newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హాజీపూర్ నిందితుడికి మరణశిక్ష వేస్తారా?

20-01-202020-01-2020 08:19:08 IST
Updated On 21-01-2020 13:56:31 ISTUpdated On 21-01-20202020-01-20T02:49:08.430Z20-01-2020 2020-01-20T02:49:05.300Z - 2020-01-21T08:26:31.360Z - 21-01-2020

హాజీపూర్ నిందితుడికి మరణశిక్ష వేస్తారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సంచలనం కలిగించిన హాజీపూర్ హత్యల కేసు కీలకదశకు చేరుకుంది. ఈనెల 27న హాజీపూర్ హంతకుడికి శిక్ష ఖరారు చేయనుంది కోర్టు. ఇప్పటికే వాదనలు ముగిశాయి. ఈకేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.

ఈ నెల 27న పోక్సోకోర్టు తీర్పును వెలువరించనుంది. ఈ మేరకు న్యాయమూర్తి స్పష్టం  చేశారు. నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డే బాలికలను హత్య చేశాడని చెప్పడానికి అన్ని ఆధారాలు ఉన్నాయంటూ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టుకు వివరించడంతో కీలకమయిన తీర్పుకు సమయం ఆసన్నమయింది. 

నిందితుడు శ్రీనివాసరెడ్డికి గతంలో కూడా నేర చరిత్ర ఉందని ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా పరిగణించి నిందితుడికి మరణ శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిపై ముగ్గురు బాలికలపై హత్యాచారం కేసులు నమోదు కాగా, ఈ నెల 8 నాటికి ఒక కేసుకు సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. నిందితుడు మాత్రం తనకేం తెలియదంటున్నాడు. 

అయితే, మరో రెండు హత్యల కేసుల్లో వాదనలు వినకుండానే తీర్పును వెల్లడిస్తామని న్యాయమూర్తి ప్రకటించడంతో ఉత్కంఠ రేగుతోంది. మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు ఉరిశిక్ష విధించాలని కోరుతున్నాయి. నిర్బయ కేసులా కాకుండా సాధ్యమయినంత త్వరగా శిక్ష విధించి అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉరిశిక్ష అమలులో జాప్యం మంచిది కాదని నిర్భయ కేసు ఉదంతాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. 

చదవండి : ‘హాజీపూర్’ నిందితుడు శ్రీనివాసరెడ్డికి త్వరలో శిక్ష

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   11 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   7 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   9 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   12 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   14 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   16 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   18 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   19 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle