newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

హరీష్ రావు ఇంటికి జగ్గారెడ్డి.. సామరస్యమా? రాజకీయమా?

22-03-202022-03-2020 13:17:48 IST
2020-03-22T07:47:48.720Z22-03-2020 2020-03-22T07:47:11.370Z - - 27-05-2020

హరీష్ రావు ఇంటికి జగ్గారెడ్డి.. సామరస్యమా? రాజకీయమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. మంత్రి హరీష్ రావు మధ్య మాటాల యుద్ధం ఎలా ఉంటుందో చాలాకాలంగా చూస్తూనే ఉన్నాం. హరీష్ రావు అప్పుడప్పుడూ మాత్రమే ఘాటు సమాధానాలు చెప్పినా జగ్గారెడ్డి మాత్రం ఎప్పటికప్పుడు తీవ్ర విమర్శలే చేస్తుంటారు. అధికార-ప్రతిపక్ష పార్టీల నేతలన్నాక సహజంగా విమర్శలు చేయనుండగా జగ్గారెడ్డి ప్రత్యేకంగా హరీష్ రావును టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంటారు.

జగ్గారెడ్డి ముందు టీఆర్ఎస్ పార్టీలోనే ఉండగా ఏవో రాజకీయ కారణాల వలన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుండి ఈ యుద్ధం మొదలైంది. ఇద్దరూ ఒకేజిల్లాకు చెందిన నేతలు కావడంతో రెండు వర్గాల మధ్య యుద్ధంగా కనిపించేది. అలాంటి ఈ ఇద్దరూ కలిస్తే అది ఖచ్చితంగా సెన్సేషనల్ వార్తే అవుతుంది. అందునా జగ్గారెడ్డే హరీష్ రావు ఇంటికి వెళ్లి మరీ కలిస్తే అది ఇంకా సంచలనమే అవుతుంది.

కానీ అదే నిజమంటున్నారు సంగారెడ్డి జిల్లా రాజకీయ వర్గాలు. తాజాగా జగ్గారెడ్డి హరీష్ రావు ఇంటికెళ్లి కలిసి గంటపాటు మాట్లాడారని చెప్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సామజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తున్నాయి. జగ్గారెడ్డి టీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత ఏకంగా 14 ఏళ్ల తర్వాత గత ఏడాది ఓ సన్మాన కార్యక్రమంలో హరీష్ తో కలిశారు.

ఆ తర్వాత జగ్గారెడ్డి విమర్శలలో ఘాటు తగ్గింది. కారణాలేమైనా ఒకదశలో హరీష్ రావును పొగుడుతూ ఆకాశాన్ని ఎత్తేశారు. దీంతో రాజకీయ వర్గాలలో ఆశ్చర్యంతో కూడిన అనుమానాలు మొదలయ్యాయి. ఇక కాంగ్రెస్ పార్టీలో అయితే కొందరు జగ్గారెడ్డిపై ప్రత్యేక విమర్శలకు దిగారు. అలాంటిది ఇప్పుడు తాజాగా హరీష్ ఇంటికెళ్లి జగ్గారెడ్డి కలవడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని ఆసక్తిగా మారింది.

ఎంపీ రేవంత్ రెడ్డి మినిస్టర్ కేటీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి.. జైలు, బెయిలు ఇదంతా తెలిసిందే. ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో మరోసారి గ్రూపు తగాదాల తాలూకు లుకలుకలు బయటపడ్డాయి. రేవంత్ ను జైలుకి తరలించిన తొలిరోజే కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ నుండి సస్పెండ్ అయి కేటీఆర్ ఫామ్ హౌస్ ముట్టడికి బయల్దేరారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా గాంధీ భవన్ నుండి ఫామ్ హౌస్ ముట్టడికి బయల్దేరారు.

కానీ ఏమైందో తెలియదు ఆ రోజు వెనక్కు తగ్గారు. మరుసటి రోజు అసలు రేవంత్ చేసిందే తప్పు అన్నారు. అక్కడ నుండి పూర్తిగా సీన్ మారిపోయిందటున్నారు. రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి తీవ్ర విమర్శలే చేస్తున్నారు. రేవంత్ చర్లపల్లి జైల్లో ఉండగా ఉత్తమ్ అండగా లేరని రేవంత్ విమర్శలు చేశారు. దీనికి జగ్గారెడ్డి స్పందించి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసి రేవంత్ పై తీవ్ర విమర్శలు చేశారు.

ఇక రేవంత్ జైల్లో ఉండగా ఆయన అభిమానుల హడావుడిపై కూడా జగ్గారెడ్డి వివాదాస్పదంగానే మాట్లాడారు. అసలు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఒక్కడే తీస్మార్ ఖాన్ ఆ అంటూ అభిమానులపై రెచ్చిపోయారు. జైలు నుండి వచ్చాక కూడా రేవంత్ పై జగ్గారెడ్డి అదే విమర్శలను కంటిన్యూ చేశారు. అసలు ఎంపీకి రాష్ట్ర రాజకీయాలతో ఏంపని అయన ఢిల్లీలో కొట్లాడాలన్నారు.

అయితే, ఇప్పుడు జగ్గారెడ్డి వెళ్లి హరీష్ రావును కలవడంపై కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఈ కలయిక సామరస్యం కోసమా? లేక రాజకీయం కోసమా అని చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డిపై విమర్శల వెనుక టీఆర్ఎస్ హస్తముందని కొందరు వాదిస్తుంటే కాదు కాదు ఆయన సొంత నియోజకవర్గం అభివృద్ధి కోసమే జగ్గారెడ్డి కలిసి ఉంటారని మరికొందరు వెనకేసుకొస్తున్నారు. మరి ఏది నిజమో ఎవరికి ఎరుక!

 

 

 

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   2 hours ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   3 hours ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   3 hours ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   3 hours ago


లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

   4 hours ago


కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

   4 hours ago


ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

   4 hours ago


హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

   5 hours ago


తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

   5 hours ago


ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle