newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సొంత పార్టీ నేతలకే చేదై పోయారా?

12-03-202012-03-2020 08:50:48 IST
Updated On 12-03-2020 11:21:44 ISTUpdated On 12-03-20202020-03-12T03:20:48.653Z12-03-2020 2020-03-12T03:20:24.801Z - 2020-03-12T05:51:44.659Z - 12-03-2020

సొంత పార్టీ నేతలకే చేదై పోయారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి ఒంట‌రి వార‌య్యారు. చిన్న కేసులో వారం రోజులుగా జైలులో ఉన్న ఆయ‌న‌కు స్వంత పార్టీ వారి నుంచే స‌రైన మ‌ద్ద‌తు ల‌భించ‌డం లేదు. రేవంత్ రెడ్డి అరెస్టును ఇంత‌వ‌ర‌కు పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఖండించ‌లేదు. వి.హ‌నుమంత‌రావు లాంటి నాయ‌కులు రేవంత్‌పైనే రివ‌ర్స్ ఎటాక్ చేస్తున్నారు. దీంతో రేవంత్ అనుచ‌రుల్లో కాంగ్రెస్ నేత‌ల ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. త‌మ నాయ‌కుడిని ఉద్దేశించి రైట్ ప‌ర్స‌న్ ఇన్ రాంగ్ పార్టీ అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంపై పోరాడ‌టంలో రేవంత్ రెడ్డి ముందుంటారు. ఒక‌ర‌కంగా వీరి మ‌ధ్య వ్య‌క్తిగ‌త వైరం న‌డుస్తోంది. కేసీఆర్ కుటుంబాన్నే టార్గెట్ చేసి ఆరోప‌ణ‌లు చేస్తుంటారు రేవంత్‌. కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా, పీసీసీ నుంచి అనుమ‌తులు గ‌ట్రా ఏమీ లేకుండా కొత్త విష‌యాల‌ను తెర‌పైకి తీసుకొచ్చి ప్ర‌భుత్వాన్ని కార్న‌ర్ చేస్తుంటారు. ఇప్పుడు ఇదే వీహెచ్ లాంటి సీనియ‌ర్ల‌కు మింగుడు ప‌డ‌టం లేదు.

ఇటీవ‌ల రేవంత్ రెడ్డి మీద గోప‌న్‌ప‌ల్లి భూలావాదేవీల‌కు సంబంధించి అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌లు పెద్ద ఎత్తున వ‌చ్చాయి. ఈ వ్య‌వ‌హారంలో ఓ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌పై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు కూడా తీసుకుంది. అయితే, ఈ భూముల వ్య‌వ‌హారాలకు సంబంధించి త‌నపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు రేవంత్ రెడ్డి స‌రైన రీతిలో కౌంట‌ర్ ఇవ్వ‌లేక‌పోయారు. ఇందుకు బ‌దులుగా ఎదురుదాడికి దిగారు. మంత్రి కేటీఆర్ ఫామ్ హౌజ్ అక్ర‌మం అంటూ ఆయ‌న ఆరోప‌ణ‌లు ప్రారంభించారు.

కేటీఆర్ ఫామ్ హౌజ్ జీఓ నెం.111ను ఉల్లంఘించి క‌ట్టార‌ని రేవంత్ రెడ్డి కొత్త విష‌యాన్ని తెర‌పైకి తెచ్చి ఫామ్ హౌజ్ వ‌ద్ద అనుచ‌రుల‌తో హ‌ల్‌చ‌ల్ చేశారు. ఫామ్ హౌజ్ విష‌యాన్ని బ‌య‌ట‌కు తేవ‌డానికి డ్రోన్ ఉప‌యోగించార‌నేది రేవంత్‌పై అభియోగం. ఈ కేసులో ఆయ‌న‌ను అరెస్ట్ చేసిన‌ప్పుడు కాంగ్రెస్ నేత‌లు నామ‌మాత్రంగానే స్పందించారు. కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌, ష‌బ్బీర్ అలీ వంటి కొంద‌రు సీనియ‌ర్లు మాత్ర‌మే అరెస్టును ఖండించారు.

ఒక పార్ల‌మెంటు స‌భ్యుడిని పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతున్న‌ప్పుడు అరెస్ట్ చేస్తే ఈ విష‌యాన్ని లోక్‌స‌భ‌లో లేవ‌నెత్తే అవ‌కాశం ఉన్నా కాంగ్రెస్ ఆ ప‌ని చేయ‌లేదు. అసెంబ్లీలోనూ ఈ వ్య‌వ‌హారంపై చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్టాల్సి ఉన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అలా చేయ‌లేదు. ఇప్పుడు వి.హ‌నుమంత‌రావు అయితే త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు నిజం కాద‌ని రుజువు చేసుకోవాల్సింది పోయి ప్ర‌త్యారోప‌ణ‌లు చేయ‌డం ఏంట‌ని రేవంత్‌నే ప్ర‌శ్నిస్తున్నారు. పార్టీకి చెప్ప‌కుండా ఎవ‌రి వ్య‌క్తిగ‌త పోరాటాలు వారు చేయ‌డం ఏంట‌ని ఆయ‌న అడుగుతున్నారు. రేవంత్ శైలిపై పార్టీలో చ‌ర్చ జ‌ర‌గాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఇక‌, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి, సీనియ‌ర్ నేత దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మ వ్య‌వ‌హార శైలి కూడా రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. ఏదైతే జీవో నెం.111ను ఉల్లంఘించి కేటీఆర్ ఫామ్ హౌజ్‌ను నిర్మించార‌ని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారో, ఆ జీవోనే ర‌ద్దు చేయాల‌ని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈ జీవో వ‌ల్ల త‌మ ప్రాంతంలో అనేక మంది రైతులు, పారిశ్రామిక‌వేత్త‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, కాంగ్రెస్ హ‌యాంలోనే ఈ జీవోను ర‌ద్దు చేయాల‌ని తాము ప్ర‌తిపాదించామ‌ని చెబుతున్నారు. ఇవ‌న్ని రేవంత్ వ‌ర్గీయుల‌కు ఆగ్ర‌హం తెప్పిస్తున్నాయి. రేవంత్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కొత్త పార్టీ పెట్టాల‌ని కూడా వారు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ చేస్తున్నారు.

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   13 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   9 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   16 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   19 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   a day ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle