హాట్‌స్పాట్‌గా గుర్తిస్తే ఇంటినుంచి బయటకు రాలేరు.. అష్టదిగ్బంధనమే!
11-04-202011-04-2020 14:32:15 IST
Updated On 11-04-2020 14:40:12 ISTUpdated On 11-04-20202020-04-11T09:02:15.383Z11-04-2020 2020-04-11T09:02:13.233Z - 2020-04-11T09:10:12.419Z - 11-04-2020

దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్లో కొత్త దశ మొదలైంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు ప్రజలను పూర్తిగా ఇంటికే పరిమితం చేస్తూ హాట్‌స్పాట్ ప్రాంతాలను మార్క్ చేస్తోంది. ఒకసారి ఒక నిర్దిష్ట ప్రాంతం హాట్ స్పాట్‌గా గుర్తింపు పొందిందంటే ఇక 14 రోజులపాటు ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకుండా అష్ట దిగ్బంధనంలో ఇరుక్కుపోవలసిందే. తెలంగామలో వివిధ జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 130 హాట్ స్పాట్ ప్రాంతాలను ప్రకటించింది. దీంతో జంటనగరాలతో సహా పలు జిల్లాల్లో లక్షలాది ప్రజలు పూర్తిగా గృహనిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రభుత్వం వారిని పూర్తిస్థాయి క్వారంటైన్‌కు పరిమితం చేసింది. ఈ హాట్ స్పాట్ ప్రాంతాల్లో రోడ్లు బందు పెట్టి ద్విచక్రవాహనాలు కూడా తిరగకుండా బ్యారికేడ్లు పెట్టడంతో చీటికి మాటికి రోడ్డుమీదికి బైకులేసుకుని వస్తున్న వారితోపాటు సగటు మనుషులకు కూడా ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. హాట్ స్పాట్ అంటే ఏమిటి? అది అలా అమలవుతుంది? కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఒక ప్రాంతాన్ని ప్రభుత్వం కరోనా ఉత్పత్తి కేంద్రంగా గుర్తించి హాట్ స్పాట్‌ను అమలు చేస్తుంది. దీంతో ఒక్కో హాట్ స్పాట్లో ఉండే వందలాది, వేలాది ప్రజలు నిర్దిష్ట తేదీనుంచి రెండువారాల పాటు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావల్సి ఉంటుంది. కేసుల తీవ్రత బట్టి జిల్లా అధికారులు హాట్ స్పాట్లను మ్యాపింగ్ చేస్తారు. దాని పరిధిని కిలోమీటర్ నుంచి మూడు కిలోమీటర్ల వరకు నిర్ధారించారు. దీని అమలు కోసం వైద్య, పోలీసు బృందాలతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటయ్యాయి. ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు వైరస్ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో 30 ఇళ్లను కవర్ చేస్తారు. హాట్స్పాట్లలో కొన్ని కేసులున్న సాధారణ ప్రాంతాల్లో 50 ఇళ్లను పర్యవేక్షిస్తారు. పీహెచ్సీ వైద్యులు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక్కో హాట్‌స్పాట్ ఏరియాలో తమకు కేటాయించిన ఇళ్లకు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తారు. అక్కడి ప్రజల్లో ఎవరికైనా అనుమానిత లక్షణాలుంటే వారిని గుర్తించి అవసరాన్ని బట్టి ఆస్పత్రులకు పంపిస్తారు. జ్వరం లేదా శ్వాసకోశ లక్షణాలు గుర్తించినప్పుడు ఎవరికివారు ఇళ్లలోనే వేర్వేరు గదుల్లో ఉండాలని సూచిస్తారు. హాట్స్పాట్లలో నిరంతరం పర్యవేక్షించేందుకు అవసరమైన వాలంటీర్లు, సహాయకులను జిల్లా అధికారులు ఏర్పాటు చేస్తారు. మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజూ సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతోపాటు బ్లీచింగ్ పౌడర్‌తో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో అధికారులను సంప్రదించడానికి టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 130 హాట్ స్పాట్ ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజలు నిర్బంధంగా హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. శుక్రవారం హాట్ స్పాట్లుగా ప్రభుత్వం మ్యాప్ చేసిన ఆయా ప్రాంతాల్లో నిర్ణీత ప్రదేశం మేరకు పూర్తిగా అష్టదిగ్బంధం చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరూ ఎటూ వెళ్లకుండా చర్యలు చేపట్టింది. అక్కడున్న ప్రజలకు అవసరమైన పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను కూడా ప్రభుత్వ యంత్రాంగమే సమకూరుస్తోంది. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో కొన్నిచోట్ల డ్రోన్లను వినియోగిస్తూ పోలీసులు పహారా కాస్తున్నారు. వైద్య బృందాలు ఇళ్లకు వెళ్లి జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలున్న వారిని గుర్తించి ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. వైరస్ కేసులు తగ్గకపోవడంతో కఠినినిర్ణయం! రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 27 జిల్లాలకు విస్తరించగా అందులో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, గద్వాల, కరీంనగర్, నిర్మల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా వైరస్ వ్యాప్తి తక్కువగానే నమోదైనప్పటికీ ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు, వారి కుటుంబీకుల ద్వారా అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేసులు ఎక్కడెక్కడ అత్యధికంగా పెరిగాయో ఆయా ప్రాంతాలను ప్రభుత్వం హాట్స్పాట్లుగా గుర్తించింది. కనీసం రెండు, మూడు కేసులు మొదలుకొని గరిష్టంగా ఐదు కేసులు నమోదైన ప్రాంతాలను ఒక్కో హాట్‌స్పాట్‌గా పరిగణించింది. అలా రాష్ట్రంలో 130 హాట్స్పాట్లను గుర్తించినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. లాక్డౌన్ అమలులో కనీసం ఏదైనా అవసరానికి బయటకు వెళ్లడానికి వీలుండగా హాట్‌స్పాట్ ప్రాంత ప్రజలు ఎటూ వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో మొత్తం 2.88 లక్షల ఇళ్లను గుర్తించారు. ఒక్కో ఇంట్లో సరాసరి ఐదుగురు సభ్యులుంటారని అంచనా వేశారు. ఆ ప్రకారం 14.40 లక్షల మంది అష్టదిగ్బంధంలో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో 3,116 వైద్య బృందాలు ఇంటింటి సర్వే చేస్తున్నాయి. ఒక్కో వైద్య బృందంలో ఇద్దరు సభ్యులున్నారు. పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. జిల్లాలవారీగా హాట్‌స్పాట్ ప్రాంతాలు... సంగారెడ్డి జిల్లాలో 7 ప్రాంతాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 17 ప్రాంతాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 ప్రాంతాలు నిజామాబాద్ జిల్లాలో 19 ప్రాంతాలు కామారెడ్డి జిల్లాలో 3 ప్రాంతాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 ప్రాంతాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10 ప్రాంతాలు సూర్యాపేట జిల్లాలో 4 ప్రాంతాలు మహబూబ్ నగర్ జిల్లాలో 5 ప్రాంతాలు ఇంకా కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాలను కూడా హాట్ స్పాట్లుగా గుర్తించారు. కొన్ని జిల్లా కేంద్రాల్లో 30 నుంచి 40 వార్డులను కూడా హాట్ స్పాట్లుగా గుర్తించి నిర్బంధం విధించారుట

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
13 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
9 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
11 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
14 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
16 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
18 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
19 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
20 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
21 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
a day ago
ఇంకా