newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

స‌ద‌ర్‌.. ప‌క్కా హైద‌రాబాదీ పండుగ‌

29-10-201929-10-2019 07:22:19 IST
Updated On 29-10-2019 17:17:27 ISTUpdated On 29-10-20192019-10-29T01:52:19.246Z29-10-2019 2019-10-29T01:51:44.191Z - 2019-10-29T11:47:27.227Z - 29-10-2019

 స‌ద‌ర్‌.. ప‌క్కా హైద‌రాబాదీ పండుగ‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ‌వ్యాప్తంగా దీపావ‌ళి పండుగ ఎంత ప్ర‌ముఖ‌మైన‌దో హైద‌రాబాదీల‌కు స‌ద‌ర్ పండుగ కూడా అంతే ప్ర‌త్యేక‌మైన‌ది. దీపావ‌ళి రెండో రోజు న‌గ‌రంలో ఈ పండుగ‌ను జ‌రుపుకోవ‌డం అన‌వాయితీ. 80 ఏళ్లుగా హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మైన ఈ పండుగ క్ర‌మంగా తెలంగాణ వ్యాప్తంగా విస్త‌రిస్తోంది. వివిధ జిల్లాల్లో యాద‌వులు పండుగ‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు.

Image result for sadar festival hyderabad"

పాడి ప‌శువుల‌ను యాద‌వులు స్వంత పిల్ల‌ల్లా చూసుకుంటారు. ఎంత‌టి ప‌ని ఉన్నా ప‌శు పోష‌ణ‌లో నిమ‌గ్న‌మై ఉంటారు. ఇలా యాద‌వులంతా తీరిక లేకుండా గ‌డుపుతూ ఉండ‌టంతో ఏడాదికి ఒక‌రోజైనా ఆత్మీయంగా క‌లుసుకోవాల‌నే ఉద్దేశ్యంలో స‌ద‌ర్ పండుగ‌ను ప్రారంభించారు. 80 ఏళ్ల క్రితం న‌గ‌రంలో యాద‌వ పెద్ద‌లు ఈ పండుగ‌ను ప్రారంభించారు. అప్ప‌టి నుంచి నిరంత‌రాయంగా కొన‌సాగుతోంది.

దీపావ‌ళి త‌ర్వాత రెండో రోజున న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన యాద‌వులు త‌మ దున్న‌పోతుల‌ను గజ్జెలు, వివిధ అలంక‌ర‌ణ‌ల‌తో ముస్తాబు చేసి, బ్యాండ్‌, డ‌ప్పుల న‌డుమ నారాయ‌ణ‌గూడ‌లోని వైఎంసీఏ వ‌ద్ద‌కు తీసుకొస్తారు. యాద‌వ యువ‌కులు దున్న‌పోతుల‌తో చేసే విన్యాసాలు ఆక‌ట్టుకుంటాయి. హాకీ స్టిక్స్ చేత ప‌ట్టుకొని దున్న‌పోతుల‌పైన నిల‌బ‌డి విన్యాసాలు చేస్తుంటారు.

తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత స‌ద‌ర్ పండుగ‌కు ప్ర‌త్యేక గుర్తింపు వ‌చ్చింది. నారాయ‌ణ‌గూడ వైఎంసీఎ వ‌ద్ద జ‌రిగే వేడుకల‌కు ప్ర‌భుత్వ‌మే ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఉత్స‌వానికి కేవ‌లం యాద‌వులే కాకుండా తిల‌కించేందుకు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తారు. ముఖ్యంగా, ముషిరాబాద్‌, చ‌ప్ప‌ల్ బ‌జార్‌, పాత‌బ‌స్తీ నుంచి వ‌చ్చే ఊరేగింపులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌లుగా నిలుస్తాయి.

ఆవుల‌ను దైవంగా భావించి కొల‌వ‌డం హిందూ సంప్ర‌దాయంలో భాగ‌మే. కానీ, హైద‌రాబాద్‌లో స‌ద‌ర్ పండుగ సంద‌ర్భంగా దున్న‌పోతుల‌ను పూజించ‌డం మాత్రం ఎక్క‌డా లేని ప్ర‌త్యేక‌త‌. ఇప్పుడు హైద‌రాబాద్‌లోనే కాకుండా వివిధ జిల్లాల్లోనూ యాద‌వులు స‌ద‌ర్ ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు.

ఇక‌, ఇటీవ‌లి కాలంలో స‌ద‌ర్ సంద‌ర్భంగా పంజాబ్‌, హ‌ర్యానాకు చెందిన దున్న‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నాయి. భారీ కాయంతో ఉండే ఇవి స‌ద‌ర్‌లో సంద‌డి చేస్తున్నాయి. న‌గ‌రానికి చెందిన యాద‌వ ప్ర‌ముఖులు ఎంతో ఖ‌ర్చు పెట్టి ఈ దున్న‌పోతుల‌ను పంజాబ్‌, హ‌ర్యానా నుంచి న‌గ‌రానికి తీసుకువ‌స్తున్నారు.

యువ‌రాజ్‌, రాజ‌, విరాట్ వంటి దున్న‌పోతుల‌ను గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా న‌గ‌రానికి తీసుకువ‌స్తున్నారు. ఈ సంవ‌త్స‌రం స‌ర్తాజ్ అనే దున్న‌ను ముషిరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ దున్న‌పోతు బ‌రువు 1600 కిలోలు. వెడ‌ల్పు 15 అడుగులు. హ‌ర్యానాకు చెందిన వీరేంద‌ర్‌సింగ్ అనే వ్య‌క్తికి చెందిన ఈ దున్న విలువ అక్ష‌రాలా రూ.27 కోట్లు.

దీనిని న‌గ‌రానికి తీసుకువ‌చ్చేందుకు రూ.3.5 ల‌క్ష‌లు ఖ‌ర్చ‌య్యింది. దీని పోష‌ణ‌కు రోజుకు రూ.4 వేలు అవుతుంది. ప్ర‌తీరోజు యాపిల్స్‌, బాదం, 20 లీట‌ర్ల పాలు ఈ దున్న‌కు ఆహారంగా పెడ‌తారు. ప్ర‌తీరోజు రెండుసార్లు స్నానం, మ‌సాజ్ చేయ‌డం ప్ర‌త్యేకం. ఇంత‌లా జాగ్ర‌త్త‌గా ఈ దున్న‌పోతును చూసుకుంటారు. ప్ర‌తీయేటా ప్ర‌త్యేకంగా ఉండేందుకు గానూ ఆయా రాష్ట్రాల నుంచి ఈ దున్న‌పోతుల‌ను న‌గ‌రానికి తీసుకువ‌స్తుంటారు.

ఈ సంవ‌త్స‌రం కూడా న‌గ‌రంలో స‌ద‌ర్ ఉత్స‌వానికి ఏర్పాట్లు పూర్త‌య్యాయి. వైఎంసీఏ వ‌ద్ద ఇవాళ రాత్రి వేడుల‌కు యాద‌వులు అన్ని ఏర్పాట్లు చేశారు. న‌గ‌రంలోని న‌లుమూల‌ల నుంచి దున్న‌పోతుల‌ను ఇక్క‌డ‌కు తీసుకురానున్నారు. కేవ‌లం యాద‌వుల‌కే కాకుండా అన్ని వ‌ర్గాల వారికి ఈ పండుగ ప్రత్యేక‌మైన‌ది. ప్ర‌పంచంలో ఎక్క‌డా జ‌ర‌గ‌ని ఈ పండుగ‌ను చూడాలంటే ఇవాళ సాయంత్రం నారాయ‌ణ‌గూడ రావాల్సిందే.

 

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   5 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   6 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   8 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   8 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   9 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   10 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   13 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   13 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   14 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   15 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle