సెల్ ఫోన్ చేస్తూ డ్రైవ్ చేస్తే అంతే సంగతులు
15-02-202015-02-2020 16:24:10 IST
2020-02-15T10:54:10.894Z15-02-2020 2020-02-15T10:53:53.355Z - - 12-04-2021

ఈరోజుల్లో ఓ చేతిలో సెల్ ఫోన్, మరో చేతిలో స్టీరింగ్. ఇది కామన్ అయిపోతోంది. ఈ రకమయిన ధోరణి పెరిగిపోవడంపై ట్రాఫిక్ పోలీసులు సీరియస్ అవుతున్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ వాహనాలు నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. సెల్ ఫోన్ యూజ్ చేస్తూ మీరువాహనాన్ని నడుపుతుంటే దానికి స్వస్తి చెప్పండి. లేకపోతే మీ పని అంతే. ఎందుకంటే హైదరాబాద్ లో మొబైల్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. టూ వీలర్లో వాహనదారులతో పాటు వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ ధరించాలని నిబంధన తెచ్చారు. అదే విధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్‌కు జైలు శిక్ష విధించనున్నారు.ఈ రకమైన కేసులను కోర్టులు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నాయి. జరిమానాతోపాటు తాత్కాలిక శిక్షలు కూడా పడుతున్నా మార్పులు రావడం లేదు. మరోవైపు వారిని పట్టుకునేందుకు సీసీ టీవీ కెమెరాల ద్వారా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నా ఫలితం అంతగా కనిపించడం లేదు. జనవరిలో 63 కూడళ్లు, రహదారుల్లో సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్న వారిని గుర్తించారు. బైక్ నడుపుతున్న వారి లో 80 శాతం మంది, కారు డ్రైవర్లలో 40 శాతం మంది సెల్‌ఫోన్ తో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నట్టు గుర్తించారు.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2018లో 14,686 కేసులు, గతేడాది 22,190 కేసులు నమోదు కాగా, జనవరిలో 2284 కేసులో నమోదయ్యాయి.కాగా సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసుల్లో అగ్రస్థానంలో ఢిల్లీ ఉండగా, ఆ తర్వాతి స్థానంలో ముంబై ఉంది.సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు కఠినమయిన చర్యలు తీసుకోవాలని నిర్ఱయించారు. మీకు ఈ అలవాటు ఉంటే మాత్రం వెంటనే దానికి స్వస్తి పలకండి. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంటే ఆ ఫోటోలను ట్రాఫిక్ పోలీసులకు పంపాలని సూచిస్తున్నారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
6 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
9 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
12 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
2 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
12 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
10 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
13 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
13 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
7 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
16 hours ago
ఇంకా