newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

స్వంత‌వారే త‌ల‌నొప్పులు తెస్తున్నారే..!

28-12-201928-12-2019 09:11:34 IST
Updated On 28-12-2019 10:02:20 ISTUpdated On 28-12-20192019-12-28T03:41:34.286Z28-12-2019 2019-12-28T03:41:23.950Z - 2019-12-28T04:32:20.062Z - 28-12-2019

స్వంత‌వారే త‌ల‌నొప్పులు తెస్తున్నారే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జాతీయ పార్టీల్లో నేత‌ల‌కు స్వేచ్ఛ ఎక్కువ‌. ఎవ‌రు ఏం మాట్లాడినా పెద్ద‌గా చ‌ర్య‌లు అంటూ ఏమీ ఉండ‌వు. కాంగ్రెస్‌లోనైతే ఇదీ మ‌రీ ఎక్కువ‌. అందుకే పార్టీకి వ్య‌తిరకంగా మాట్లాడేవారు కూడా ద‌ర్జాగా పార్టీలోనే ఉంటారు.

అయితే, ప్రాంతీయ పార్టీల్లో మాత్రం ఈ ప‌రిస్థితి ఉండ‌దు. పార్టీకి ఇబ్బంది క‌లిగేలా నాయ‌కులు మాట్లాడ‌రు. అలా మాట్లాడితే వెంట‌నే వారికి అధిష్ఠానం నుంచి అక్షింత‌లు ప‌డుతుంటాయి. కానీ, తెలంగాణ రాష్ట్ర స‌మితిలో మాత్రం ఈ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

ఆ పార్టీ నేత‌లు వివిధ అంశాల‌పై ఇష్టారీతిన మాట్లాడుతున్న‌, ప్ర‌భుత్వాన్ని, పార్టీని త‌మ వ్యాఖ్య‌ల‌తో ఇరుకున ప‌డేస్తున్నా నిలువ‌రించ‌డంలో పార్టీ విఫ‌ల‌మ‌వుతోంది. ఇటీవ‌లి సంఘ‌ట‌న‌లే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముందు గులాబీ జెండాకు ఓన‌ర్లం అంటూ మంత్రి ఈటెల రాజేంద‌ర్ చేసిన వ్యాఖ్య‌లు పార్టీలో సంచ‌ల‌నం సృష్టించాయి. ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు ఇంకొంద‌రు కూడా వంత‌పాడారు. సీనియ‌ర్ నేత‌లు కావ‌డంతో పార్టీ తేరుకొని వారిని బుజ్జ‌గించి దారికి తెచ్చుకుంది.

ఇక‌, ప్ర‌భుత్వాన్ని సైతం ఇరుకున పెట్టేలా టీఆర్ఎస్ ప్రజాప్ర‌తినిధులే మాట్లాడుతున్నారు. అధికారులు విఫ‌ల‌మ‌వుతున్నార‌ని నేరుగా చేస్తున్న విమ‌ర్శ‌లు ప్ర‌భుత్వానికే త‌గులుతున్నాయి. అసెంబ్లీ స‌మావేశాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోడ్లు, త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తారు. స‌మ‌స్య‌లు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఏక‌ర‌వు పెట్టారు.

అంటే, స‌మ‌స్య‌లు ఉన్నాయంటే అది గ‌త ఐదేళ్లుగా అధికారంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం లోపం అని ఆ పార్టీ శాస‌న‌స‌భ్యులే అంగీక‌రించిన‌ట్ల‌య్యింది. టీఆర్ఎస్ స‌ర్కార్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన మిష‌న్ భ‌గీరథపై కూడా టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులే పెద‌వి విరుస్తున్నారు. వాస్త‌వానికి ఈ ప్రాజెక్టు చేప‌ట్టిన‌ప్పుడు 2019 క‌ల్లా ఇంటింటికీ న‌ల్లా నీళ్లిచ్చే ఓట్లు అడుగుతామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ వాగ్ధానం చేశారు.

కానీ, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే నాటికి మిష‌న్ భ‌గీర‌థ పూర్తి కాలేదు. చాలా వ‌ర‌కు గ్రామాల‌కు నీళ్లు అందుతున్నాయ‌నేది టీఆర్ఎస్ ప్ర‌భుత్వ వాద‌న‌. కానీ, ఆ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులే మిష‌న్ భ‌గీరథ నీళ్లు రావ‌డం లేదని, ప‌నుల్లో నాణ్య‌త లేద‌ని, మా స్వంత గ్రామానికే నీరు అంద‌డం లేద‌ని ర‌క‌ర‌కాల వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

వాస్త‌వానికి, అధికారుల నిర్ల‌క్ష్యాన్ని ఎత్తి చూపేందుకు వీరు ఇలా మాట్లాడుతున్నా అవి మాత్రం ప్ర‌భుత్వానికే త‌గులుతున్నాయి. మిష‌న్ భ‌గీర‌థ పనుల్లో నాణ్య‌త లేద‌ని, ప‌నులు పూర్తి కాలేద‌ని ఆరోపిస్తున్న ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు టీఆర్ఎస్ నేత‌ల మాట‌లు బ‌లం చేకూరుస్తున్నాయి.

ఇక‌, పాల‌నాప‌రంగానే కాకుండా ఇత‌ర అంశాల్లోనూ టీఆర్ఎస్ నేత‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో ఉంటున్నారు. సున్నితమైన అంశాల్లోనూ నోరు జారి పార్టీకి స‌మ‌స్య‌గా మారుతున్నారు.

ఇటీవ‌ల ఓ ఎమ్మెల్యే రెండు సామాజ‌ిక‌వ‌ర్గాల‌కు బ‌లుపు ఉంటుంద‌నే ర‌కంగా అన‌వ‌స‌ర, అసంద‌ర్భ  వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న చెప్పిన రెండింటిలో ఒకటి స్వ‌యంగా ముఖ్య‌మంత్రి సామాజ‌ిక‌వ‌ర్గం. దీంతో ఆయ‌న‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రావ‌డంతో చివ‌ర‌కు వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది.

ఇటీవ‌ల దిశ నిందితుల ఎన్‌కౌంట‌ర్ ఎంత సున్నిత‌మైన అంశంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. ఎన్‌కౌంట‌ర్ చేయ‌డం ప‌ట్ల టీఆర్ఎస్ స‌ర్కార్‌పై, పోలీసుల‌పై ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు కురిపించారు.

కానీ, టీఆర్ఎస్‌కు చెందిన ఇద్ద‌రు మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధులు మాత్రం ఎన్‌కౌంట‌ర్‌నే త‌ప్పు ప‌ట్టేలా మాట్లాడారు. ఒక‌రైతే దిశను త‌ప్పుప‌ట్టారు. అంత‌కుముందు కూడా హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ బాధితురాలు దిశ‌దే త‌ప్పు అని మాట్లాడి జాతీయ స్థాయిలో విమ‌ర్శ‌లు ఎదుర్కున్నారు. ఇలా టీఆర్ఎస్ నేత‌లు ఎవ‌రికి తోచిన‌ట్లు వారు మాట్లాడుతూ పార్టీకి స‌మ‌స్య‌లు తెస్తున్నారు. ఈ విష‌యంపై పార్టీ పెద్ద‌లు సీరియ‌స్‌గా దృష్టి పెట్ట‌క‌పోతే ఇలానే కొన‌సాగే అవ‌కాశం ఉంది.

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   11 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle