హాట్ స్పాట్లపై స్పెషల్ అటెన్షన్.. కార్డన్ సెర్చ్
07-04-202007-04-2020 10:29:24 IST
Updated On 07-04-2020 11:23:37 ISTUpdated On 07-04-20202020-04-07T04:59:24.555Z07-04-2020 2020-04-07T04:58:59.612Z - 2020-04-07T05:53:37.043Z - 07-04-2020

తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోవడంతపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఏప్రిల్ 7 నాటికి తెలంగాణ కేసులు ఉండవని సీఎం కేసీయార్ ఎంతో ధీమాగా చెప్పారు. అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. సరిగ్గా ఇవాళ్టికి సీఎం కేసీయార్ డెడ్ లైన్. కానీ వారం రోజుల్లో పరిస్థితులు తారుమారయ్యాయి. తెలంగాణాలో వరుస కరోనా కేసులు నమోదవుతున్నాయి. మొదట విదేశాల నుండి వచ్చిన వారితో పెద్ద కాంటాక్ట్ కేసులు నమోదు కాకపోయినా మర్కజ్ యాత్రికులతో కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కాంటాక్ట్ కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యం లో సర్కార్ మరో అడుగు ముందుకు వేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన వారి వివరాలు ఇంకా తేలాల్చి వుంది. వారంతా బయటకు వస్తేనే వాస్తవ పరిస్థితి మారుతుంది. వైద్య బృందాలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. పీపీఏ కిట్లకు ఎలాంటి కొరత లేదని, ఎమర్జెన్సీ బెడ్స్ అందుబాటులో వున్నాయని సీఎం కేసీయార్ స్వయంగా ప్రకటించారు. కరోనా బాధితుల ఇంటి చుట్టుపక్కల కిలోమీటర్ వరకు వైద్య బృందం ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేయనున్నారు. ఈ సర్వే లో దగ్గు,జలుబు, ఫీవర్ వంటి లక్షాలుంటే వారి బ్లడ్ షాంపిల్స్ సేకరిస్తారు. అంతే కాకుండా పోలీసులులతో కూడా కార్టన్ సర్చ్ జరిపించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. దీని ద్వారా ఢిల్లీ వెళ్లినవారి ఆచూకీ మరింతగా బయటకు రావచ్చు. అంతే కాకుండా కరోనా కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాలను హాట్ స్పాట్ లు గుర్తిస్తున్నారు. హాట్ స్పాట్ పరిధిలో కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు కేసీఆర్ ఆదేశాల ప్రకారం చీఫ్ సెక్రటరీ పోలీసు అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా లాక్డౌన్ ప్రకటించడంతో వైద్యులు, సిబ్బందికి రక్షణ పరికరాలు. మందులు, ప్రజలకు ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులు, క్వారంటైన్లో ఉన్న వారికి కల్పిస్తున్న సౌకర్యాలు తదితరాలపై నివేదిక అందజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 9వ తేదీ గురువారం నాటికి మధ్యంతర నివేదిక ఇవ్వాలని, పూర్తి నివేదికను ఈ నెల 15లోగా అందజేయాలని ఆదేశించింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.విదేశాల నుంచి వచ్చే వారికి క్వారంటైన్స్లో సౌకర్యాలు కల్పించాలని, వైద్యం అందిస్తున్న సిబ్బందికి వైద్య రక్షణ పరికరాలు అందజేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. 21 రోజుల లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వీధి పిల్లలు, అనాథలు, వసతి గృహాల్లోని వారు, తెల్లరేషన్ కార్డు లేని వారు, వలస కార్మికులకు వారి వద్దకే నిత్యావసర వస్తువులు అందజేసేలా చర్యలు తీసుకోవాలని న్యాయవాది కోరారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను కఠినంగా అమలు చేస్తోందని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ చెప్పారు. తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతుండటంతో దానికి తగ్గట్టుగా ఆస్పత్రులను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా గాంధీతోపాటు మరో 11 ఆస్ప్రత్రులను కరోనా చికిత్సల కోసం విస్తరించాలని నిర్ణయించింది.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
13 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
14 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
13 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
17 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
18 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
17 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
19 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
20 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
15 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
21 hours ago
ఇంకా