newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హాజీపూర్ శ్రీనివాసరెడ్డికి ఉరి శిక్ష .. కోర్టు తీర్పు

06-02-202006-02-2020 18:56:59 IST
Updated On 06-02-2020 19:00:57 ISTUpdated On 06-02-20202020-02-06T13:26:59.571Z06-02-2020 2020-02-06T13:26:57.349Z - 2020-02-06T13:30:57.856Z - 06-02-2020

హాజీపూర్ శ్రీనివాసరెడ్డికి ఉరి శిక్ష .. కోర్టు తీర్పు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హాజీపూర్ వరుస హత్యల కేసులో తుది తీర్పు వెల్లడైంది. దోషి శ్రీనివాసరెడ్డికి ఉరి శిక్ష విధించారు న్యాయమూర్తి.  నల్గొండ కోర్టులో శ్రీనివాస్ రెడ్డిని హాజరుపర్చారు పోలీసులు. జడ్జి శ్రీనివాసరెడ్డిని దోషిగా తేల్చారు. ఈ కేసులో న్యాయమూర్తి ఎలాంటి తీర్పునిస్తారోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఉరి శిక్ష విధించారు. అంతకుముందు శ్రీనివాసరెడ్డిపై నేరం రుజువైందన్నారు జడ్జి.

కోర్టుకు చెప్పుకునేది ఏమైనా వుందా అని అడిగారు జడ్జి. మరోవైపు శ్రీనివాసరెడ్డి నోరు విప్పాడు. పోలీసులు తనను కొట్టి హింసించారని, తన ఇంటిని తగులబెట్టి, ఆస్తులు లాక్కున్నారని ఆరోపించాడు దోషి శ్రీనివాసరెడ్డి. తన తల్లీతండ్రి ఎక్కడవున్నారో తెలియదన్నాడు.  ఇప్పటికే నిర్భయ, సమత కేసు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు మైనర్ బాలికలను అత్యంత అమానుషంగా చెరబట్టి.. హత్య చేసిన శ్రీనివాసరెడ్డికి ఎటువంటి శిక్ష విధిస్తారో అన్న ఆసక్తి నెలకొంది.

యదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌ లో సంచలనం సృష్టించిన ముగ్గురు మైనర్ బాలికలపై దారుణ అత్యాచారం, హత్యలో కీలక నిందితుడగా శ్రీనివాసరెడ్డి పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈ కేసులో 2020 జనవరి 17న విచారణ ముగియగా.. అదే నెల 27న తీర్పు చెప్తామని న్యాయస్థానం ప్రకటించింది. అయితే తీర్పు కాపీ సిద్ధం కాకపోవడంతో గురువారం ఫిబ్రవరి ఆరవ తేదీకి తీర్పును వాయిదా వేశారు న్యాయమూర్తి. 

హాజీపూర్‌ కు చెందిన మర్రి శ్రీనివాసరెడ్డి.. ముగ్గురు బాలికలను పాడుబడిన బావిలో పడేసి.. తీవ్రగాయాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత వారి మీద అత్యాచారం జరిపి.. హత్య చేసి పాతిపెట్టాడు. ఈ మూడు ఘటనలపై వేర్వేరుగా కేసులు నమోదు చేసిన పోలీసులు.. 90 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి.. జూలై 31న నల్లగొండలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 2019 అక్టోబర్ 14 నుంచి న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. సుమారు రెండున్నర నెలల పాటు మూడు కేసుల్లో సాక్షుల విచారణ సాగింది. డిసెంబర్ 19 నుంచి 26 వరకు ప్రాసిక్యూషన్ తన వాదనను వినిపించగా.. డిసెంబర్ 26 నుంచి సిఆర్పీసీ 313 సెక్షన్ కింద సాక్షుల వాంగ్మూలాలపై నిందితుడు శ్రీనివాసరెడ్డి వాదనను న్యాయస్థానం వింది. 

మర్రి శ్రీనివాస రెడ్డి అన్ని విధాలుగా ఉరిశిక్షకు అర్హుడని.. జాలి, దయ చూపాల్సిన అవసరం లేదని ప్రాసిక్యూషన్ పదేపదే విజ్ఞప్తి చేసింది. బాధిత కుటుంబ సభ్యులతో పాటు.. హాజీపూర్ వాసులు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు.. నిందితుడు మర్రి శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష విధించాలని ముక్తకంఠంతో నినదించాయి. వారి కోరిక ఫలించింది. చివరాఖరికి శ్రీనివాసరెడ్డికి ఉరి శిక్ష విధించింది ప్రత్యేక న్యాయస్థానం. 

Image may contain: 3 people

కోర్టు తీర్పుపై హాజీపూర్ గ్రామస్తులు, బాధితుల తల్లిదండ్రులు, బంధువులు హర్షం ప్రకటించారు. కోర్టు తీర్పు ఎలాంటి ఆలస్యం లేకుండా అమలుచేయాలని, అప్పుడే బాధితుల ఆత్మకు శాంతి కలుగుతుందని వారు అంటున్నారు. 

 

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   an hour ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   13 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle