newssting
BITING NEWS :
ఎన్డీయేతో బంధం తెంచుకున్న అకాలీదళ్. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా అకాలీదళ్ నిర్ణయం. ఈ బిల్లుల ప్రభావం రైతులు, దళితులు, రైతు కూలీల అందరిపై పడిందని తెలిపిన అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రకటన. శనివారం పార్టీ నిర్వహించిన మూడు గంటల ఎమర్జెన్సీ కోర్ కమిటీ సమావేశం అనంతరం నిర్ణయం. 23 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ బంధాన్ని తెగతెంపులు చేసుకున్న అకాలీదళ్ * బాలీవుడ్‌ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌పై కర్ణాటకలోని తుమకూరు కోర్టులో కేసు దాఖలు. కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను ఉగ్రవాదులతో పోల్చుతూ ట్వీట్‌ చేయడాన్ని తప్పుబడుతూ తుమకూరు జేఎంఎఫ్సీ కోర్టులో రమేశ్‌ నాయక్‌ అనే న్యాయవాది పిటిషన్‌ దాఖలు * అత్యంత ప్రతిష్టాత్మకమైన ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఎన్‌ఎల్‌యూ వైస్‌ చాన్సలర్‌గా వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రొఫెసర్‌ పి.శ్రీకృష్ణదేవరావు నియామకం. ప్రస్తుత వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రణబీర్‌ సింగ్‌ పదవీ విరమణ చేయడంతో శ్రీకృష్ణదేవరావు నియామకం. దేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో కీలక బాధ్యతలు నిర్వహించిన శ్రీకృష్ణదేవరావు న్యాయ విద్యలో మార్పులు తీసుకువచ్చేందుకు యూజీసీ నియమించిన నిపుణుల కమిటీలో కూడా ఆయన సభ్యుడిగా కూడా పనిచేశారు * శివసేన నేత, లోక్ సభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఓ స్టార్ హోటల్ లో రహస్యంగా భేటీ అయినట్టు గుప్పుమన్న వార్తలు. ఓ లగ్జరీ హోటల్‌ లో సుమారు గంటన్నర పాటు వీరిమధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ సమావేశం వార్తలు. ఈ సమావేశం నిజమేనని, దీని వెనుక రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేసిన బీజేపీ * అమెరికాలోని హిందూఆధ్యాత్మిక గురువు స్వామి ప్రత్యాగ్‌బోధానంద కన్నుమూత. పెన్సిల్వేనియాలో అర్ష విద్యా గురుకులానికి ఉపాధ్యక్షులుగా ఉన్న ప్రత్యాగ్‌బోధానంద వయసు 69 సంవత్సరాలు. గురుకులం 34వ వార్షిక ఉత్సవాల్లో పాల్గొన్న తర్వాత తీవ్రమైన గుండెపోటు రావడంతో ఈనెల 20తేదీన తుదిశ్వాస విడిచినట్టు తెలిపిన ఆయన శిష్యులు. ప్రత్యాగ్‌బోధానంద పార్థివదేహాన్ని భారత్‌కు తరలింపుకు ప్రయత్నాలు * పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకి వ్యతిరేకంగా పంజాబ్‌లో కొనసాగుతున్న రైల్‌ రోకో ఆందోళన. గత మూడు రోజులుగా రైతులు రైలు పట్టాలపై కూర్చొని నిర్వహిస్తున్న రైల్‌ రోకో. తొలుత కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్ కమిటీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే, ఆ తర్వాత మద్దతు ప్రకటించిన వివిధ సంఘాలు * బాలీవుడ్‌ పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్‌ వ్యవహారం. దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ఎదుట శనివారం హాజరు. వేర్వేరుగా ఐదు గంటలకు పైగా కొనసాగిన విచారణ. నటీమణుల వాగ్మూలాన్ని రికార్డు చేసిన ఎన్సీబీ * ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రలలో పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో అక్కడక్కడా నిలిచిన రాకపోకలు. పలుచోట్ల నీటమునిగిన పంట పొలాలు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నందిగామలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు * అక్టోబరు 1 నుంచి సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతినిచ్చిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పరిస్థితులను గాడిలో పెట్టేందుకు అక్టోబరు 1 నుంచి సినిమా థియేటర్ల తెరిచేందుకు అనుమతినిస్తున్నామని, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యాజిక్ షోలు నిర్వహించేందుకు కూడా అనుమతినిస్తున్నామని ట్వీట్ * నెల్లూరు జిల్లాలో ఇటీవల జరిగిన రౌడీషీటర్ దారుణ హత్య మరువక ముందే చోటు చేసుకున్న మరో ఘటన. చిల్లకూరు మండలం కలవకకొండలో చేజర్ల సుబ్రహ్మణ్యం(38) అనే వ్యక్తి దారుణ హత్య. ఆదివారం ఉదయం అతి కిరాతకంగా చంపేసిన గుర్తు తెలియని వ్యక్తులు. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు * సంగారెడ్డిలో వాగు దాటుతున్న వ్యక్తి వరద నీటిలో గల్లంతు. భారీ వర్షాలకు వాగు దాటుతున్న ముగ్గరు వ్యక్తులు గల్లంతవ్వగా ఇద్దరు వ్యక్తులను ఒడ్డుకు చేర్చిన స్థానికులు. కంగ్టి మండలం జంగి బికి చెందిన 55 ఏళ్ల మంగలి మారుతి కాకి వాగు వరద ఉధృతిలో గల్లంతు. మారుతి ఆచూకీ కోసం మండల రెవెన్యూ అధికారుల గాలింపు చర్యలు.

స్వంత స్కూళ్ళలోనే పరీక్షలు.. మారనున్న బోధనా విధానాలు

21-05-202021-05-2020 08:26:46 IST
Updated On 21-05-2020 10:13:07 ISTUpdated On 21-05-20202020-05-21T02:56:46.080Z21-05-2020 2020-05-21T02:56:34.447Z - 2020-05-21T04:43:07.503Z - 21-05-2020

స్వంత స్కూళ్ళలోనే పరీక్షలు.. మారనున్న బోధనా విధానాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ మీదపడుతోంది. ఇండియాలో కరోనా కేసులు లక్ష దాటిపోయాయి. ఈ ఏడాది పరీక్షల విధానం అస్తవ్యస్తంగా మారింది. కరోనాతో సగం పరీక్షలే ముగిశాయి. మిగతా పరీక్షల  నిర్వహణపై ఇంకా సందిగ్ధత తీరలేదు. తాజాగా కేంద్రం పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ 10వ, 12వ తరగతి పెండింగ్‌ పరీక్షలను విద్యార్థులు చదువుతున్న పాఠశాలల్లోనే నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ తెలిపారు. జూలై నెలాఖరుకు ఫలితాలు ప్రకటిస్తామన్నారు. పరీక్షల నిర్వహణకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. 

పరీక్ష కేంద్రాల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌, విద్యార్థులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలులు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యార్థులు సాధారణ తరగతి బోధన నుంచి డిజిటల్‌ విధానాలకు మళ్లిన నేపథ్యంలో సైబర్‌ సేఫ్టీ మార్గదర్శకాలను సీబీఎస్‌ఈ జారీ చేసింది. డిజిటల్‌ హక్కులు, బాధ్యతలతోపాటు సైబర్‌ మోసాల గురించి వివరించే హ్యాండ్‌ బుక్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

సైబర్‌ బెదిరింపులు, ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపులు, సైబర్‌ తీవ్రవాదం, ఆన్‌లైన్‌ మోసాలు, ప్రలోభాలు వంటి వాటిని క్షుణ్ణంగా వివరించింది. విద్యార్ధులు ఈ విషయంలో జాగ్రత్తలు పాటించేలా పాఠశాలల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని మానవ వనరుల మంత్రిత్వశాఖ తెలిపింది. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో హైదరాబాద్‌లోని పలు ప్రైవేట్‌ పాఠశాలలు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు పాటిస్తూ కొత్త విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నాయి. యూనిసెఫ్‌, ప్రముఖ సంఘాలు ఇప్పటికే రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం పలు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డు పరిధిలోని పాఠశాలలు మార్పులు, చేర్పులకు శ్రీకారం చుడుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 11,500 ప్రైవేట్‌ పాఠశాలలు పనిచేస్తుండగా, రాజధాని పరిధిలోని మూడు జిల్లాల్లో దాదాపు 4 వేలు ఉన్నాయి. పాఠశాలలు ప్రధానంగా చేస్తున్న మార్పులు అనేకం కనిపిస్తున్నాయి.  సాధారణంగా తరగతి గదిలో 30-40 మంది విద్యార్థులు ఉంటారు. భౌతిక దూరం పాటించాలంటే షిఫ్టు విధానం అమలు చేయాలి. అంటే సగం మంది ఒక రోజు బడికి వస్తే మిగిలిన వారు ఇంటి వద్ద ఒకటీ రెండు పీరియడ్లు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు కావాలి. లేదంటే తరగతిని రెండు సెక్షన్లు చేసి నిర్వహించాలి. అది సాధ్యమయ్యే పరిస్థితి లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి.

ప్రతి పాఠశాలలో క్లాస్ రూంతో పాటుప్రవేశ ద్వారం వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌, కాలితో పెడల్‌ను తొక్కితే చేతిలో శానిటైజరు పడేలా పరికరాలు సిద్ధం చేస్తున్నారు. పాఠశాల కార్యాలయ గదులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. స్పోర్ట్స్‌ పీరియడ్‌లో ఆటలు కాకుండా భౌతిక దూరం పాటిస్తూ వ్యాయామాలు చేయించేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. షిఫ్టు విధానంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నందున బస్సుల్లో ఎవరు ఎక్కడ కూర్చోవాలో ముందుగానే సూచనలు చేయాలని భావిస్తున్నారు.

చేతులు మారుతున్న ఏపీలో పోర్టులు..  కాకినాడ పోర్టు అరబిందో కైవ‌సం?!

చేతులు మారుతున్న ఏపీలో పోర్టులు.. కాకినాడ పోర్టు అరబిందో కైవ‌సం?!

   9 hours ago


గ్రేటర్ వరద ప్రాంతాలలో రేవంత్ పర్యటన.. కారుని ఢీ కొడతారా?

గ్రేటర్ వరద ప్రాంతాలలో రేవంత్ పర్యటన.. కారుని ఢీ కొడతారా?

   9 hours ago


ఏపీకి మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాలో కొత్త పుంత‌లు

ఏపీకి మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాలో కొత్త పుంత‌లు

   10 hours ago


యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన 'రవికిషన్'

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన 'రవికిషన్'

   11 hours ago


బీజేపీలో పురందేశ్వ‌రికి కీల‌క ప‌ద‌వి... సామాజిక స‌మీక‌ర‌ణే ఎజెండా

బీజేపీలో పురందేశ్వ‌రికి కీల‌క ప‌ద‌వి... సామాజిక స‌మీక‌ర‌ణే ఎజెండా

   11 hours ago


అంబటి భూకబ్జా లీకులు.. సొంత పార్టీ నేతలే టార్గెట్ చేశారా?

అంబటి భూకబ్జా లీకులు.. సొంత పార్టీ నేతలే టార్గెట్ చేశారా?

   12 hours ago


ఎన్‌డీఏకు అకాలీదళ్‌ గుడ్‌బై.. రైతు వ్యతిరేక బిల్లులపై విభేదం

ఎన్‌డీఏకు అకాలీదళ్‌ గుడ్‌బై.. రైతు వ్యతిరేక బిల్లులపై విభేదం

   12 hours ago


డీకే అరుణకి జాతీయ పదవి.. రెడ్డి సామాజికవర్గంపై బీజేపీ టార్గెట్?

డీకే అరుణకి జాతీయ పదవి.. రెడ్డి సామాజికవర్గంపై బీజేపీ టార్గెట్?

   13 hours ago


ఏపీని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. పంటనష్టం

ఏపీని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. పంటనష్టం

   14 hours ago


తెలంగాణలో ఆడపిల్లను లక్ష్మిలా కొలుస్తున్నారు.. మంత్రి హరీష్ రావు

తెలంగాణలో ఆడపిల్లను లక్ష్మిలా కొలుస్తున్నారు.. మంత్రి హరీష్ రావు

   15 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle