హన్మకొండలో కమలం Vs గులాబీ.. ఎంపీ కారుపై గుడ్లదాడి
13-07-202013-07-2020 18:22:42 IST
Updated On 13-07-2020 18:43:26 ISTUpdated On 13-07-20202020-07-13T12:52:42.246Z13-07-2020 2020-07-13T12:42:30.802Z - 2020-07-13T13:13:26.328Z - 13-07-2020

తెలంగాణలో తమ ప్రాబల్యం పెంచుకునేందుకు కమలం నేతలు తెగ తాపత్రయపడుతున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్‌పై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడం కలకలం రేపుతోంది. రెండు పార్టీల మధ్య రగులుతున్న రాజకీయానికి అద్దం పట్టింది. వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేంద్ర లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. వినయ్ భాస్కర్, నరేందర్‌ను అరవింద్.. బిల్లా రంగాలతో పోల్చారు. వీరు భూకబ్జాలకు పాల్పడుతున్నారని, ఒక్కొక్కరిపై చాలా కేసులుంటాయన్నారు. ఈ విమర్శల నేపథ్యంలోనే టీఆర్ఎస్ శ్రేణులు దాడికి యత్నించాయి.కారుపై దాడి నేపథ్యంలో ఎంపీ అరవింద్ మరోసారి టీఆర్ఎస్పై తీవ్రంగా మండిపడ్డారు. ఆ తర్వాత అరవింద్ బయటకు వెళ్తుండగా కొంత మంది టీఆర్ఎస్ నేతలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దూసుకొచ్చారు. అక్కడ్నుంచి బయల్దేరిన అరవింద్ కారును అడ్డుకోవడానికి టీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించాయి. అరవింద్ కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ తర్వాత బీజేపీ కార్యాలయంలోకి వెళ్లడానికి టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించడం, అక్కడేవున్న బీజేపీ నాయకులు వారిని అడ్డుకోవడం జరిగిపోయింది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తోపులాట చోటు చేసుకుంది. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ సొమ్మసిల్లి పడిపోవడంతో టీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. వరంగల్‌లో తాను ‘ఆత్మనిర్భర్ భారత్'పై మీడియా సమావేశానికి హాజరయ్యానని, ఈ సందర్భంగా తనపై దాడికి యత్నించారని అరవింద్ అన్నారు. ఓ ఎంపీపై ఇలా దాడికి పాల్పడటం సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డికి సిగ్గుచేటని విమర్శించారు. పట్టపగలు ఓ ప్రజాప్రతినిధిపై అల్లరిమూకలు దాడికి యత్నించడం ఏంటని నిలదీశారు. అరవింద్‌పై దాడి సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ సర్కారు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కరోనా నివారణలో వైఫల్యం చెందిందన్నారు బండి సంజయ్. అరవింద్ పై గులాబీ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. వరంగల్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. పసుపు బోర్డు హామీ నెరవేర్చని అరవింద్ ఇక్కడికొచ్చి మాట్లాడటం ఏంటన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై, తమయ నాయకులపై విమర్శలు చేసే అర్హత అరవింద్‌కు లేదన్నారు. కబడ్దార్ బీజేపీ నాయకుల్లారా... మా జోలికి వస్తే ఊరుకునేది లేదు.. మీరు అభివృద్ధి చేయరు.. మమ్మల్ని చేయనవ్వరు అంటూ వినయ్ భాస్కర్ మండిపడ్డారు. ఎంపీ అరవింద్‌వి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేంద్ర అన్నారు. వరంగల్‌లో ఒక గజం భూమి కబ్జా చేసినట్లు నిరూపించినా తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. బీజేపీ, టీఆర్ఎస్ వార్ వేడిని రాజేస్తోంది.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
6 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
9 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
12 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
2 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
12 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
10 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
13 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
13 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
7 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
16 hours ago
ఇంకా