హాస్టల్స్ మూస్తే సీరియస్ యాక్షన్.. డీజీపీ వార్నింగ్
26-03-202026-03-2020 07:29:07 IST
2020-03-26T01:59:07.983Z26-03-2020 2020-03-26T01:56:05.538Z - - 20-01-2021

ఒకవైపు కరోనా నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలుకి అహర్నిశలు పాటుపడుతున్న పోలీసులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. తెలంగాణలోని వివిధ వర్కింగ్ విమెన్స్, వర్కింగ్ మెన్స్ హాస్టళ్ళ మూసివేత, విద్యార్థుల అవస్థలపై పోలీసులు తలలు పట్టుకున్నారు. తమను స్వంతూళ్ళకు వెళ్ళేందుకు పర్మిషన్ ఇవ్వాలని విద్యార్ధులు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగారు. వారికి ఎన్వోసీ సర్టిఫికెట్లు జారీ చేశారు. అయితే లాక్ డౌన్లో ఈ ఎన్వోసీలు ఎందుకూ పనికిరావని తేలింది. హైదరాబాద్ లో వివిధ హాస్టళ్ళ మూసివేత అంశం తెలంగాణా డిజిపి మహేందర్ రెడ్డి దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన సీరియస్ అయ్యారు. బలవంతంగా హైదరాబాద్ లో హాస్టళ్ళను మూసివేసి బయటికి పంపించి వేస్తే హాస్టళ్ళ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. లాక్ డౌన్ అమలులో ఉన్నందున ఎవరు బయటకు రావొద్దు..హాస్టల్స్, పీజీలో ఉంటున్న విద్యార్థులకి ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలి..హాస్టల్ ఖాళీ చేయాలని విద్యార్థులు పై ఒత్తడి తీసుకురావద్దన్నారు తెలంగాణ డీజీపీ. నిబంధనలు ఉల్లంఘించే హాస్టల్, పీజీ యాజమాన్యాలపై తీవ్రమైన చర్యలు తీసుకుంటాం.. హాస్టల్ మేనేజ్ మెంట్ లతో ACP, DSP, SHOలు GHMC అధికారులు సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ విషయం మీద అనేక మంది మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. తమ స్వంత ప్రాంతాలకు వెళ్ళడానికి అనుమతులు ఇప్పించాలని కోరారు. అయితే ఈ విషయం మీద మీడియాలో కూడా వరుస కథనాలు వచ్చాయి. లాక్ డౌన్ ముఖ్య ఉద్దేశమే జనాలు కలవకూడదు అని కానీ ఇప్పుడు హాస్టల్స్ మూసివేయడంతో వారంతా పోలీసు స్టేషన్ ల ముందు బారులు తీశారని మీడియాలో కధనాలు ప్రసారం అయ్యాయి. ఇది ఎవరికీ శ్రేయస్కరం కాదన్నారు. సామాజిక దూరం ఉద్దేశానికి ఇది పూర్తి విరుద్ధం అని కొందరు సామాజికవేత్తలు కూడా అభ్యంతరం తెలిపారు, దీంతో హాస్టళ్ళ వ్యవహారంపై వెంటనే పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు డీజీపీ. ఎవరైనా సొంత గ్రామాలకు వెళ్లేందుకు కోరితే అవసరమైన పాసులు జారీ చేయాలని పేర్కొన్నారు. జిహెచ్ఎంసి సిబ్బందితో కలిసి హాస్టల్ యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించాలని అధికారులకు డిజిపి ఆదేశించారు. లాక్ డౌన్ ఉంది కాబట్టి ఎటువంటి ఎన్వోసిలు జారీ చేయరని ఆయన పేర్కొన్నారు.

జనవరి 27న శశికళ విడుదల.. పార్టీలోకి రానివ్వమన్న పళనిస్వామి
27 minutes ago

కేటీఆర్ పరిస్థితి.. రాహుల్ గాంధీలా అవుతుందా
3 hours ago

జగన్ సర్కార్ మరో డెసిషన్.. ఎందుకు తీసుకుంటారో ఏమో
an hour ago

సవాళ్లు, ప్రమాణాలు.. ఏందీ రచ్చ.. జనాల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా
4 hours ago

నానీ పని అయిపాయే.. ఇక వంశీ వచ్చే
4 hours ago

ఎదురు దెబ్బలు.. మొట్టికాయలు.. ఇక మీరు మారరా.. జనాలు మారాల్సిందేనా?
5 hours ago

షాతో జగన్ భేటీ.. ఈసారి రాష్ట్రానికి ఏం తెస్తారో?!
5 hours ago

ఈ ఎమ్మెల్యేకి కొత్త తలనొప్పులు తెస్తున్న నోటితీట
6 hours ago

మితిమీరిన బూతులు.. కొడాలి నానీ రాజకీయాలకు అవసరమా?
6 hours ago

సంగారెడ్డిలో తోప్ సింగ్ కావాలని ఈ మాజీ ఎమ్మెల్యే ఆరాటం.. గ్రౌండ్ వర్క్ స్టార్ట్
6 hours ago
ఇంకా