newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

హుజూర్‌నగర్లో ష్..గప్ చుప్.. ముగిసిన ప్రచారం

19-10-201919-10-2019 18:09:37 IST
2019-10-19T12:39:37.252Z19-10-2019 2019-10-19T12:39:19.868Z - - 25-02-2020

హుజూర్‌నగర్లో ష్..గప్ చుప్.. ముగిసిన ప్రచారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాజకీయాలను హీటెక్కించిన హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ కు గడువు దగ్గరపడుతోంది. శనివారం సాయంత్రం 5 గంటలతో హుజూర్ నగర్ లో ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి.

సోమవారం 21న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక జరుగనుంది. అనంతరం ఈనెల 24న ఫలితం వెలువడనుంది.  ఉప ఎన్నిక నేపధ్యంలో  నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. 

ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా అభ్యర్థులపై ఎన్నికల సంఘం గట్టి నిఘా పెట్టింది.  హుజూర్ నగర్ నియోజకవర్డం పరిధిలో పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. రౌడీ షీటర్లు, పాత నేరస్థుల కదలికలపై నిఘా పెట్టారు. లైసెన్స్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానికేతరులు ఈ ప్రాంతం విడిచి వెళ్లాలని పోలీసులు ఆదేశించారు.

ఆర్టీసీ సమ్మె ప్రభావం అధికార పార్టీపై ప్రతికూలతను చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  దీంతో మైక్‌లు మూగబోయాయి. దీంతోపాటు నియోజకవర్గంలో 48 గంటల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. ఈనెల 21న సోమవారం ఉప ఎన్నిక జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 

హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2.20లక్షల మంది ఓటర్లు ఉన్నారు. హుజూర్ నగర్‌లో మొత్తం ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లతో కలిపి 28 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. టీఆర్ఎస్ తరఫున సైదిరెడ్డి, కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ పద్మావతి రెడ్డి, టీడీపీ తరఫున చావా కిరణ్మయి, బీజేపీ తరఫున రామారావు పోటీ చేస్తున్నారు.

వీరిలో ప్రధానంగా ఉత్తమ్ పద్మావతి రెడ్డి, సైదిరెడ్డి మధ్యనే పోటీ ఉండనుంది. తొలుత టీఆర్ఎస్‌కు మద్దతు పలికిన సీపీఐ.. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ వైఖరిని ఖండిస్తూ తమ మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో టీఆర్ఎస్ కు వ్యతిరేక ఓట్లు బాగానే పడతాయని అంటున్నారు. 

2018 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా పోటీ చేసి ఉత్తమ్ విజయం సాధించారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల కమిషన్ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ సీటుని ఎలాగైనా సాధించాలని అధికార టీఆర్ఎస్, సీటుని నిలుపుకోవాలని కాంగ్రెస్ ఇజ్జత్ కా సవాల్ గా భావిస్తున్నాయి.దీంతో ఈ ఉప ఎన్నికలో ఫలితం ఎవరివైపు ఉంటుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle