newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

హుజూర్‌నగర్లో హోరాహోరీ.. సీపీఐ మద్దతు వర్కవుట్ అవుతుందా?

03-10-201903-10-2019 10:38:04 IST
2019-10-03T05:08:04.841Z03-10-2019 2019-10-03T05:07:39.978Z - - 20-10-2020

హుజూర్‌నగర్లో హోరాహోరీ.. సీపీఐ మద్దతు వర్కవుట్ అవుతుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో హుజూర్ నగర్ ఉపఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈసారి హుజూర్ నగర్లో తొలిసారి గులాబీ జెండా ఎగరటం ఖాయమంటున్నారు మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ ప్రచారానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవలాంటిదని.. అలాంటి పార్టీకి ప్రజలెవ్వరూ ఓటెయ్యరని కేటీఆర్ అన్నారు.  

హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీకి  ఘోర పరాజయం తప్పదన్నారు. టీఆర్ఎస్ పాలనలో హుజూర్ నగర్ లో అభివృద్ధి జరగలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల మాదిరిగానే... హుజూర్ నగర్ లోనూ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్ లు వంటి అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐదేళ్లలో టీఆర్ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధిని అక్కడి ప్రజలకు వివరించాలని పార్టీ ప్రచార ఇన్చార్జీలను కేటిఆర్ కోరారు. 

తానే స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని కేటీఆర్ చెప్పడాన్ని బట్టి సైదిరెడ్డి గెలుపు ఖాయంగా చెబుతున్నారు. హుజూర్ నగర్ లో ప్రచారశైలిని, ప్రజల స్పందనను టెలికాన్ఫరెన్సులో నాయకులను అడిగి కేటీఆర్  తెలుసుకున్నారు. హుజూర్ నగర్ లో ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో సీపీఐ ఓట్లు కూడా టీఆర్ఎస్ కు పడతాయని భావిస్తున్నారు.

సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన అనంతరం టీఆర్ఎస్ కు మద్దతు తెలపాలని నిర్ణయించింది. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించాలని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. మరోవైపు సీపీఎం అభ్యర్ధి నామినేషన్ తిరస్కరించడంతో ఆ పార్టీ మద్దతు తమకు ఇవ్వాలని టీటీడీపీ అధ్యక్షుడు రమణ కోరారు. భారీగా నామినేషన్లు తిరస్కరించడంతో ఎన్నికలు ఉత్కంఠగా సాగనున్నాయి. 

గత మూడు పర్యాయాలుగా ఇక్కడ టీఆర్ఎస్ గెలవలేదు. దీంతో ఈ సారి ఉప ఎన్నికల్లో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. గతంలో 2009,2014,2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుంటే.. ఇదే స్థానం నుంచి టీపీసీసీ రథసారథి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం గెలుస్తూ హ్యాట్రిక్ సాధించారు. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్‌ స్థానంలో మొత్తం 16 మంది పోటీచేశారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి 92,996 ఓట్లు రాగా.. రెండో స్థానంలో టీఆర్ఎస్ నిలిచింది. టీఆర్ఎస్ తరఫున బరిలో దిగిన శానంపూడి సైదిరెడ్డికి 85,530 ఓట్లు వచ్చాయి. అయితే కేవలం 7466 ఓట్ల తేడాతోనే ఓటమిపాలయ్యారు.అధికార పార్టీ ఈ సారి ప్రతిష్టాత్మకంగా హుజూర్ నగర్ ఎన్నికను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ సారి ఉత్తమ్ కంచు కోటను బద్దలు కొట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులంతా ఈ ఎన్నికను సవాల్ గా తీసుకోనున్నారు. 

హ‌రీశ్ వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్..దుబ్బాక‌లో దుమ్ముదుమారం

హ‌రీశ్ వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్..దుబ్బాక‌లో దుమ్ముదుమారం

   10 hours ago


వ‌ల్ల‌భ‌నేని వంశీ దారెటు..? అనుచ‌రుల కొత్త స‌ల‌హా!

వ‌ల్ల‌భ‌నేని వంశీ దారెటు..? అనుచ‌రుల కొత్త స‌ల‌హా!

   13 hours ago


అమరావతిని తప్పించిన ఎక్స్‌ప్రెస్ వే.. కేంద్రం ఆమోదముద్ర

అమరావతిని తప్పించిన ఎక్స్‌ప్రెస్ వే.. కేంద్రం ఆమోదముద్ర

   16 hours ago


టీడీపీ కొత్త టీమ్

టీడీపీ కొత్త టీమ్

   17 hours ago


తల దూర్చకంటూ బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన జేపీ నడ్డా

తల దూర్చకంటూ బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన జేపీ నడ్డా

   17 hours ago


కరోనా కేసుల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌ ఏపీ..

కరోనా కేసుల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌ ఏపీ..

   18 hours ago


మీలో మాస్క్ మహారాజు ఎవరు.. తెలంగాణ సర్కార్ కొత్త ప్రచారం

మీలో మాస్క్ మహారాజు ఎవరు.. తెలంగాణ సర్కార్ కొత్త ప్రచారం

   19 hours ago


బీసీ నేతలు చేయలేని మేలు ఏపీ సీఎం చేశారు.. ఆర్‌. కృష్ణయ్య

బీసీ నేతలు చేయలేని మేలు ఏపీ సీఎం చేశారు.. ఆర్‌. కృష్ణయ్య

   19 hours ago


పాకిస్థాన్ ప్ర‌ధానికి మూడిన‌ట్లే ఉంది

పాకిస్థాన్ ప్ర‌ధానికి మూడిన‌ట్లే ఉంది

   20 hours ago


ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న వరుణ భీభత్సం

ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న వరుణ భీభత్సం

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle