newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హమ్మయ్య.. నగరంలో కరోనా లేదు.. మంత్రి ఈటల స్పష్టీకరణ

06-03-202006-03-2020 09:19:25 IST
Updated On 06-03-2020 10:18:48 ISTUpdated On 06-03-20202020-03-06T03:49:25.997Z06-03-2020 2020-03-06T03:49:23.126Z - 2020-03-06T04:48:48.167Z - 06-03-2020

హమ్మయ్య.. నగరంలో కరోనా లేదు.. మంత్రి ఈటల స్పష్టీకరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని తెలంగాణ ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు మాత్రమే పాజిటీవ్‌గా తేలిందని, అదీ దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తి అని తెలిపారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగినితో సహా  వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన మరో ఇద్దరి రిపోర్టులు కూడా నెగెటివ్‌గా వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు పూణే నుంచి వచ్చిన పరీక్ష రిపోర్టులను మంత్రి చూపించారు. 

పుణేకు పంపిన ఇద్దరు అనుమానితుల నమూనాల్లో వైరస్ లేదని అక్కడి ప్రయోగశాల ధ్రువీకరించడంతో తెలంగాణ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఇటలీ నుంచి వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్, అపోలో ఆసుపత్రి పారిశుధ్య కార్మికురాలిలో వైరస్ లేదని నిర్ధారణ కావడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖకు కాస్త ఉపశమనం లభించినట్లైంది. గురువారం సాయంత్రం ఈ ఇద్దరికీ కరోనా వైరస్ సోకలేదని తెలియడంతో రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ స్వయంగా విలేకరుల సమావేశం పెట్టి మరీ ఆ సమాచారాన్ని ప్రకటించారు.

భారత్‌లోనూ కరోనా ప్రభావం అంతగాలేదని చెప్పారు. గడిచిన నాలుగు రోజుల నుంచి ప్రజలు, అధికారులు ఎంతో సహకరించారని అన్నారు. రాబోయే రోజుల్లోనూ కరోనా వైరస్‌ను తెలంగాణలోకి రాకుండా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషిని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుందన్నారు. 

‘కరోనాతో ప్రజలు భయపడాల్సిన అవసరంలేదు. మాస్క్‌లను అధిక ధరలకు విక్రయిస్తున్న మెడికల్‌ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటాం. కరోనా అనేది గాలితో వ్యాప్తి చెందదు. నోటి తుంపర్లు ద్వారా కళ్ళలో పడితే వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. వైరస్‌ లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేస్తాం. అనుమానం ఉంటే, డబ్బులు ఉంటే కరోనా టెస్టులు చేయం. వైరస్‌ లక్షణాలను డాక్టర్లు నిర్ధారిస్తేనే పరీక్షలు చేస్తాం. దీనిపై ప్రజలకు మరింత అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి’ అని అన్నారు.

మాస్క్‌ల కోసం పరుగుపందెం

కరోనా వైరస్ ఉనికిని పసిగట్టిన నేపథ్యంలో హైదరాబాద్‌లో నిత్యావసర వస్తువుల కంటే మాస్క్‌లకు డిమాండ్ ఇప్పుడు చుక్కలంటుతోంది. ఎక్కడ బాబు ఒక్క మాస్క్‌ ఉంటే ఇవ్వండి... ఎంతైనా పర్వాలేదు అంటూ ఐటీ ఉద్యోగులు మెడికల్‌ షాపులకు తిరుగుతున్నారు. కనీసం శానిటైజర్‌ అయినా ఉందా అంటూ ఆరా తీస్తున్నారు. నో స్టాక్‌ బోర్డులు పెట్టడంతో వెనుదిరుగుతున్నారు. ఇది ఐటీ కారిడార్‌లోని తాజా పరిస్థితి.

బుధవారం మాదాపూర్‌లోని రహేజా మైండ్‌ స్పేస్‌లో ఓ ఐటీ ఉద్యోగిని కరోనా అనుమానితురాలిగా గుర్తిండంతో ఐటీ కారిడార్‌లో ఒక్క సారిగా కరోనా కల్లోలం మొదలైంది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా మాస్క్‌లు, శానిటైజర్‌ల కోసం ఐటీ ఉద్యోగులు మెడికల్‌ షాపులకు క్యూ కడుతున్నారు.  చాలా చోట్ల మాస్క్‌లు, శానిటైజర్లు లేవని బోర్డులు పెట్టారు. ఎక్కడో ఒక చోట మెడికల్‌ షాపులో మాస్క్‌లు ఉన్నా ఒక్కో మాస్క్‌కు రూ.50 నుంచి రూ.100 వసూలు చేస్తున్నారు.

చదవండి : చుక్కలంటుతున్న మాస్క్‌ల ధరలు పది రెట్లు పెరిగిన రేట్లు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   32 minutes ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   25 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   an hour ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle