newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

సొంత పార్టీని చెడుగుడు ఆడేసిన వీహెచ్

15-04-201915-04-2019 12:50:08 IST
Updated On 15-04-2019 17:32:23 ISTUpdated On 15-04-20192019-04-15T07:20:08.552Z15-04-2019 2019-04-15T07:20:06.983Z - 2019-04-15T12:02:23.206Z - 15-04-2019

సొంత పార్టీని చెడుగుడు ఆడేసిన వీహెచ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వీహెచ్.. పరిచయం అక్కర్లేని పేరు. ఆయన మాట్లాడితే వివాదం.. ఆయన ధర్నా చేస్తే అది వైరల్ న్యూస్. ముక్కుసూటిగా మాట్లాడుతూ తరచూ వివాదాలకు కారణమయ్యే తెలంగాణ కాంగ్రెస్ నేత హన్మంతరావు మరోసారి వార్తల్లో నిలిచారు. ఏ అధికార పక్షాన్నో ఆయన విమర్శించలేదు... ఏకంగా కాంగ్రెస్ విధానాలపైనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా డబ్బున్న బడాబాబులకే అవకాశాలు లభిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. పనిలో పనిగా ఏకంగా బాస్ రాహుల్ గాంధీపై విమర్శ బాణాలు ఎక్కుపెట్టారు.

కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. అందుకే ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా అధినేతపైనే విమర్శలు చేస్తారు. కాంగ్రెస్‌లో కూడా సామాన్యులకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు వీహెచ్.  ఎన్నికల్లో ఎంత ఎక్కువగా డబ్బు ఖర్చుపెట్టే సామర్థ్యం వుంటే అంత తొందరగా పార్టీలో అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి టికెట్లు రావడం లేదని, ఇలా అయితే పార్టీ కోలుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తంచేశారు. 

కొత్తగా వచ్చి చేరుతున్న డబ్బులున్న నాయకులకు అధిక ప్రాధాన్యత లభించడం  వల్ల సీనియర్ నాయకులు, నిజాయితీతో పనిచేసే కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని వీహెచ్ ఆరోపించారు. ఈ విధానంలో మార్పు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఖచ్చితంగా అణగారిన వర్గాలకు అధిక ప్రాధాన్యత దక్కాల్సిన అవసరం ఉందన్నారు. గతంలోనూ అనేక విషయాల్లో వీహెచ్ స్వంత పార్టీ నేతలను, సినిమాల విషయంలో సెన్సార్ బోర్డును చెడుగుడు ఆడేశారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle