హమ్మయ్య కడియం దొరికింది.. ఆ మంత్రి హ్యాపీస్!
15-02-202015-02-2020 08:13:57 IST
2020-02-15T02:43:57.879Z15-02-2020 2020-02-15T02:43:53.175Z - - 17-04-2021

పోయిన వస్తువు దొరికితే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా హ్యాపీగా వున్నారు. తను పొగొట్టుకున్న బంగారు కడియం దొరికింది.. దీనిని క్షేమంగా అతడికి అప్పగించడంతో ఆయన ముఖంలో నవ్వులు విరిశాయి. మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రలో స్థానికంగా జరిగిన ఓ వివాహానికి హాజరైన మంత్రి చూసిన అభిమానులు సెల్ఫీల కోసం క్యూకట్టారు. వారిని నిరాశపరచడం ఇష్టంలేని మంత్రి వారితో ఓపిగ్గా సెల్ఫీలు దిగిన సంగతి తెలిసిందే. సందట్లో సడేమియాలా ఆయ చేతికి ఉండాల్సిన బంగారు కడియం ఎవరో కొట్టేశారు. దీంతో మంత్రిగారికి కోపం వచ్చింది. తన కడియం ఎవరు దొంగిలించారో తెలీక ఆయన అయోమయానికి గురయ్యారు. దీనిపై సోషల్ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. మంత్రిగారి కడియానికే రక్షణ లేదంటూ కామెంట్లు పడ్డాయి. చివరాఖరికి అధికారులు రంగంలోకి దిగారు. ఆ కడియం అంటే మంత్రి కి చాలా సెంటిమెంట్. ఆ కడియం ధరించినప్పటి నుంచి రాజకీయాలలో బాగా కలిసి వచ్చింది. దీంతో ఆ కడియం పోవడంతో మంత్రి చాలా అప్ సెట్ అయ్యారు. తనకు సెంటిమెంట్ ఉన్న కడియం ఎవరు దొంగిలించారే చూడమని పోలీసులు కోరారు.. సాక్షాత్తు మంత్రి కడియం పోవడంతో పోలీసులు వేగవంతంగా దర్యాప్తు ప్రారంభించారు.. ఆ కడియం దొంగను పట్టి ఇస్తే లక్ష బహుమానం అంటూ కూడా ప్రచారం చేశారు. పోగొట్టుకున్న చోట వెతుక్కోవాలని పెద్దలంటారు. అచ్చం అలాగే జరిగింది. కడియం ఎక్కడ పోయిందో అక్కడే లభించింది. పెళ్లి పూర్తి కావడంతో అక్కడ చేసిన ఏర్పాట్లను తొలగిస్తున్న సమయంలో మట్టిలో కూరుకుపోయిన కడియం పెళ్లి వారికి కనిపించింది. మంత్రి గారి కడియం అని తెలుసుకుని మంత్రిగారికి అందచేశారు. తన కడియం తన దరికి చేరడంతో మంత్రి సంతోషంతో వున్నారు. ఆబ్కారీ మంత్రికే టోకరా.. కడియం నొక్కేసిన కేటుగాళ్ళు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు
an hour ago

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి
an hour ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
2 hours ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
2 hours ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
5 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
4 hours ago

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. సరే Prends ఉంటా
6 minutes ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
6 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
20 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
16-04-2021
ఇంకా