స్వామి గౌడ్ కిరికిరికి అసలు రీజన్ అదేనట..!
24-08-202024-08-2020 09:08:32 IST
Updated On 24-08-2020 13:49:38 ISTUpdated On 24-08-20202020-08-24T03:38:32.250Z24-08-2020 2020-08-24T03:33:18.018Z - 2020-08-24T08:19:38.703Z - 24-08-2020

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల్లో స్వామి గౌడ్ ఒకరు. తెలంగాణ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడిగా ఆయన ఉద్యమంలో ఉద్యోగులను ఏకం చేసి ముందుకు నడిపించారు. ఐకాసలో భాగమై, సకల జనుల సమ్మె సహా వివిధ ఉద్యమ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో స్వామి గౌడ్ పాత్ర కీలకం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలామంది ఉద్యమకారుల లాగానే స్వామి గౌడ్ కూడా కోదండరాంను వదిలేసి కేసీఆర్ వెంట నడిచారు. టీఆర్ఎస్ పార్టీలో ఆయన చేరారు. ఉద్యోగుల నాయకుడిగా, ఉద్యమంలో సహచరుడిగా ఉన్న స్వామి గౌడ్‌కు కేసీఆర్ కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఆయనను ఎమ్మెల్సీని చేసి, శాసనమండలి ఛైర్మన్‌గా అవకాశం ఇచ్చారు. అప్పట్లో ఆ పదవి కోసం చాలామంది ప్రయత్నించినా కేసీఆర్ మాత్రం మొదటిసారి ఎమ్మెల్సీ అయిన స్వామి గౌడ్‌కు అవకాశం ఇచ్చారు. స్వామి గౌడ్‌తో పాటు టీజీవో అధ్యక్షుడిగా వ్యవహరించిన శ్రీనివాస్‌గౌడ్‌కు అప్పుడు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. దీంతో ఉద్యమంలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలకు మంచి ప్రాధాన్యత దక్కినట్లయ్యింది. అయితే, శానసమండలి ఛైర్మన్‌గా, ఎమ్మెల్సీగా స్వామి గౌడ్ పదవీకాలం ముగిసింది. నిజానికి ఆయన పదవీకాలం ముగియక ముందే ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నించారనే ప్రచారం జరిగింది. 2018 ఎన్నికల్లో ఆయన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కోసం ప్రయత్నించగా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌కు టిక్కెట్ వచ్చింది. తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ టిక్కెట్ కోసం స్వామి గౌడ్ ప్రయత్నించారు. కానీ, స్వామి గౌడ్‌కు టిక్కెట్ దక్కలేదు. ఆయనను కాదని నాన్ లోకల్ అయిన వ్యాపారవేత్త రంజీత్ రెడ్డికి టిక్కెట్ వచ్చింది. ఈ విషయంలో టీఆర్ఎస్ వైఖరి పట్ల స్వామి గౌడ్ అసంతృప్తికి గురయ్యారు. ఆయనకు రాజకీయాలు అంటే వైరాగ్యం వచ్చేసింది. డబ్బు ఉన్నవారికి, అగ్రకులాలకే రాజకీయాల్లో ప్రాధాన్యత దక్కుతుందనే భావన ఆయనలో ఏర్పడింది. పదవీకాలం ముగిసిన తర్వాత స్వామిగౌడ్‌కు ఎటువంటి ప్రాధాన్యత దక్కడం లేదు. కనీసం ఆయన భవిష్యత్‌కు సంబంధించిన భరోసా కూడా పార్టీ ఇవ్వడం లేదు. దీంతో ఆయన గత కొన్నిరోజులుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అప్పుడప్పుడు ఈ విషయాన్ని బయటపెడుతున్నారు. ఇటీవల రాజకీయాల్లో అగ్రవర్ణాల పెత్తనమే నడుస్తోంది అంటూ ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ సమాజంలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డిని ప్రశంసించారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారైనా రేవంత్ రెడ్డి బడుగు, బలహీనవర్గాల వారికి వెన్నెముకగా ఉంటున్నారని, అటువంటి వారికి మద్దతుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు టీఆర్ఎస్ పార్టీలో కలకలం సృష్టించాయి. రేవంత్ రెడ్డి అంటే టీఆర్ఎస్కు ప్రథమ శత్రువు. తెలంగాణలో టీఆర్ఎస్ను ఎక్కువగా వ్యతిరేకించే వారిలో రేవంత్ మొదట ఉంటారు. అటువంటి వ్యక్తిని స్వామిగౌడ్ పొగడటం, అండగా ఉండాలని పిలుపునివ్వడం అశ్చర్యానికి గురి చేసింది. అయితే, టీఆర్ఎస్ పట్ల పూర్తి అసంతృప్తితో, రాజకీయాల పట్ల వైరాగ్యంతోనే స్వామిగౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారనేది స్పష్టమవుతోంది. తనకు ఇక రాజకీయాల్లో పెద్దగా ఆశలు ఏమీ లేవు. అందుకే ఆయన టీఆర్ఎస్కు కోపం వస్తుందని తెలిసినా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేది స్పష్టమవుతోంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
5 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
2 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
4 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
9 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
11 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
12 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా