newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

18-10-201918-10-2019 16:26:08 IST
Updated On 18-10-2019 17:37:56 ISTUpdated On 18-10-20192019-10-18T10:56:08.766Z18-10-2019 2019-10-18T10:41:42.126Z - 2019-10-18T12:07:56.406Z - 18-10-2019

హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక రాజకీయ వేడిని రాజేసింది. అధికార టీఆర్ఎస్ ఈ సీటుని ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంటే.. ఈసారి కూడా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఒక్క సీటు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారం శనివారంతో ముగియనుంది.

Image may contain: 10 people, including Vsr Sastry, people smiling

ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ మంత్రుల్ని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను భారీగా రంగంలోకి దింపింది. ఇటు కాంగ్రెస్ అగ్రనేతలు కూడా హుజూర్ నగర్లో కాంగ్రెస్ అభ్యర్ధి, ఎంపీ ఉత్తమ్ కుమార్  రెడ్డి భార్య పద్మావతి రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. బీజేపీ కూడా  మోడీ ఇమేజ్ తమకు ప్లస్ అవుతుందని భావిస్తోంది. హుజూర్ నగర్లో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచార హోరుని ‘న్యూస్ స్టింగ్’ టీం పరిశీలించింది. 

తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో నడిపిస్తున్న టీఆర్ఎస్ పార్టీ హుజూర్ నగర్లో జెండా ఎగరేయడం ఖాయం అన్నారు టీఆర్ఎస్ నేత గాదరి కిషోర్ కుమార్. కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గంలో సంక్షేమం కుంటుపడిందని, తాము అధికారంలో ఉన్నా అక్కడ ఎన్నో పనులు చేశామన్నారు. కారు గుర్తుకి ఓటేసేందుకు ఓటర్లంతా సిద్దంగా ఉన్నారన్నారు. సైదిరెడ్డి గెలుపు ఖాయం అని, మెజారిటీ గురించే ఆలోచిస్తున్నామన్నారు. ఆర్టీసీ సమ్మె ప్రభావం ఈ ఎన్నికపై ఉండదన్నారు.  

బీజేపీ హుజూర్ నగర్లో ప్రచారం నిర్వహించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె లక్ష్మణ్ ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థి రామారావు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేశారు. నరేంద్రమోడీ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో తన గెలుపు ఖాయం అంటున్నారు. రహదారుల సమస్య, నిరుద్యోగం, ఉద్యోగాల కల్పన చేస్తామని హామీ ఇచ్చామన్నారు. తనను గెలిపిస్తే.. కాగితాల మీద కాకుండా వాస్తవంగా అభివృద్ధి చేస్తామన్నారు.

కేంద్రం నిధులను రాష్ట్రం సరిగా వినియోగించడంలేదని, ప్రజలు మార్పుకోరుతున్నారని నరేంద్రమోడీ నాయకత్వానికి మద్దతు లభిస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్. బీజేపీ అభ్యర్ధి తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు లక్ష్మణ్. అధికార టీఆర్ఎస్ పార్టీ అన్నిరంగాల్లో విఫలమయిందని, ఈసారి నిశ్శబ్ధ విప్లవం గ్యారంటీ అంటున్నారు లక్ష్మణ్. 

ఇటు కాంగ్రెస్ తరఫున పార్టీ సీనియర్ నేతలు హనుమంతరావు, ఫిరోజ్ ఖాన్ ప్రచారంలో పాల్గొన్నారు. హుజూర్ నగర్లో కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి గెలుపు గ్యారంటీ అన్నారు వీహెచ్. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఎంతో స్పందన కనిపిస్తోందన్నారు. ఉత్తమ్ ఎంపీగా ఉండడం వల్ల ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిస్తే.. పార్లమెంటు నిధులు కూడా వస్తాయన్నారు.

కాంగ్రెస్ మైనారిటీ నేత ఫిరోజ్ ఖాన్ టీఆర్ఎస్ తీరుపై మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ కే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఉత్తమ్ కుమార్, పద్మావతి జీవితాన్ని ప్రజలకు తమ జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మంచి మెజారిటీ గ్యారంటీ అన్నారు. అధికార పార్టీ డబ్బు, మద్యం ప్రభావంతో గెలవాలని చూస్తున్నారన్నారు. ఐదారువేల మెజారిటీ పద్మావతికి వస్తుందన్నారు. ఆర్టీసీ సమ్మెతో టీఆర్ఎస్ కు గుణపాఠం ఖాయం అన్నారు.

తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్ధి ఎన్.పద్మావతి రెడ్డి. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తప్పదన్నారు. ఆరేళ్ళలో తెలంగాణ ప్రభుత్వ అసమర్థతను జనంలోకి తీసుకెళుతున్నామన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వ వైఖరిని ఆమె తీవ్రంగా విమర్శించారు. 

మొత్తం మీద హుజూర్ నగర్ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్, బీజేపీలకు ఇజ్జత్ కా సవాల్ గా మారింది. తామే గెలుస్తామని ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఓటర్లు ఎవరికి ఓటేస్తారో.. ఏపార్టీ హుజూర్ నగర్ కోటపై తన జెండా ఎగురేస్తుందో చూడాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle