newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

హిందూమతంపై మాటలు జాగ్రత్త పవన్: మండిపడ్డ రాజాసింగ్

03-12-201903-12-2019 13:44:50 IST
2019-12-03T08:14:50.772Z03-12-2019 2019-12-03T08:14:42.759Z - - 25-02-2020

హిందూమతంపై మాటలు జాగ్రత్త పవన్: మండిపడ్డ రాజాసింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హిందూమతం, హిందూ ధర్మంపై వ్యాఖ్యానించేటప్పుడు పవన్ కల్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. హిందూ మతంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఖండించారు. హిందూమతం, ధర్మం గురించి కనీస అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్‌ ఏ మతానికి చెందిన వాడు, తానేమైనా ఇతర మతానికి మారిపోయారా అని ప్రశ్నించారు. 

హిందూ మతాన్ని టార్గెట్‌గా చేసి మట్లాడం సరైనది కాదని, లౌకికతత్వంపై పవన్‌కు కనీస అవగాహన కూడా లేదని హితవుపలికారు. పవన్‌ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. లేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని, ఖబర్దార్ పవన్‌ అని హెచ్చరించారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోమవారం తిరుపతిలో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నేతలే అని వ్యాఖ్యానించారు. మతాల మధ్య గొడవపెట్టేది హిందూ నాయకులేనని పవన్‌ ఆరోపించారు. ఇతర మతాల నేతలు ఇలాంటి పనులు చేయరని అన్నారు. అలాగే టీటీడీలో అన్యమత ప్రచారం చేయిస్తోంది హిందువులేనని ఆరోపించారు. హిందూ నాయకుల ప్రేరణ లేనిదే ఇలాంటివి జరగవని అన్నారు. 

తాను చిన్నప్పటి నుంచి వింటోంది ఒకటేనని.. సెక్యులరిజాన్ని ఇబ్బంది పెడుతోంది హిందూవులు మాత్రమేనని వ్యాఖ్యానించారు. మిగతా మతాల వారు ఇలాంటి పనులు చేయరని చెప్పారు. కాగా, పవన్‌ హిందూ మతంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారాయి. పలువర్గాల నుంచి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

హిందూ మతంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి కోట సాయికృష్ణ ఖండించారు. పవన్‌ కల్యాణ్‌వి అపరిపక్వ రాజకీయాలని విమర్శించారు. పవన్‌ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. హిందువుల మనోభావాలను పవన్‌ అవమానించారని తెలిపారు.

ఈ వ్యాఖ్యలను బీజేపీ పూర్తిగా ఖండిస్తోందన్నారు. హిందూ మతంపై చేసిన వ్యాఖ్యలను పవన్‌  వెనక్కి తీసుకోని.. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనిపై పవన్‌ బహిరంగ చర్చకు సిద్దమా అని సవాలు విసిరారు.

మరోవైపు వీహెచ్‌పీ నేతలు కూడా పవన్‌ వ్యాఖ్యలను ఖండించారు. పవన్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్‌ డిమాండ్‌ చేశారు. పవన్‌కు పిచ్చిపట్టినట్లుందని వ్యాఖ్యానించారు. హిందువులను అగౌరవపరిచేలా మాట్లాడటం సరికాదని సూచించారు.

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle