newssting
BITING NEWS :
* సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్, చైనాల మధ్య సుదీర్ఘ చర్చలు. చైనా భూభాగంలోని మోల్డోలో ఉదయం 9 గంటల రాత్రి 9 గంటల వరకు ఆరవ విడత చర్చలు. * మహారాష్ట్ర థానే జిల్లా భివండీలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య. మృతుల్లో 14 ఏళ్లలోపు బాలలు, మహిళలు అధికం. * బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకు సమాజ్‌వాదీ పార్టీ మద్ధతు. సమాజ్‌వాదీ పార్టీ అధికారిక ట్విట్టర్ ద్వారా సోమవారం రాత్రి ప్రకటన. * ముంబై నగరంతోపాటు పలు పరిసర నగరాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరికలు. ముంబై, థానే, రాయగడ్, పూణే, సతార, సిందూర్గ్ ప్రాంతాల్లో మంగళవారం ఉరుముులు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముంబై వాతావరణ శాఖ హెచ్చరికలు. రష్యా దేశంలో భారీ భూకంపం. రష్యాలోని ఇర్కుట్సు రీజియన్ ప్రాంతంలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రష్యన్ ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ వెల్లడి. భూకపంపంతో ప్రజలు భయాందోళనలు. విగత జీవిగా దొరికిన సరూర్ నగర్ తపోవన్‌కాలనీ వద్ద ఆదివారం రాత్రి వరదలో కొట్టుకుపోయిన నవీన్‌కుమార్‌. * కేంద్రంలో తెచ్చిన వ్యవసాయ బిల్లులతో రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య సాగుతున్న విమర్శ, ప్రతి విమర్శలు. * కేంద్ర బిల్లులతో రైతులకు మేలని బీజేపీ వర్గాలు, కొత్తగా తెచ్చిన బిల్లులతో రైతులను తీవ్ర నష్టమని టీఆర్ఎస్ నేతలు ఘాటు విమర్శలు. 280వ రోజుకు చేరుకున్న రాజధాని అమరావతి రైతుల ఉద్యమం. కొనసాగుతున్న శిబిరాల్లో రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం. నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ జరిగే అవకాశం. బుధవారం తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సి ఉన్నా మంగళవారం ఆకస్మిక ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం గమనార్హం. రాష్ట్రంలో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ, షాలతో చర్చకు అవకాశం. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం.

స‌జ్జ‌న‌ర్ సీన్ రిపీట్ చేశారు..?!

06-12-201906-12-2019 09:21:40 IST
Updated On 06-12-2019 11:06:03 ISTUpdated On 06-12-20192019-12-06T03:51:40.020Z06-12-2019 2019-12-06T03:51:36.848Z - 2019-12-06T05:36:03.395Z - 06-12-2019

స‌జ్జ‌న‌ర్ సీన్ రిపీట్ చేశారు..?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
డిసెంబ‌ర్ 12, 2008.. వ‌రంగ‌ల్ న‌గ‌రంలో దారుణం జ‌రిగింది. ఇంజ‌నీరింగ్ విద్యార్థినులు స్వ‌ప్నిక‌, ప్ర‌ణిత‌పై ముగ్గురు యువ‌కులు యాసిడ్‌తో దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో స్వ‌ప్నిక క‌న్నుమూసింది. ప్ర‌ణీతకు తీవ్ర గాయాల‌య్యాయి. ఈ సంఘ‌ట‌న అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపింది. ప్రేమించ‌లేద‌నే నేపంతో ఓ యువ‌తిని హ‌త‌మార్చ‌డంపై ప్ర‌జాగ్ర‌హం వెల్లువెత్తింది.

ఈ ఆగ్ర‌హం చ‌ల్లార‌క‌ముందే దాడికి పాల్ప‌డ్డ ముగ్గురు నిందుతులను ఎన్‌కౌంట‌ర్‌లో మ‌ట్టుబెట్టారు వ‌రంగ‌ల్ పోలీసులు. అరెస్టు చేసి తీసుకెళుతుండ‌గా పోలీసుల‌పైకి ఎదురు తిరిగి పారిపోతుండ‌గా వారిని ఎన్‌కౌంట‌ర్ చేసి చంపారు పోలీసులు. ఈ సంఘ‌ట‌న ప‌ట్ల ప్ర‌జ‌ల్లో హ‌ర్షాతిరక‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. అప్పుడు ముఖ్య‌మంత్రి దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, వ‌రంగ‌ల్ ఎస్పీ వి.సి.స‌జ్జ‌నార్‌.

న‌వంబ‌ర్ 27, 2019.. హైద‌రాబాద్ శివారులో మ‌రో దారుణం జ‌రిగింది. వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ దిశ‌ను న‌లుగురు నిందితులు అత్యాచారం జ‌రిపి స‌జీవ ద‌హ‌నం చేసి దారుణంగా హ‌త‌మార్చారు. ఈ ఘ‌ట‌న‌పై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. త‌న‌కు భ‌యంగా ఉంద‌ని ఈ సంఘ‌ట‌న జ‌ర‌గ‌డానికి కొద్దిసేపు ముందు త‌న చెల్లితో దిశ మాట్లాడిన మాట‌లు దేశ‌ప్ర‌జ‌ల‌ను క‌న్నీరు పెట్టించాయి. దేశ‌వ్యాప్తంగా ఊరూవాడా ఈ ఘ‌ట‌న‌కు వ్య‌తిరేకంగా ర్యాలీలు జ‌రిగాయి.

ఇంత పాశ‌వికంగా హ‌త్య చేసిన నిందితుల‌ను ఉరి తీయాల‌నే డిమాండ్లు పెద్ద ఎత్తున వ‌చ్చాయి. త‌మ‌కు అప్ప‌గించండి వారి చంపేస్తాం అంటూ ప్ర‌జ‌లు రోడ్డెక్కారంటే ప్ర‌జ‌ల్లో ఈ సంఘ‌ట‌న ప‌ట్ల ఎంత‌లా ఆగ్ర‌హావేశా వ‌చ్చాయో అర్థం చేసుకోవ‌చ్చు. కానీ, పోలీసులు చ‌ట్ట ప్ర‌కారం న‌డుచుకున్నారు. నిందితుల‌ను కోర్టులో హాజ‌రుప‌రిచారు.

త‌దుప‌రి విచార‌ణ కోసం కోర్టు అనుమ‌తితో నిందితుల‌ను క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. సీన్ రీక‌న్ట్స‌క్ష‌న్ చేసే స‌మ‌యంలో దిశ‌ను హత్య చేసిన చోటే నిందితుల‌ను పోలీసులు హ‌త‌మార్చారు. అచ్చం వ‌రంగ‌ల్‌లో జ‌రిగిన‌ట్లుగానే పోలీసుల‌పై తిర‌గ‌బ‌డి నిందితులు త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో పోలీసులు నిందితుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేశారు. న‌లుగురు నిందితులూ అక్క‌డిక‌క్క‌డే హ‌త‌మ‌య్యారు.

యాధృచ్చికం ఏంటంటే.. అప్పుడు వ‌రంగ‌ల్‌లో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన‌ప్పుడు వ‌రంగ‌ల్ ఎస్పీగా ఉన్న సజ్జ‌నార్ ఇప్పుడు కూడా సీపీగా ఉన్నారు. వాస్త‌వానికి, ఈ ఘ‌ట‌న జ‌రిగిన రోజు నుంచీ ప్ర‌జ‌లు స‌జ్జ‌నార్‌ను మ‌ళ్లీ వ‌రంగ‌ల్‌లో చేసిన‌ట్లు ఇక్క‌డా ఎన్‌కౌంట‌ర్ చేయాల‌ని కోరుతున్నారు. చివ‌ర‌కు ప్ర‌జ‌లు కోరుకున్న‌ట్లే వ‌రంగ‌ల్ సీన్ రిపీట్ అయ్యింది. స‌జ్జ‌నార్ మ‌రోసారి ప్ర‌జ‌ల్లో హీరోగా నిలిచిపోయారు. ఆయ‌నపై ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle