హాస్టల్ విద్యార్థుల విషయంలోనే వ్యవస్థ కుప్పగూలిపోలేదా?
26-03-202026-03-2020 09:59:18 IST
Updated On 26-03-2020 11:54:50 ISTUpdated On 26-03-20202020-03-26T04:29:18.263Z26-03-2020 2020-03-26T04:29:08.241Z - 2020-03-26T06:24:50.478Z - 26-03-2020

మహమ్మారి లాంటి వైరస్ ఉత్పాతాలు సంభవించినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే ఆకస్మిక నిర్ణయాలు వేలాది మంది జీవితాలపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయనడానికి ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణలో ఆంద్రవిద్యార్థులు ప్రయాసల బట్టి అర్థం చేసుకోవచ్చు. మొదట జనతా కర్ప్యూ, తర్వాత వెనువెంటనే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అని ప్రకటించిన ప్రభుత్వాలు తీసుకున్న ఆకస్మిక నిర్ణయం గత రెండురోజులుగా హైదరాబాద్ లో చదువు, కోచింగ్, ఉద్యోగాల నిమిత్తం వచ్చిన వేలాదిమంది ఆంధ్ర విద్యార్థినీ విద్యార్ధులకు చుక్కలు చూపించిందింటే అతిశయోక్తి లేదు. కరోనా వైరస్ నిరోధంకోసం ప్రకటించిన లాక్ డౌన్లో భాగంగా హైదరాబాద్‌లో విద్యార్థుల, ఉద్యోగుల హాస్టళ్లను ఉన్నఫళాన మూసివేయాలంటూ హకుం చేసిన తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు వేలాది విద్యార్థినీ విద్యార్థుల ఆశ్రయం సమస్యను గాలికి వదిలేశారు.
హైదరాబాద్‌లో హాస్టళ్లు, మెస్‌లు హాఠాత్తుగా మూసివేయడంతో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, యువత రోడ్ల మీదకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇప్పటికిప్పుడు ఏం చేయాలో దిక్కు తోచడం లేదంటూ పలువురు పోలీస్స్టేషన్లకు వచ్చారు. వారు స్వస్థలాలకు వెళ్లేందుకు పోలీసులు హైదరాబాద్‌లో పాస్‌లు జారీ చేశారు. ఆ పాసులతో యువత కార్లు, బైకులపై రాష్ట్రానికి తరలివచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తొలుత జారీ చేసిన అనుమతి పత్రాలు పట్టుకుని భారీ సంఖ్యలో విద్యార్థులు పలు వాహనాల్లో తరలి వచ్చారు.

కానీ, వీరంతా హైదరాబాద్‌నుంచి ఒక్కసారిగా ఏపీకి వస్తున్నందున కరోనా వైరస్ విస్తరించకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు హెల్త్ ప్రొటోకాల్‌ను అనుసరించి వారిని అనుమతిస్తున్నారు. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న సమయంలో రాష్ట్రంలోకి అనుమతించబోమంటూ వారిని ఏపీ సరిహద్దుల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చెక్‌పోస్టుల వద్ద వేలాదిగా యువత నిలిచిపోయారు. వీరి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తర్వాత చర్యలు చేపట్టినా ఒకరోజంతా తమ పరిస్థితి ఏమిటనే విషయంలో విద్యార్థినీ విద్యార్థులు అల్లాడిపోయారు.
ప్రయివేటు ఉద్యోగాల రీత్యానో, కోచింగ్‌ల కోసమో కొంతకాలంగా హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే హాస్టళ్లలో ఉంటున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో అక్కడి హాస్టళ్లను మూసివేస్తుండడంతో వీరంతా ఏపీకి పయనమయ్యారు. బయట ప్రయాణించకుండా నిషేధాజ్ఞలు ఉండడడంతో బుధవారం వేలాదిగా పోలీసులను ఆశ్రయించారు. చెక్‌పోస్టులు, టోల్గేట్లలో ఆపకుండా అక్కడి పోలీసులు 8 వేలమందికి నిరభ్యంతర పత్రాలు జారీ చేశారు. అంతలో ఏపీ ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వాన్ని సంప్రదించి హాస్టళ్లు మూసేయకుండా చర్యలు తీసుకుంది. ఇప్పటికే చెక్‌పోస్టు వద్దకు చేరుకున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అనుమతిస్తోంది.
హాస్టళ్లలో ప్రవేశం లేక, బయట వసతి సౌకర్యాలు దొరకక, విలవిలలాడిన విద్యార్థులు వందల సంఖ్యలో పోలీసు స్టేషన్ల వద్ద గుమిగూడితే కానీ అధికారుల్లోనూ, ప్రభుత్వంలోనూ స్పందన కలగలేదు. విద్యార్థులను వ్యవస్థ నడిరోడ్డుపై వదిలివేస్తే వారు పోలీసు స్టేషన్ల తలుపు తట్టారు ఒకరు కాదు ఇద్దరు కాదు వందల సంఖ్యలో. ఇక్కడే లాక్ డౌన్ లక్ష్యం గాలికెగిరిపోయింది.
ఆ తర్వాత జరిగిన తంతు హారర్ సినిమా దృశ్యాలను తలపించింది. మొదట తెలంగాణ పోలీసు అధికారులు రోడ్డు మీద పడిన ఆంధ్రవిద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవడానికి వేలమందికి నిరభ్యంతర పత్రాలు జారీచేశారు. బతుకు జీవుడా అనుకుంటూ విద్యార్థులు పోలోమంటూ తెలంగాణ ఏపీ సరిహద్దుల వద్దకు దొరికిన వాహనాన్ని పట్టుకుని బయలుదేరితే అక్కడ వారిని ఏపీలోకీ అనుమతించలేదు. ఇటు తెలంగాణలోకి రానివ్వలేదు.
ఇలాంటి సమస్యలు ఏర్పడతాయని కనీసం అంచనా వేయకుండా ఆట్టహాసంగా లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వాలు చివరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల తీవ్రమైన ఒత్తిడి, ఆగ్రహావేశాల నేపధ్యంలో ఎట్టకేలకు మేల్కొన్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో హాస్టళ్లు, మెస్‌లు మూసేయాలనే నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వెల్లువలా తరలివచ్చి ఇబ్బందులు పడుతుండటంపై చిట్టచివరకు ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్‌లోనే ఉండేలా తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఒప్పించింది.
ఈ అంశంపై తొలుత రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో బుధవారం ఫోన్లో మాట్లాడారు. అనంతరం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంప్రదింపులు జరిపారు. సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద ఉన్న వారిని హెల్త్ ప్రొటోకాల్‌ను అనుసరించి రాష్ట్రంలోకి అనుమతించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. అనంతరం చెక్‌పోస్టుల వద్ద ఉన్న విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి, వారిని రాష్ట్రంలోకి అనుమతించారు.
కరోనా నివారణలో భాగంగా ఎక్కడి వారు అక్కడే ఉండేట్టుగా చూడాలని తెలుగు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించారు. బుధవారం రాత్రి ఏపీ సీఎం వై.ఎస్. జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు సంప్రదింపులు జరిపారు. జగ్గయ్యపేట వద్దకు చేరుకున్న ఏపీ వారికి హెల్త్ ప్రోటోకాల్ పాటించి రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయించారు.
ఇకపై హైదరాబాద్ నుంచి ఎవ్వరు వచ్చినా అనుమతించేదిలేదని ఏపీ అధికారులు స్పష్టం చేశారు. అలా అనుమతిస్తే వారికే కాక వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా రిస్క్‌లో పెట్టినట్లు అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. హాస్టళ్లు, మెస్‌లు మూయవద్దంటూ ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. అయినా హాస్టళ్లు మూసివేస్తుండటంతో వాటి యజమానులతో అధికారులు చర్చలు జరిపి, వాటిని తెరిపిస్తున్నారు.
చివరకు సమస్యకు పరిష్కారం దొరకటంతో హైదరాబాదులో ఉంటున్న ఏపీ విద్యార్థులు, ప్రైవేట్ విద్యాసంస్థలు, సంస్థల్లో పనిచేస్తున్న వారు ఎక్కడివారు అక్కడే ఉండాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న సమయంలో హైదరాబాద్ నుంచి బయటకు రావద్దని కోరింది. ఏపీలో తమ కుటుంబ సభ్యులు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. పైగా ఏవైనా సమస్యలుంటే 1902 నంబరుకు ఫోన్ చేయాలని సూచించింది.
కాగా, బుధవారం ఉదయం నుంచి జరిగిన పరిణామాలపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పోలీసులు ఇచ్చిన నిరభ్యంతర పత్రాలు చెల్లబోవని, తెలంగాణలో లాక్ డౌన్ అమలులో ఉన్నందున వసతి గృహాల్ని, పీజీ హాస్టళ్లను తప్పనిసరిగా నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరింంచారు. వసతి గృహాల నిర్వాహకులతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు, జీహెచ్ఎంసీ అధికారులకు డీజీపీ సూచించారు.
మరోవైపున హైదరాబాద్‌లోని ప్రైవేట్ వసతి గృహాలను, పీజీ మెస్సులను ఖాళీ చేయించరాదని, ఏ ఒక్కరినీ బయటకు పంపించవద్దని, అనవసరంగా భయాందోళనలు సృష్టించవద్దని రాష్ట్ర మంతిర కేటీ రామారావు యాజమాన్యాలకు సూచిస్తే గానీ పరిస్థితి సద్దుమణగలేదు ఆ తర్వాతనే పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి వసతి గృహయజమానులను హెచ్చరించడం జరిగింది.
లాక్ డౌన్ మొదలైన రెండు రోజులకే ప్రజల సమస్యల తక్షణ పరిష్కారంలో కుప్పగూలిపోయిన ప్రభుత్వ వ్యవస్థ రానున్న రోజుల్లో ప్రజలకు ఏవిధంగా జవాబుదారీతనం వహిస్తుందో తెలీటంలేదు. పైగా షూట్ అట్ సైట్ ఆర్డర్లు జారీ చేస్తారట. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల నోట ఈ మాట. మనది ప్రజాస్వామ్యమేనా..
- రాష్ట్రం మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో ఫోన్లో చర్చించారు. కరోనా వైరస్ ముప్పు తీవ్రంగా ఉన్న సమయంలో విద్యార్థులు, యువత ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం శ్రేయస్కరం కాదని కేటీఆర్ దష్టికి తీసుకెళ్లారు. వారికి ఇప్పటికిప్పుడు రవాణా సదుపాయాలు కూడా లేవన్నారు.
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కూడా ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌తో చర్చించారు.
- ఈ సంప్రదింపులు ఫలించాయి. హైదరాబాద్‌లో హాస్టళ్లు, మెస్‌లు మూసివేయొద్దని తెలంగాణ మంత్రి కేటీఆర్ విçస్పష్ట ప్రకటన చేశారు.
- ఈ మేరకు హాస్టళ్లు, మెస్‌ల యజమానులతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ మేయర్, నగర పోలీసు కమిషనర్‌ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
- హాస్టళ్లు, మెస్‌లు మూసివేయడంలేదని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు, యువతకు ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే 1902కు కాల్ చేస్తే వెంటనే సమస్య పరిష్కరిస్తామన్నారు.
- హాస్టళ్లలో ఉన్న వారినెవరినీ బయటకు పంపించకూడదని, స్వస్థాలకు వెళ్లడానికి ఇప్పటివరకు పోలీసులు జారీ చేసిన అనుమతి పత్రాలు చెల్లవని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.
- చెక్‌పోస్టు వద్ద భారీగా జనం
- ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని గరికపాడు చెక్‌పోస్టు వద్ద బుధవారం రాత్రి పరిస్ధితిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పరిశీలించారు.
తెలంగాణ నుంచి వస్తున్న వారిని ‘జగ్గయ్యపేట’ వద్ద నిలిపివేయటంతో బారులు తీరిన వాహనాలు
ఈరోజే ఎందుకిలా?
కాగా, ఎస్ఆర్నగర్ వద్ద విద్యార్థులు తమకు అనుమతి పత్రాలు ఇవ్వాలంటూ గుంపులు గుంపులుగా రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి పత్రాల కోసం హాస్టల్ ఓనర్ నుంచి లెటర్ తీసుకురావాలని, వారిని తిరిగి హాస్టళ్లకు పంపించారు.

విశ్వవ్యాప్తి చెంది పౌరుల ప్రాణాలు, ప్రభుత్వాలను ఆర్ధికంగా దెబ్బ తీస్తున్న కరోనాను కట్టడి చేయులేమా అంటే తల పండిన వైద్య శిఖామణుల దగ్గర నుండి అక్షర జ్ఞానం లేని వారు చెప్పేది ఒకటే. ఒకరినుండి ఇంకొరికి సంక్రమించకుండా వుంటాలంటే మనం బయటి వెళ్లకుండా ఇంట్లోనే బంధీ అవడం, ఎప్పటికప్పుడు శుబ్రపరుచుకోవడం చెయ్యాలని. ఈ సూచనలు ఇల్లు, ఉద్యోగం వున్న వారికి సరిపోతుంది కానీ ఏ ఇల్లు, ఏ దిక్కూ దిశా లేని రెక్కాడితే కాని డొక్కాడని పేద జనానికి ఈ సలహా మాత్రమే చాలదు అందుకని ప్రభుత్వాలు వస్తు, ఆర్ధిక సహాయం అందిస్తున్నాయి, ఇది ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనం. ఇక ఎన్నో పనులు ఆగిపోయి సంస్ధలే మూసివేయాల్సిన పరిస్థితి. రాబోయేకాలంలో లఘు పరిశ్రమలూ, సంస్ధలూ ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడి నిరుద్యోగ సంఖ్య పెరుగవచ్చు.
ఈ మహమ్మారితో పెద్దల పరిస్థితి ఇలా వుంటే పిల్లల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వారికి ఏమి జరుగుతుందో తెలియదు. తమ పాఠశాలలు ఎందుకు మూతపడ్డాయో తెలియదు. తమ వారు ఎందుకు ఆస్పత్రి పాలవుతున్నారో అర్థం కాదు. చదువే కాదు, ఇంటి పక్కనే ఉన్న ఆటస్థలాల్లో కూడా ఆడుకోలేని పరిస్థితి. ఎనిమిది, పదేళ్ళ తెలసీ తెలియని పిల్లలకు ఏమీ చెప్పకుండా తోటివారితో కలవవద్దని కట్టడి చేస్తే వారు మానసికంగా దెబ్బ తినే ప్రమాదం వుంటుంది. పిల్లలు సున్నితమైన మనసు కలిగి వుంటారు కావున వారికి ఒకటికి రెండు సార్లు విడమర్చి చెప్పాలి. వారికి వారే స్వీయ నియంత్రణ పాటించేలా చేయాలి. అలాగే బయట ఆడటానికి వెళ్లే అవకాశం లేనందున, కేవలం వారిని టీవీలకు పరిమితం చేయకుండా, వారి మేధస్సును పెంచే చదరంగం లాంటి ఆటలు ఆడించటం, బొమ్మలు వేయడంలో అభిరుచి వుంటే ఆ మేరకు బొమ్మలు వేయించడం, కథలు, కవిత్వం రాసేలా ప్రోత్సహించడం ద్వారా వారిని సహితం మానవ సమాజం కరోనాపై చేస్తున్న పోరాటంలో భాగస్వాములను చేయవచ్చు. ఇదంతా తల్లిదండ్రులు వున్న పిల్లల పరిస్థితి. ఎవరూ లేని వారి కష్టాలు మరీ ఘోరం.
అనాధలుగా శిశుగృహాల్లో, అనాధ శరణాలయాల్లో, చట్టంతో విభేదించి బాలల, బాలికల గృహాల్లో మగ్గుతున్న పిల్లల క్షోభ కడు దయనీయం. జైళ్లలో వుండే ఖైదీలను పెరోల్ పైన వదిలేస్తే తమవారి వద్దకి చేరే అవకాశమైనా వుంది. కానీ ఈ అనాధ చిన్నారులు ఎక్కడికని పోతారు? ఏది ఏమైనా వారు ఆ గృహాల్లోనే వుండాలి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కొందరు దాతలు అనాధాశ్రమాలను నడిపిస్తున్న వారి వద్ద వుండే పిల్లలకు ఏరోజుకు ఆరోజు ఆహారాన్ని అందిస్తూ ఉండేవారు. వారే కాదు, అప్పుడప్పడు వచ్చి అనాధల మధ్య పుట్టిన రోజులు, పుణ్య దినాలు జరుపుకునే వారు సైతం రాలేని సందర్భం.
అన్నం పెట్టే దాతలు లేక పిల్లలు పస్తులుండే పరిస్థితులు రాకుండా వుండాలంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటి ద్వారా అన్ని అనాధ ఆశ్రమాలను, శిశు గృహాలను వెంటనే తనిఖీ చేయించాలి. కావాల్సిన ఆహారం, వసతి కల్పించాలి. అలాగే ఒక్కో గదిలో పదుల సంఖ్యలో ఉండకుండా విడి, విడిగా వుండే ఏర్పాట్లు చేయాలి. యునిసెఫ్ మార్గ దర్శకాలను పాటిస్తూ చర్యలు చేపట్టాలి. ఎవ్వరికీ పట్టని పిల్లల గురించి ప్రభుత్వాలు పట్టించుకోవాలి, యుద్ధ ప్రాతిపదికన వారి స్థితిగతులను సమీక్షించాలి. ఆ పిల్లలని వెంటనే ఆదుకోవాలి. ఈ మహమ్మారికి ముందు జాగ్రత్తనే మందు కాబట్టి, అనాధ పిల్లల పట్ల కూడా ఆ ముందు జాగ్రత్త అనే మందును తప్పనిసరిగా ప్రయోగించాలి.




వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
11 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
6 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
9 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
11 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
14 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
15 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
16 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
18 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
18 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
19 hours ago
ఇంకా