newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

స్వీయ నిర్బంధంపై హరీష్ రావు సూచనలు

24-03-202024-03-2020 09:11:03 IST
Updated On 24-03-2020 11:37:25 ISTUpdated On 24-03-20202020-03-24T03:41:03.749Z24-03-2020 2020-03-24T03:40:53.718Z - 2020-03-24T06:07:25.280Z - 24-03-2020

స్వీయ నిర్బంధంపై హరీష్ రావు సూచనలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనాను నిరోధించాలంటే జనమంతా సహకరించాలని, మనం గడప దాటకుండా కరోనాను పొలిమేర దాటిద్దాం అన్నారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు.  కరోనా ను అడ్జుకునేందుకు స్వీయ నిర్భంధం తప్ప మరో మార్గం లేదన్నారు.  24 గంటల‌ జనతా‌‌ కర్ఫ్యూ ను విజయవంతం‌ చేసిన మీ అందరికీ అభినందనలు.! ఎన్నో విషయాల్లో సిద్దిపేట దేశానికే ఆదర్శంగా నిలిచింది. కరోనాను అడ్డుకునే క్రతువు లోనూ సిద్దిపేట ‌దేశానికి ఆదర్శం‌‌‌ కావాలి. కరోనాను అడ్డుకునే చర్యలో భాగంగా ఈ నెల 31 వ తేదీ వరకు‌ రాష్ట్రంలో  లాక్‌ డౌన్ ను ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రకటించారన్నారు. 

ప్రభుత్వ సూచనలను తు.చ తప్పకుండా పాఠించండి. రోడ్లపై  సమూహాలుగా గుమికూడవద్దు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. వచ్చే 10 రోజులు చాలా ముఖ్యం. ఇప్పుడు మనం కరోనా మహమ్మారిపై యుద్ధానికి సన్నద్ధమవ్వాలి. స్వీయ నిర్బంధమే శ్రీరామ రక్ష.! మనం గడప దాటకుండా కరోనాను పొలిమేర దాటిద్దామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూను నిఖచ్చిగా పాటించిన మీ అందరికీ అభినందనలు. మీ అందరికీ తెలుసు ఇవాళ ప్రపంచం ముందు ఉన్న మహా విపత్తు కరోనా. కనిపించని శత్రువుతో మమనమంతా యుద్ధం చేస్తున్నాం. ఒకరి నుంచి ఒకరికి సోకే ఈ వ్యాధి విజృభించకుండా ఆపాలంటే ఈ గొలుసు కట్టును, ఈ చైనా లింకును మనం బ్రేక్ చేయాలి. కరోనా క్రిమిని శిక్షించడానికి కావల్సింది క్రమశిక్షణ. చికిత్స కన్నా నివారణోపాయాలను పాటించటమే ముఖ్యం. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ రోజు ఇటలీ, స్పెయిన్ దేశాలు ఘోరమైన పరిస్థితులను అనుభవిస్తున్నాయి. 

చైనా, ఇటలీ, ఇతరత్రా ప్రపంచంలోని ఎన్నో దేశాలు కరోనా మీద పెద్ద యుద్ధం చేస్తున్న క్రమంలో మనం ముందే మేలుకున్నాం. ఆదిలోనే అరికట్టేలా అవసరమైన చర్యలు ప్రారంభించాం. కరోనా కు ద్వారం తెరిచేది అజాగ్రత్త. మన అజాగ్రత్త మనకు మన తోటి వాళ్ళకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. మనం ఒకరికి ఒకరం దూరంగా ఉంటూ దగ్గరవుదామని, చేయి చేయి కలపకుండా నే ఒక కట్టుగా ఉందాం. ఈ జాగ్రత్తలు తీసుకోండి. కరోనాకు అడుగగడున చెక్ పెట్టండి. మన పట్టుదల తో మన రాష్ట్రంలో మన దేశం లో కరోనా క్రిమి ని నశింపచేద్దాం. ఇది ఆరోగ్య ఉద్యమం. శ్వాస మీద దాడి చేసే వ్యాధిని ఎదుర్కునే ఆత్మ విశ్వాసం. స్వీయ నిర్బంధం ద్వారా స్వేచ్చను సాధించే కొత్త పోరాటం.

అనవసరంగా ఇంట్లో నుంచి బయటకు రావొద్దని, ఇంట్లో పిల్లల్ని కూడా బయటకు రానీయకుండా పెద్దలు చూడాలని హరీష్ రావు కోరారు. అత్యవసరమైనప్పుడు కూరగాయలు కొనుగోలుకు మాత్రమే బయటకు రావాలని కోరారు. కరోనాతో మనకేంకాదన్న అలక్ష్యం వద్దు.‌ చైనా, ఇటలీ, స్పెయిన్  దేశాల్లో ప్రజలు అక్కడి ప్రభుత్వ సూచనలు పట్టించుకోకపోవడం వల్ల వేల మంది కరోనా బారిన పడి మృత్యు వాత పడ్డారని, భారీ మూల్యాన్ని చెల్లించక తప్పలేదని ప్రతీ రోజు వందల‌ సంఖ్యలో మరణిస్తున్నారు. మన కుటుంబం, మన రాష్ట్రం, మన దేశం ఈ పరిస్థితులు ఎదుర్కోకూడదంటే.. ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటించాలని ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పాఠిద్దాం. స్వీయ నియంత్రణతో కరోనాను ఖతం చేద్దాం అన్నారు హరీష్ రావు. 

ఈ సమయంలో కుటుంబ సభ్యులు, పిల్లలతో హాయిగా గడపాలని, పుస్తకాలు చదవాలని కోరారు. ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటైన్ చేయాలన్నారు. పబ్లిక్ లైఫ్ లో బిజీ బిజీగా ఉండే వారంతా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ఇతరత్రా వ్యాపార, వాణిజ్య పరమైన లావాదేవీలు నిర్వహించడంలో నిత్యం బిజీగా ఉండే వారు ఈ లాక్ డౌన్ సమయాన్ని అవకాశంగా తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించి శానిటైజర్ తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని కోరారు. విచ్చల విడిగా జనంతో బయటకు రావొద్దని, వచ్చే 10 రోజులు తూ.చ తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటిస్తే.. నష్టం జరిగాక బాధపడే కన్నా, నష్టం జరగక ముందే మేల్కొనడం మేలు అని చెప్పారు.

 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   6 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   8 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   11 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   12 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   13 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   14 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   14 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   15 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   15 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   15 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle