హాజీపూర్ కేసులో తుది తీర్పు ఫిబ్రవరికి 6కి వాయిదా!
27-01-202027-01-2020 13:08:06 IST
Updated On 27-01-2020 15:09:39 ISTUpdated On 27-01-20202020-01-27T07:38:06.977Z27-01-2020 2020-01-27T07:37:33.553Z - 2020-01-27T09:39:39.833Z - 27-01-2020

తెలంగాణలో సంచలనం కలిగించిన హాజీపూర్ అత్యాచారం, హత్య కేసు తుది తీర్పును 6వ తేదీకి వాయిదా వేసింది ఫాస్ట్ ట్రాక్ కోర్టు. హాజీపూర్ లో వరుస హత్యలు ఆవేదన కలిగించాయి. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ముగ్గురు బాలికలను అత్యంత క్రూరంగా, పాశవికంగా అత్యాచారం చేసి బావిలో మృతదేహాలను పూడ్చి పెట్టాడు. ఈ ఘటన వెలుగులోకి వచ్చాక బాధితులు, గ్రామస్తులు నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు. కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేసు విచారణను త్వరితగతిన పూర్తిచేసేందుకు గాను ప్రత్యేక కోర్టుని ఏర్పాటుచేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు మూడు నెలల పాటు సుదీర్ఘ విచారణను చేపట్టింది. దాదాపు 300మంది సాక్షులను విచారించి.. 101 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. ఫోరెన్సిక్ నివేదిక కీలకం కానున్న ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్షను విధించేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బలమైన సాక్ష్యాలను సమర్పించారని తెలిసింది. అటు గ్రామస్థులు ఇటు బాధితుల కుటుంబ సభ్యులు కూడా ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న నలగొండ ఫాస్ట్ కోర్టు ఇవాళ తుది తీర్పును వెలువరించనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీంతో పాటు సమత ఆత్యాచారం, హత్య కేసులో తుదితీర్పు ఈ నెల 30వ తేదీకి వాయిదా పడింది. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపట్టార్ గ్రామంలో జరిగిన సమత అత్యాచారం, హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నేడు తుదితీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా సెలవులో ఉండటంతో వాయిదా వేసినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈ రెండు కేసుల్లో నిందితులను ఉరి తీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సమత కేసులో 30వ తేదీన తీర్పు రానుండడంతో బాధితురాలి బంధువులు ఆశగా ఎదురుచూస్తున్నారు. హాజీపూర్ కేసులో తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. చదవండి : హాజీపూర్ నిందితుడికి మరణశిక్ష వేస్తారా?

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
12 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
8 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
10 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
13 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
15 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
17 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
18 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
19 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
20 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
21 hours ago
ఇంకా