newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

స్వామి గౌడ్ అసహనానికి అదే కారణమా?

31-08-202031-08-2020 16:44:33 IST
2020-08-31T11:14:33.507Z31-08-2020 2020-08-31T11:14:29.952Z - - 10-04-2021

స్వామి గౌడ్ అసహనానికి అదే కారణమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారుతోంది. ఆ పార్టీలో సీఎం కేసీయార్, ఆయన తనయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ వాక్కే వేదవాక్కుగా వుంటుంది. పార్టీలో ఎంతమంది సీనియర్లు వున్నా వారంతా వీరిద్దరి మాట కాదనరు. తాజాగా టీఆర్ఎస్ లో ఓ నేత వ్యాఖ్యలు ఇతర నేతల్ని ఇరుకునపడేలా చేస్తున్నాయి.

ప్రశాంతంగా ఉన్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ప్రకంపనలు రేపుతున్నారు. ఇటీవల వివిధ సందర్భాల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. 

ఇంతకుముందే టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. రేవంత్ రెడ్డిపై కేసీయార్, కేటీయార్ ఇతర నేతలు ఆగ్రహంగా వుంటే స్వామిగౌడ్ పాజిటివ్ కామెంట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన వైఖరి గులాబీ దళంలో గుబులు రేపుతోంది.

తాజాగా స్వామిగౌడ్‌ టీఆర్‌ఎస్‌ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో ఉద్యమకారులను కలుపుకుని పోవడంలేదని ఆగ్రహం చెందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమను చూసి హేళన చేసిన వారికి నేడు ప్రభుత్వంలో మంచి గుర్తింపు లభించిందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

స్వామిగౌడ్ అసహనానికి అనేక కారణాలున్నాయి. గత కొద్దికాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. అయినా స్వామిగౌడ్ కి అవకాశం ఇవ్వడంలేదని తెలిపారు. ఉద్యమ సమయంలో వెన్నంటి ఉండి నడిచిన వారికి కూడా కలిసే సమయం ఇవ్వకపోతే మరెవ్వరికి ఇస్తారని టీఆర్‌ఎస్‌ అధినేతపై గుస్సాగా వున్నారు. పార్టీలో ఉద్యమకారులను, బడుగు బలహీన వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడితే మంచిదన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో చేవెళ్ల ఎంపీ టికెట్‌ తనకు ఇస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారని, కానీ తన స్థానంలో మరొకరికి టికెట్‌ కేటాయించారని గుర్తుచేశారు.

ఈ ఏడాది  ఏప్రిల్‌లో శాసనమండలి సభ్యుడిగా, మండలి చైర్మన్‌గా పదవీ కాల పరిమితి ముగిసింది. మరోసారి ఆయనకు అవకాశం ఇస్తారని భావించిన స్వామిగౌడ్‌ ఆశ తీరలేదు. దీంతో తెలంగాణ భవన్ వైపు రావడం మానేశారట. గవర్నర్‌ కోటాలో శాసనమండలికి నామినేట్‌ అయిన స్వామిగౌడ్‌ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించారు. రెండవసారి అధికారంలోకి వచ్చాక శాసనమండలి పదవి ముగిసేలోపు కార్పొరేషన్‌ పదవి దక్కుతుందని ఆశించారు.

కానీ పార్టీ అధిష్టానం నుంచి స్పందన లేకపోవడంతో స్వామిగౌడ్‌ అసంతృప్తితో ఉన్నారు. ఆయనను బుజ్జగించే ప్రయత్నం కూడా చేయడంలేదు. ఇటు టీఆర్ఎస్ నేత, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. త్వరలో ఖాళీ కాబోయే ఎమ్మెల్సీ స్థానాల భర్తీలోనైనా ఈ సీనియర్ నేతలకు బెర్త్ లు కేటాయిస్తారేమో చూడాలి. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle