు చేశారు.  అర్బన్‌ లో 31 పోలింగ్‌ కేంద్రాలు, రూరల్‌ లో 271 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 79 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. అక్కడ భద్రతను మరింత పెంచారు. 

నేరేడుచర్ల మండలంలో 34 వేల 87 మంది ఓటర్లు ఉండగా.. 43 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాలకీడు మండలంలో 19 వేల 639 మంది ఓటర్లకుగాను 25 పోలింగ్‌ కేంద్రాలు, మఠంపల్లి మండలంలో 34 వేల 855 మంది ఓటర్లు ఉన్నారు. ఇందుకోసం ఈసీ 43 పోలింగ్‌ స్టేషన్లను అందుబాటులో ఉంచింది. 

మేళ్లచెరువు మండలంలో 41 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటుచేయగా.. ఇక్కడ 31 వేల 270 మంది ఓటర్లు ఉన్నారు. చింతలపాలెం మండలంలో 25 వేల 228 మంది ఓటర్లుంటే… ఈసీ 36 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేసింది. హుజూర్‌ నగర్‌ మండలంలో 47వేల 886 మంది, గరిడేపల్లి మండలంలో 43 వేల 877 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు మండలాల్లో 57 పోలింగ్‌ స్టేషన్లున్నాయి.

ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏఎస్ఐతో కూడిన బృందం విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 2 వేలకు పైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 378 వీవీ ప్యాట్‌ లను ఉపయోగిస్తున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 14 చెక్ పోస్ట్ ల దగ్గర ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.

ఓటు వేసిన వ్యక్తి ఏ గుర్తుకు ఓటు వేశారో అన్న సమాచారం వీవీ పాట్ మిషన్ లో 10 సెకండ్ల పాటు కనిపిస్తుంది .ఆ తరువాత ఆ స్లిప్ బాక్స్‌ లో పడిపోతుంది. నియోజకవర్గంలో ఇప్పటివరకు పెద్దగా ఉల్లంఘనలు నమోదుకాలేదు. దీంతో బైపోల్ కూడా ప్రశాంతంగా జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

గత ఎన్నికల తరహాలోనే ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్  కుమార్ రెడ్డి భార్య, మాజీ ఎమ్మెల్యే పద్మావతి, గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన అధికార టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి, టీడీపీ నుంచి చావా కిరణ్మయి, బీజేపీ అభ్యర్థి రామారావు బరిలో ఉన్నారు. ప్రధానంగా పోటీ కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ మధ్యే ఉండనుంది. ఫలితాలు ఈ నెల 24న వెలువడతాయి. 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   4 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   5 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   6 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   7 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   8 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   8 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   10 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   10 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   10 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle