newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

హుజూర్‌న‌గ‌ర్‌లో కాంగ్రెస్ ఆశ‌లు గ‌ల్లంతేనా..?

23-10-201923-10-2019 07:49:52 IST
Updated On 23-10-2019 15:06:50 ISTUpdated On 23-10-20192019-10-23T02:19:52.654Z23-10-2019 2019-10-23T02:18:22.215Z - 2019-10-23T09:36:50.454Z - 23-10-2019

హుజూర్‌న‌గ‌ర్‌లో కాంగ్రెస్ ఆశ‌లు గ‌ల్లంతేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక ముగిసింది. ఓట‌రు నాడి ఈవీఎంల‌లో భ‌ద్రంగా ఉంది. అయితే, ఇక్క‌డ ఏ పార్టీ గెలుస్తుంది అనే ఉత్కంఠ మాత్రం అన్ని పార్టీల‌తో పాటు సామాన్యుల్లోనూ పెరిగిపోతోంది. కాంగ్రెస్‌కు ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం, టీఆర్ఎస్‌కు ఇటీవ‌లి ప‌రిణామాలు వ్య‌తిరేకంగా ఉండ‌టంతో నియోజ‌క‌వ‌ర్గ ఓట‌ర్లు ఎటువైపు నిలిచారోన‌నే చ‌ర్చ తెలంగాణ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున జ‌రుగుతోంది.

హుజూర్‌న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ పార్టీ క‌నీసం 15 వేల ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధిస్తుంద‌ని ప్ర‌ముఖ స‌ర్వే సంస్థ "ఆరా పోల్ స్ట్రాట‌జీస్ ప్రైవేట్ లిమిటెడ్" అంచ‌నా వేసింది. ఈ నేప‌థ్యంలో హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్ స‌ర్వేపై ఆరా సంస్థ అధినేత షేక్ మ‌స్తాన్‌తో "న్యూస్ స్టింగ్" మాట్లాడింది. టీఆర్ఎస్ ఎందుకు గెలిచే అవ‌కాశాలు ఉన్నాయో, ఓట‌రు నాడి ఎలా ఉందో ఆయ‌న వివ‌రించారు.

ప్ర‌స్తుతం ఆర్టీసీ కార్మికుల స‌మ్మె, త‌ద‌నంత ప‌రిణామాలు, టీఆర్ఎస్ ఎన్నిక‌ల హామీలు పూర్తిగా నెర‌వేర‌క‌పోవ‌డం వంటి అంశాలు ప్ర‌జ‌ల్లో ఆ పార్టీ ప‌ట్ల కొంత వ్య‌తిరేక‌త తెచ్చిన మాట వాస్త‌వ‌మేన‌ని ఆయ‌న తెలిపారు.

అయితే, అమ‌ల‌వుతున్న రైతుబంధు, పింఛ‌న్లు వంటి ప‌థ‌కాల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో సానుకూల‌త ఉంద‌ని ఆయ‌న చెప్పారు. పైగా ఈ ఉప ఎన్నిక వ‌ల్ల పెద్ద‌గా ఏ పార్టీకి లాభం, న‌ష్టం లేద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో ఉంద‌ని, అందుకే అధికార పార్టీకే ఓటేస్తే అభివృద్ధి అవుతుంద‌ని, ప‌థ‌కాలు మెరుగ్గా అమ‌ల‌వుతాయ‌నే ఆలోచ‌న ప్ర‌జ‌ల్లో ఉంద‌ని మ‌స్తాన్ తెలిపారు.

ఇదే స‌మ‌యంలో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప‌ట్ల కూడా ప్ర‌జ‌ల్లో సానుకూల‌త ఉంద‌ని, ఆయ‌న వ‌ల్లే నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి చెందింద‌ని, లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుల వ‌ల్ల సాగునీరు అందించార‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో ఉన్న‌ట్లు చెప్పారు.

కానీ, ఈ ఉప ఎన్నిక ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డికి గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ వ‌చ్చే లాభం ఏం లేద‌ని, ఇంకా నాలుగేళ్లు టీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే ఉంటుంది కాబ‌ట్టి టీఆర్ఎస్‌కే ఓటేయాల‌నే ఆలోచ‌న ప్ర‌జ‌ల్లో క‌నిపించింద‌న్నారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీకి కూడా హుజూర్‌న‌గ‌ర్ చేదు ఫ‌లితాల‌నే ఇస్తుంద‌ని మ‌స్తాన్ అంచ‌నా వేశారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం బీజేపీకి పూర్తిగా ప‌ట్టు లేని ప్రాంతం కావ‌డం మైన‌స్‌గా మారింద‌ని తెలిపారు.

గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి 1555 ఓట్లు వ‌చ్చాయ‌ని, ఈ ఎన్నిక‌లో మాత్రం ఓట్లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని, క‌నీసం 5 వేల ఓట్లు వ‌స్తాయ‌ని అంచ‌నా వేశారు. బీసీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన అభ్య‌ర్థి కావ‌డం కొంత ప్ల‌స్ అయినా అభ్య‌ర్థిని ఆల‌స్యంగా ఖ‌రారు చేయ‌డం బీజేపీకి మైన‌స్ అవుతుంద‌న్నారు.

ఇక‌, సీమాంధ్ర‌కు అనుకొని ఉండే హుజూర్‌న‌గ‌ర్‌లో టీడీపీ ప్ర‌భావ‌మూ ఏ మాత్రం ఉండ‌ద‌ని త‌మ స‌ర్వేలో తేలిన‌ట్లు మ‌స్తాన్ తెలిపారు. ప్ర‌ధానంగా టీడీపీ ఆశ‌లు పెట్టుకున్న క‌మ్మ సామాజిక‌వ‌ర్గం కూడా తెలంగాణ రాజ‌కీయాల‌ను, ఏపీ రాజ‌కీయాల‌ను ప్ర‌త్యేకంగా చూస్తోంద‌ని, కాబ‌ట్టి వారు కూడా హుజూర్‌న‌గ‌ర్‌లో టీడీపీ వైపు పూర్తిగా లేర‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. కాబ‌ట్టి టీడీపీకి సుమారు 2 వేల ఓట్ల కంటే ఎక్కువ రాక‌పోవ‌చ్చ‌ని మ‌స్తాన్ అంచ‌నా వేశారు.

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   5 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   6 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   7 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   8 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   8 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   9 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   10 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   11 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   11 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   12 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle