newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

స‌ర్కారు వైఖ‌రిపై ఉద్యోగుల అసంతృప్తి

21-02-202021-02-2020 08:10:57 IST
2020-02-21T02:40:57.931Z21-02-2020 2020-02-21T02:40:52.051Z - - 16-04-2021

స‌ర్కారు వైఖ‌రిపై ఉద్యోగుల అసంతృప్తి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో ఉద్యోగుల పీఆర్సీ ఆశ‌లు ఆవిర‌య్యాయి. రెండేళ్లుగా ఇదిగో అదిగో అని ఎదురు చూస్తున్న పీఆర్సీ ఇంకా ఆలస్యం కానుంది. డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు పీఆర్సీ గ‌డువును ప్ర‌భుత్వం పెంచుతూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో ఉద్యోగుల్లో అసంతృప్తి నెల‌కొంది. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నేత‌ల వైఖ‌రిపైనే ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. ఉద్యోగ సంఘాలు ప్ర‌భుత్వంపై ఒత్తిడి తేలేక‌పోతున్నాయ‌నే భావ‌న ఉద్యోగుల్లో నెలకొంది.

అటు ప్ర‌భుత్వంతో గ‌ట్టిగా మాట్లాడ‌లేక‌, ఇటు ఉద్యోగుల‌కు జ‌వాబు చెప్ప‌లేక ఉద్యోగ సంఘాల నేత ప‌రిస్థితి అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా త‌యారైంది. రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉద్యోగులు పీఆర్సీ కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగ‌, ఉపాద్యాయుల వేత‌న స‌వ‌ర‌ణ కోసం 2018 మేలో ప్ర‌భుత్వం క‌మిష‌న్‌ను వేసింది. వాస్త‌వానికి, ఈ క‌మిష‌న్ ఆరు నెల‌ల్లోనే నివేదిక ఇవ్వాల్సి ఉంది. క‌మిష‌న్ నియామ‌కం కాగానే ఉద్యోగ సంఘాల నుంచి విన‌తులు సైతం తీసుకుంది. కానీ, నివేదిక స‌మ‌ర్ప‌ణ‌ను మాత్రం వాయిదా వేస్తూ వ‌స్తోంది.

చివ‌ర‌గా ఈ నెల 24 వ‌ర‌కు ప్ర‌భుత్వం గ‌డువు ఇచ్చింది. ఈ నెల‌లో గ‌డువులోగా నివేదిక వ‌స్తే జూన్ 2న రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం నుంచి కొత్త పీఆర్సీ అమ‌లులోకి వ‌స్తుంద‌ని రాష్ట్రంలో ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు. కానీ, ప్ర‌భుత్వం వేత‌న స‌వ‌ర‌ణ క‌మిష‌న్ గ‌డువును డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు పెంచేసి ఉద్యోగుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో ఉద్యోగులు షాక్ తిన్నారు. ఈ విష‌యంలో ఉద్యోగ సంఘాల నేత‌ల వైఖ‌రిని ప్ర‌శ్నిస్తున్నారు.

ఉద్యోగ సంఘాల నాయ‌కులు ప్ర‌భుత్వంపై ఒత్తిడి తేవ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నార‌ని, నేత‌లు వారి స్వంత ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు స‌న్నిహితంగా ఉండాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు కానీ ఉద్యోగుల ప‌క్షాన పోరాటం చేయ‌లేద‌నే అసంతృప్తి ఉద్యోగుల్లో నెల‌కొంది. దీంతో ఉద్యోగ సంఘాల‌కు ఏం చేయాలో పాలుపోవ‌డం లేదు. టీఎన్‌జీఓ, టీజీఓ నేత‌లు ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని క‌లిసి వెంట‌నే పీఆర్సీ ఇవ్వాల‌ని కోరారు.

పీఆర్సీ ఆలస్యం అయ్యే అవ‌కాశం ఉండ‌టంతో ఉద్యోగుల‌ను కొంత శాంతింప‌జేసేందుకు ప్ర‌స్తుతం 58గా ఉన్న ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సును 61కి పెంచేలా ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఈ మేర‌కు హామీ ఇచ్చినందున‌, ఈ హామీని అయినా అమ‌లు చేయించాల‌ని భావిస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్ల విష‌యంలో టీఎన్‌జీఓ, టీజీఓ స‌హా కొన్ని సంఘాలు ప్ర‌భుత్వంతో స‌ఖ్య‌త‌గా ఉంటూ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవాల‌ని భావిస్తున్నాయి.

ఇక‌, మ‌రికొన్ని సంఘాలు మాత్రం పీఆర్సీ విష‌యంలో ప్ర‌భుత్వ వైఖ‌రిపై బాహాటంగానే అసంతృప్తిని ప్ర‌క‌టిస్తున్నాయి. పీఆర్సీ వెంట‌నే అమ‌లు చేయాల‌ని, అప్ప‌టి లోగా 40 శాతం ఐఆర్ ఇవ్వాల‌ని, ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సును పెంచాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

ఈ మేర‌కు నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని కొన్ని సంఘాలు నిర్ణ‌యించాయి. ఈ విష‌యంలో ఉద్యోగ సంఘాల మ‌ధ్య అభిప్రాయబేధాలు ఉన్నాయి. అయితే, ఉద్యోగుల డిమాండ్లు నెర‌వేర్చ‌డంలో ప్ర‌భుత్వం అవ‌లంభిస్తున్న దాట‌వేత వైఖ‌రి మాత్రం ఉద్యోగ సంఘాల నేత‌ల‌కు త‌ల‌నొప్పిగా మారింది. ప్ర‌భుత్వంపైనా ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   10 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   6 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   9 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   11 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   13 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   15 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   16 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   18 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   18 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   19 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle