స్వీయనిర్బంధమే శ్రీరామరక్ష.. డీజీపీ మహేందర్ రెడ్డి
23-03-202023-03-2020 13:55:54 IST
Updated On 23-03-2020 14:26:33 ISTUpdated On 23-03-20202020-03-23T08:25:54.462Z23-03-2020 2020-03-23T08:25:31.211Z - 2020-03-23T08:56:33.679Z - 23-03-2020

ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రంగా ఉన్నందున ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలన్నారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. ప్రజా ఆరోగ్యం కోసం ఇవాళ్టి నుంచి 31 మార్చ్ వరకు తెలంగాణ లాక్ డౌన్ అమలులో ఉంటుందని, జివో 45 ద్వారా ప్రజలకు అన్ని విషయాలను తెలియజేశామన్నారు. పబ్లిక్ అండ్ ప్రైవేట్ వెహికిల్స్ మాత్రమే అనుమతి ఉంటుందని. ప్రైవేట్ వెహికిల్స్ ఎమర్జెన్సీ పనులకు మాత్రమే ఉపయోగించాలన్నారు. వచ్చే వారం పది రోజులు క్రమశిక్షణతో ఉండాలని, సమస్యను అరికట్టాలి అంటే ప్రజాలేవరూ రోడ్ల పైకి రావద్దన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని, తెలంగాణ సమాజం కోసం పోలీసులు స్ట్రిక్ గా ఆంక్షలు అమలు చేస్తారన్నారు మహేందర్ రెడ్డి. అజాగ్రత్తగా ఉంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఉదయం పూట నిత్యావసర వస్తువులు కొనుగోలుకు అవకాశం కల్పించి, రాత్రి 7 గంటలకు క్లోజ్ చేస్తామన్నారు. ఒక కాలనీలో వెహికిల్ లో ఒకటి రెండు కిలో మీటర్ల మాత్రమే తిరగాలి. ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారు..ఎక్కువ సార్లు పోలీసుల దృష్టిలో పడితే వెహికిల్ సీజ్ చేస్తారన్నారు. సీజ్ చేసిన వాహనాలు కరోనా వైరస్ తీవ్రత తగ్గిన తరువాత రిలీజ్ చేస్తామన్నారు. ప్రైవేట్ వాహనాలు నిత్యావసర వస్తువులు క్యారీ మాత్రమే అనుమతి వుంటుందని, మీడియాకు ఎక్కడైనా తిరిగే అనుమతులుంటాయన్నారు. చట్టాన్ని కఠినంగా అమలుచేస్తున్నామన్నారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుందని, ప్రతి బైక్ పై ఒక వ్యక్తి... ఫోర్ వీలర్ పై ఇద్దరికి మాత్రమే అనుమతి వుంటుందన్నారు. ఆటో అసోషియేషన్ కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసామని,యాక్ట్ అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఇవాళ్టినుంచి లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని, నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు.

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
3 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
5 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
10 minutes ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
7 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
7 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
an hour ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
8 hours ago

ఇక కేటీఆర్ టైం వచ్చినట్లేనా
9 hours ago

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
18-04-2021

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!
18-04-2021
ఇంకా